కెనడాలో బేసిక్ ట్యాక్స్ సర్వీస్

మీ పన్ను సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి

మీరు ఇప్పటికే కెనడాలో విక్రయించడానికి Shopifyని ఉపయోగిస్తుంటే, కొత్త కెనడా అమ్మకపు పన్ను ఫీచర్‌లను ఉపయోగించడానికి మీరు మీ స్టోర్‌ను అప్‌డేట్ చేయవచ్చు. మీ స్టోర్ అప్‌డేట్ చేయడానికి అర్హత కలిగి ఉంటే, మీ పన్ను సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయమని ప్రాంప్ట్ చేస్తూ పన్నులు, సుంకాలు పేజీలో బ్యానర్ చూపబడుతుంది.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > పన్నులు, సుంకాలకు వెళ్లండి.

  2. అప్‌డేట్ చేయమని మిమ్మల్ని ప్రాంప్ట్ చేసే బ్యానర్ కనిపిస్తే, పన్ను సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండిపై క్లిక్ చేయండి.

  3. కెనడా పేజీలో, అమ్మకపు పన్నును వసూలు చేయండిపై క్లిక్ చేసి, వర్తించే ప్రాంతాన్ని ఎంచుకోండి మరియు మీకు రిజిస్టర్ అయిన పన్ను నంబర్ ఉంటే దాన్ని ఎంటర్ చేయండి.

  4. అమ్మకపు పన్నును వసూలు చేయండిపై క్లిక్ చేయండి.

  5. ఆప్షనల్: అదనపు అమ్మకపు పన్ను ప్రాంతాలను జోడించడానికి, అమ్మకపు పన్నును వసూలు చేయండిపై క్లిక్ చేసి, వర్తించే ప్రావిన్షియల్ పన్ను ప్రాంతాలను ఎంచుకోండి.

మీరు పన్ను నంబర్ కోసం రిజిస్టర్ కావాల్సిన అవసరం ఉందో లేదో నిర్ణయించండి

మీరు పన్ను నంబర్ కోసం రిజిస్టర్ కావాలా వద్దా అనేది మీ వ్యాపార పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

మీ స్టోర్ కెనడాలో ఉన్నట్లయితే, కింది రెండు షరతులూ నిజమైతే మీరు సాధారణంగా GST/HST అకౌంట్ కోసం రిజిస్టర్ కావాల్సి ఉంటుంది:

  • మీరు పన్ను విధించదగిన ఉత్పత్తులు లేదా సేవలను విక్రయిస్తారు లేదా లీజుకు ఇస్తారు.
  • కెనడాలో పన్ను విధించదగిన విక్రయాల ద్వారా వచ్చే మీ రాబడి, పూర్తయిన గత నాలుగు వరుస క్యాలెండర్ త్రైమాసికాలలో 30,000 CAD కంటే ఎక్కువ, లేదా ప్రస్తుత క్యాలెండర్ త్రైమాసికంలో 30,000 CAD కంటే ఎక్కువ ఉంటుంది.

మీ స్టోర్ కెనడాలో లేకపోతే, కింది రెండు షరతులూ నిజమైతే మీరు సాధారణంగా GST/HST అకౌంట్ కోసం రిజిస్టర్ కావాల్సి ఉంటుంది:

  • మీరు కెనడాలోని కస్టమర్‌లకు పన్ను విధించదగిన ఉత్పత్తులు లేదా సేవలను విక్రయిస్తారు మరియు కెనడాలో ఉన్న గిడ్డంగి నుండి ఆ ఆర్డర్‌లను నెరవేరుస్తారు.
  • గత పన్నెండు నెలల్లో కెనడాలో పన్ను విధించదగిన విక్రయాల ద్వారా మీకు వచ్చిన రాబడి 30,000 CAD కంటే ఎక్కువగా ఉంటుంది.

మునుపటి కేసులలో ఏదైనా మీకు వర్తిస్తే, మీరు మీ విక్రయాలపై పన్నులను వసూలు చేయాలి, ఆ పన్నులను తగిన పన్ను అధికారికి రెమిట్ చేయాలి మరియు పన్ను అధికారికి రెగ్యులర్ రిపోర్ట్‌లను ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీ విక్రయాలు పరిమితి కంటే తక్కువగా ఉంటే, మీరు GST/HST అకౌంట్ కోసం రిజిస్టర్ కావాల్సిన అవసరం లేదు మరియు మీరు పన్నులను వసూలు చేయాల్సిన లేదా రెమిట్ చేయాల్సిన అవసరం లేదు.

మీరు ఉత్పత్తులు, సేవలను విక్రయించే ప్రావిన్స్ వస్తువులు, సేవల పన్ను (GST) నుండి ప్రావిన్షియల్ అమ్మకపు పన్ను (PST)ను విడిగా వసూలు చేస్తే, మీరు ఆ ప్రావిన్స్‌లో కూడా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.

మీరు అమ్మకపు పన్నును వసూలు చేయాల్సిన అవసరం ఉందో లేదో మీకు ఖచ్చితంగా తెలియకపోతే, స్థానిక పన్ను అకౌంటెంట్ లేదా ఇతర పన్ను నిపుణుడిని, అలాగే ప్రావిన్షియల్, ఫెడరల్ పన్ను ఏజెన్సీలను సంప్రదించండి.

మీరు ప్రావిన్షియల్ స్థాయిలో రిజిస్టర్ కావాల్సిన అవసరం ఉందో లేదో నిర్ణయించండి

బ్రిటిష్ కొలంబియా, మానిటోబా, క్యూబెక్, సస్కాచ్వాన్ అనేవి ప్రత్యేక ప్రావిన్షియల్ పన్ను వసూలు చేసే ప్రావిన్స్‌లు. ఈ ఆవశ్యకతలు ప్రావిన్స్‌ను బట్టి మారుతుంటాయి. మరిన్ని వివరాల కోసం, కెనడా పన్నుల రెఫరెన్స్‌ను చూడండి.

ఉదాహరణకు, మీరు ఆయా ప్రావిన్సులలో ఆపరేట్ చేస్తుంటే లేదా అడ్వర్టయిజ్ చేస్తుంటే రిజిస్టర్ కావాల్సి రావచ్చు.

రిజిస్టర్ చేసి, మీ పన్ను నంబర్‌ను జోడించండి

GST/HST కోసం, మీరు CRA (కెనడా రెవెన్యూ ఏజెన్సీ) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావచ్చు. మీరు ప్రావిన్షియల్‌గా రిజిస్టర్ కావాల్సి ఉంటే, నిర్దిష్ట ప్రావిన్షియల్ వెబ్‌సైట్‌లో అలా చేయవచ్చు. కెనడా పన్ను ఏజెన్సీలతో రిజిస్టర్ కావడం అనే లిస్ట్‌ను చూడండి.

మీరు రిజిస్టర్ అయిన తర్వాత, పన్నులు, సుంకాలు పేజీలో మీ పన్ను రిజిస్ట్రేషన్ నంబర్‌ను జోడించండి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > పన్నులు, సుంకాలకు వెళ్లండి.

  2. పన్ను ప్రాంతాల విభాగంలో, కెనడాపై క్లిక్ చేయండి.

  3. కొత్త ప్రాంతంలో వసూలు చేయండిపై క్లిక్ చేసి, వర్తించే ప్రాంతాన్ని ఎంచుకోండి మరియు మీకు రిజిస్టర్ అయిన పన్ను నంబర్ ఉంటే దాన్ని ఎంటర్ చేయండి.

  4. అమ్మకపు పన్నును వసూలు చేయండిపై క్లిక్ చేయండి.

  5. ఆప్షనల్: అదనపు అమ్మకపు పన్ను ప్రాంతాలను జోడించడానికి, కొత్త ప్రాంతంలో వసూలు చేయండిపై క్లిక్ చేసి, వర్తించే ప్రావిన్షియల్ పన్ను ప్రాంతాలను ఎంచుకోండి.

పన్ను సెట్టింగ్‌లను ఓవర్‌రైడ్ చేయండి

మీ స్టోర్‌కు ప్రత్యేకంగా వర్తించే సెట్టింగ్‌లను మీరు ఓవర్‌రైడ్ చేయవచ్చు, అంటే మీరు ఏయే రిజిస్ట్రేషన్ నంబర్‌లను ఎంటర్ చేశారో వాటికి మాత్రమే. మీరు అప్‌డేట్ చేసినప్పుడు కెనడా పన్ను ఓవర్‌రైడ్‌లు ఎలా ప్రభావితమవుతాయి అనే దాని గురించి మరింత సమాచారం కోసం, కెనడా పన్ను ఓవర్‌రైడ్ ఆవశ్యకతలను చూడండి.

డ్రాఫ్ట్ ఆర్డర్‌తో మీ పన్ను సెట్టింగ్‌లను ధృవీకరించండి

లైవ్ ఆర్డర్‌లను ప్రాసెస్ చేయడానికి ముందు, మీరు ఒక డ్రాఫ్ట్ ఆర్డర్‌ను సృష్టించడం ద్వారా మీ పన్ను సెట్టింగ్‌లు సరిగ్గా లెక్కిస్తున్నాయో లేదో ధృవీకరించవచ్చు. అసలైన లావాదేవీలను ప్రభావితం చేయకుండా పన్ను గణనలను టెస్ట్ చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లు > డ్రాఫ్ట్‌లుకు వెళ్లండి.

  2. ఆర్డర్‌ను సృష్టించండిపై క్లిక్ చేయండి.

  3. ఆర్డర్‌కు ఒక ఉత్పత్తిని జోడించండి.

  4. మీరు పన్ను వసూలు కోసం రిజిస్టర్ చేసుకున్న ప్రావిన్స్‌లోని కెనడియన్ షిప్పింగ్ చిరునామా ఉన్న కస్టమర్‌ను జోడించండి.

  5. సరైన పన్ను రేట్లు వర్తింపజేయబడ్డాయో లేదో నిర్ధారించడానికి పన్ను విభాగాన్ని సమీక్షించండి.

  6. పన్ను లెక్కింపు సరిగ్గా ఉన్నట్లు అనిపిస్తే, మీరు డ్రాఫ్ట్ ఆర్డర్‌ను తొలగించవచ్చు. ఒకవేళ పన్ను లెక్కింపు తప్పుగా ఉంటే, మీ పన్ను సెట్టింగ్‌లు, రిజిస్ట్రేషన్‌లను సమీక్షించండి.

పన్ను సెట్టింగ్ సాధారణ సమస్యలను పరిష్కరించండి

మీకు మీ కెనడియన్ పన్ను సెట్టింగ్‌లతో సమస్యలు ఉంటే, ఈ కింది సాధారణ సమస్యలు, పరిష్కారాలను సమీక్షించండి.

పన్ను సెట్టింగ్‌లు సేవ్ కాకపోవడంపై ట్రబుల్ షూట్ చేయండి

మీ పన్ను సెట్టింగ్‌లు సేవ్ కాకపోతే, ఈ కింది సంభావ్య కారణాలను తనిఖీ చేయండి:

బ్రౌజర్ కాష్ సమస్యలు

  1. వేరే బ్రౌజర్‌లో లేదా ఇన్‌కాగ్నిటో విండోలో ఇదే చర్యను చేసి చూడండి.
  2. అక్కడ పని చేస్తే, మీ బ్రౌజర్ కాష్, కుక్కీలను క్లియర్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.

అడ్డుపడుతున్న బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లు

  1. బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లను తాత్కాలికంగా డీయాక్టివేట్ చేయండి.
  2. ఎక్స్‌టెన్షన్‌లు లేని బ్రౌజర్‌ను లేదా ఇన్‌కాగ్నిటో విండోను ఉపయోగించండి.

నెట్‌వర్క్ కనెక్టివిటీ

  1. ఇతర అడ్మిన్ పేజీలు సరిగ్గా లోడ్ అవుతున్నాయో లేదో తనిఖీ చేయండి.
  2. పేజీని రీఫ్రెష్ చేయండి లేదా వేరే నెట్‌వర్క్ కనెక్షన్‌తో ప్రయత్నించండి.
పన్ను రిజిస్ట్రేషన్ కనిపించకపోవడంపై ట్రబుల్ షూట్ చేయండి

పన్ను రిజిస్ట్రేషన్‌ను జోడించిన తర్వాత కూడా అది కనిపించకపోతే, ఈ కింది సంభావ్య కారణాలను తనిఖీ చేయండి:

చెల్లని పన్ను నంబర్ ఫార్మాట్

  1. మీ నంబర్‌ను CRA ఫార్మాట్ ఆవశ్యకతలతో సరిపోల్చండి.
  2. మీ GST/HST నంబర్‌ను 123456789RT0001 ఫార్మాట్‌లో ఎంటర్ చేయండి.

తప్పు ప్రాంతం ఎంచుకోబడింది

  1. ప్రాంతం డ్రాప్‌డౌన్ ఎంపికను సమీక్షించండి.
  2. GST/HST కోసం కెనడాను లేదా PST/QST/RST కోసం సంబంధిత ప్రావిన్స్‌ను ఎంచుకోండి.

మిస్సైన ప్రావిన్షియల్ రిజిస్ట్రేషన్

  1. మీరు BC, MB, QC లేదా SK కోసం ప్రావిన్షియల్ అకౌంట్‌లను జోడించారో లేదో తనిఖీ చేయండి.
  2. మీరు ప్రావిన్షియల్ పన్ను వసూలు చేయాల్సిన ప్రతి ప్రావిన్స్‌కు వేర్వేరు రిజిస్ట్రేషన్‌లను జోడించండి.
తప్పు పన్ను రేట్లపై ట్రబుల్ షూట్ చేయండి

మీ పన్ను రేట్లు తప్పుగా ఉన్నట్లు అనిపిస్తే, ఈ కింది సంభావ్య కారణాలను తనిఖీ చేయండి:

ఉత్పత్తి కేటగిరీలు కేటాయించబడలేదు

  1. ఉత్పత్తులు పేజీకి వెళ్లి, కేటగిరీ ఫీల్డ్‌ను తనిఖీ చేయండి.
  2. మీ ఉత్పత్తులకు తగిన ఉత్పత్తి కేటగిరీలను కేటాయించండి.

అమలులో ఉన్న పన్ను ఓవర్‌రైడ్‌లు

  1. సెట్టింగ్‌లు > పన్నులు, సుంకాలు > కెనడా > పన్ను ఓవర్‌రైడ్‌లుకు వెళ్లండి.
  2. వర్తించకూడని ఏవైనా ఓవర్‌రైడ్‌లు ఉంటే వాటిని సమీక్షించి, తీసివేయండి.

పన్ను-మినహాయింపు ఉన్నట్లుగా మార్క్ చేయబడిన కస్టమర్

  1. పన్ను మినహాయింపు సెట్టింగ్‌ల కోసం కస్టమర్ ప్రొఫైల్‌ను తనిఖీ చేయండి.
  2. పన్ను మినహాయింపు సెట్టింగ్‌లను సమీక్షించండి, వర్తించకపోతే తీసివేయండి.

పన్ను వసూలు చేయకూడదని సెట్ చేయబడిన ఉత్పత్తులు

  1. ఈ ఉత్పత్తిపై పన్ను వసూలు చేయి సెట్టింగ్ కోసం ఉత్పత్తికి చెందిన ధర నిర్ణయం విభాగాన్ని తనిఖీ చేయండి.
  2. ఉత్పత్తిపై పన్ను వేయాల్సి ఉంటే, ఈ ఉత్పత్తిపై పన్ను వసూలు చేయి ఆప్షన్‌ను యాక్టివేట్ చేయండి.
చెక్‌అవుట్ వద్ద పన్ను వసూలు కాకపోవడంపై ట్రబుల్ షూట్ చేయండి

చెక్‌అవుట్ వద్ద పన్ను వసూలు కాకపోతే, ఈ కింది సంభావ్య కారణాలను తనిఖీ చేయండి:

ఈ ప్రాంతం కోసం రిజిస్ట్రేషన్ ఏదీ జోడించబడలేదు

  1. మీ పన్ను సెట్టింగ్‌లను సమీక్షించండి.
  2. మీ GST/HST, ప్రావిన్షియల్ పన్ను రిజిస్ట్రేషన్‌లను జోడించండి.

రిజిస్టర్ చేయబడిన ప్రాంతంలో లేని కస్టమర్ చిరునామా

  1. కస్టమర్ షిప్పింగ్ చిరునామాకు చెందిన ప్రావిన్స్‌ను తనిఖీ చేయండి.
  2. ఆ ప్రావిన్స్‌లో పన్ను వసూలు చేయాల్సిన అవసరం మీకు ఉంటే, తగిన రిజిస్ట్రేషన్‌ను జోడించండి.

స్టోర్ "వసూలు చేయడానికి రిజిస్టర్ కాలేదు"కు సెట్ చేయబడింది

  1. ఈ స్టేటస్ కోసం మీ కెనడా పన్ను సెట్టింగ్‌లను తనిఖీ చేయండి.
  2. మీరు పన్నును వసూలు చేయాల్సి ఉంటే, మీ రిజిస్ట్రేషన్ నంబర్‌లను జోడించండి.

ఇతర ప్రాంతాలలోని కస్టమర్‌లకు విక్రయించండి

మీరు కెనడా వెలుపల ఉన్న కస్టమర్‌లకు విక్రయిస్తుంటే, ఆయా ప్రాంతాలలో మీరు వ్యాట్ (VAT) కోసం రిజిస్టర్ చేసుకొని, దాన్ని వసూలు చేయాల్సి రావచ్చు. మీరు ఎక్కడ విక్రయిస్తున్నారు, మీ ఆర్డర్‌ల విలువ ఎంత అనేదాని ఆధారంగా ఆవశ్యకతలు మారుతాయి.

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కస్టమర్‌లకు విక్రయించండి

మీరు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కస్టమర్‌లకు విక్రయిస్తుంటే, మీ అమ్మకాల విలువ ఆధారంగా UK వ్యాట్ (VAT) కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి రావచ్చు. ఆర్డర్ విలువ £135 GBP కంటే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అనేదాని ఆధారంగా వ్యాట్ (VAT) ఆవశ్యకతలు భిన్నంగా ఉంటాయి.

UK వ్యాట్ (VAT) ఆవశ్యకతలు, EORI నంబర్‌లు, పరిమితులు, అలాగే వ్యాట్ (VAT), సుంకాలను ఎలా నిర్వహించాలి అనేదాని గురించిన పూర్తి వివరాల కోసం, UK పన్నుల రిఫరెన్స్ చూడండి.

యూరోపియన్ యూనియన్‌లోని కస్టమర్‌లకు విక్రయించండి

మీరు EU సభ్య దేశాలలోని కస్టమర్‌లకు ఆర్డర్‌లను షిప్ చేసినప్పుడు, ఆర్డర్ విలువ ఆధారంగా దిగుమతి, సుంకం నియమాలు వర్తిస్తాయి. €150 EUR అంతకంటే తక్కువ ఉన్న ఆర్డర్‌లకు వ్యాట్ (VAT) వర్తిస్తుంది, అలాగే €150 EUR కంటే ఎక్కువ ఉన్న ఆర్డర్‌లకు దిగుమతి వ్యాట్ (VAT), సుంకాలు వర్తిస్తాయి.

మీరు చెక్‌అవుట్ సమయంలో వ్యాట్ (VAT), సుంకాలను వసూలు చేయకపోతే, మీ కస్టమర్ డెలివరీ అయిన తర్వాత షిప్పింగ్ క్యారియర్‌కు వాటిని చెల్లిస్తారు. చెక్‌అవుట్ వద్ద వ్యాట్ (VAT) వసూలు చేయడానికి, మీరు Import One-Stop Shop (IOSS) స్కీమ్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.

EU వ్యాట్ (VAT) ఆవశ్యకతలు, రిజిస్ట్రేషన్ ఆప్షన్‌లు, పరిమితులు, అలాగే IOSS సెటప్ గురించిన పూర్తి వివరాల కోసం, EU పన్నుల రిఫరెన్స్ను చూడండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

GST, HST మధ్య తేడా ఏమిటి?

GST (వస్తువులు, సేవల పన్ను) అనేది 5% ఫెడరల్ పన్ను, ఇది కెనడా అంతటా వర్తిస్తుంది. HST (హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్) అనేది పాల్గొనే ప్రావిన్సులలో (అంటారియో, న్యూ బ్రున్స్‌విక్, న్యూఫౌండ్‌ల్యాండ్ అండ్ లాబ్రడార్, నోవా స్కోటియా, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్) ఫెడరల్ GST, ప్రావిన్షియల్ అమ్మకపు పన్నులను కలిపి ఒకే పన్నుగా మారుస్తుంది. మీరు GST కోసం రిజిస్టర్ చేసుకుంటే, ఆటోమేటిక్‌గా HST కోసం రిజిస్టర్ చేయబడతారు. కెనడియన్ పన్నుల గురించి మరింత తెలుసుకోండి.

నాకు వేర్వేరు ప్రావిన్షియల్ రిజిస్ట్రేషన్‌లు ఎందుకు కావాలి?

బ్రిటిష్ కొలంబియా, మానిటోబా, క్యూబెక్ మరియు సాస్కట్చేవాన్ ప్రావిన్స్‌లు GST నుండి విడిగా ప్రావిన్షియల్ సేల్స్ ట్యాక్స్‌ను వసూలు చేస్తాయి. మీరు ఈ ప్రావిన్స్‌లలోని కస్టమర్‌లకు విక్రయించి, వారి రిజిస్ట్రేషన్ పరిమితులను చేరుకున్నట్లయితే, మీరు ప్రతి ప్రావిన్స్‌లో విడివిడిగా రిజిస్టర్ చేసుకుని, GSTతో పాటు వాటి సంబంధిత ప్రావిన్షియల్ పన్నులను (PST, RST లేదా QST) వసూలు చేయాలి.

అప్‌డేట్ చేసిన తర్వాత నేను ఇప్పటికే ఉన్న నా పన్ను ఓవర్‌రైడ్‌లను ఉపయోగించవచ్చా?

అవును, కొన్ని పరిమితులతో ఉపయోగించవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ నంబర్‌లను ఎంటర్ చేసిన ప్రాంతాలకు మాత్రమే ఓవర్‌రైడ్‌లు వర్తిస్తాయి. వివరణాత్మక ఆవశ్యకతల కోసం, కెనడియన్ పన్ను ఓవర్‌రైడ్ ఆవశ్యకతలను చూడండి.

నా పన్ను రేట్లు సరైనవో కాదో నాకు ఎలా తెలుస్తుంది?

మీరు రిజిస్టర్ చేసుకున్న ప్రాంతాల్లో కస్టమర్ చిరునామా, ఉత్పత్తులతో ఒక డ్రాఫ్ట్ ఆర్డర్‌ను సృష్టించడం ద్వారా మీ పన్ను రేట్లను ధృవీకరించవచ్చు. లెక్కించిన పన్ను రేట్లను కెనడియన్ పన్నుల రిఫరెన్స్‌లో లిస్ట్ చేయబడిన ప్రస్తుత రేట్లతో సరిపోల్చి చూడండి.

అప్‌డేట్ చేసిన తర్వాత నా మొత్తం పన్ను మొత్తాలు ఎందుకు కొద్దిగా భిన్నంగా ఉంటాయి?

కొత్త పన్ను ఫీచర్‌లకు అప్‌డేట్ చేసిన తర్వాత, పన్ను మొత్తాలు ఇన్‌వాయిస్ స్థాయిలో కాకుండా లైన్-ఐటెమ్ స్థాయిలో రౌండ్ చేయబడతాయి. దీని వలన మొత్తం పన్ను మొత్తాలలో చిన్న వ్యత్యాసాలు (సాధారణంగా కొన్ని సెంట్లు) వస్తాయి. పన్ను రౌండింగ్ గురించి మరింత తెలుసుకోండి.

కెనడియన్ పన్ను సెట్టింగ్‌ల గురించి సహాయం పొందండి

కెనడియన్ పన్నుల గురించిన సందేహాల కోసం, మీకు ఏ రకమైన సహాయం కావాలో అన్న దానిని బట్టి మీరు ఎవరిని సంప్రదించాలో ఆధారపడి ఉంటుంది.

వీటి సహాయం కోసం Shopify సపోర్ట్‌ను సంప్రదించండి:

  • మీ Shopify అడ్మిన్‌లో పన్ను రిజిస్ట్రేషన్‌లను ఎలా జోడించాలి లేదా మార్చాలి
  • పన్ను లెక్కలు లేదా సెట్టింగ్‌లతో సాంకేతిక సమస్యలు
  • Shopify పన్ను ఫీచర్‌లు ఎలా పని చేస్తాయో అర్థం చేసుకోవడం
  • పన్ను సెట్టింగ్‌లకు సంబంధించిన ఎర్రర్ మెసేజ్‌లను ట్రబుల్షూటింగ్ చేయడం

వీటి సహాయం కోసం పన్ను నిపుణులు లేదా స్థానిక పన్ను అథారిటీని సంప్రదించండి:

  • మీరు GST/HST లేదా ప్రావిన్షియల్ సేల్స్ పన్ను కోసం రిజిస్టర్ చేసుకోవాలా వద్దా అనేది
  • మీ పన్ను బాధ్యతలను, సమ్మతి (compliance) ఆవశ్యకతలను నిర్ణయించడం
  • పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడం లేదా పన్నులను రెమిట్ చేయడం గురించిన సందేహాలు
  • మీ నిర్దిష్ట పరిస్థితికి వర్తించే పన్ను చట్టాలను అర్థం చేసుకోవడం

కెనడియన్ పన్ను సమస్యల గురించి Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి సిద్ధపడటం

Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి ముందు, మీ సమస్యను వేగంగా పరిష్కరించడంలో సహాయపడటానికి ఈ కింది సమాచారాన్ని సేకరించండి:

  • మీరు ఏమి జరగాలని ఆశిస్తున్నారు, దానికి బదులుగా ఏమి జరుగుతోంది అనే దాని గురించిన వివరణ
  • సమస్యను చూపుతున్న ఆర్డర్‌కు సంబంధించిన అడ్మిన్ లింక్ (ఆర్డర్‌లుకు వెళ్లి, ఆర్డర్‌ను క్లిక్ చేయండి మరియు మీ బ్రౌజర్ నుండి URLని కాపీ చేయండి)
  • వీలైతే, సరిపోల్చడం కోసం పన్నులు సరిగ్గా లెక్కించిన ఆర్డర్‌ అడ్మిన్ లింక్
  • మీ GST/HST రిజిస్ట్రేషన్ నంబర్ మరియు ఏవైనా ప్రావిన్షియల్ పన్ను రిజిస్ట్రేషన్ నంబర్‌లు (PST, QST, RST)
  • కస్టమర్ షిప్పింగ్ చిరునామా (ప్రావిన్స్ మరియు పోస్టల్ కోడ్)
  • సమస్య ఎప్పుడు తలెత్తడం ప్రారంభమైంది
  • ట్రబుల్షూటింగ్ విభాగం నుండి మీరు ఇప్పటికే ప్రయత్నించిన దశలు