EU పన్నులను సెటప్ చేయడం
మీరు Shopifyకి కొత్తయితే, మీరు విక్రయం ప్రారంభించే ముందు, పన్ను వసూలు చేయాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోవాలి. వివిధ VAT సభ్య దేశాలతో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి రావచ్చు. ఆ తర్వాత, యూరోపియన్ యూనియన్‌లో మీరు ఎక్కడ విక్రయించినా సరైన రేట్లను వసూలు చేస్తారని నిర్ధారించుకోవడానికి, మీరు Shopifyలో మీ పన్నులను సెటప్ చేయవచ్చు.
ఈ పేజీలో
మీరు Shopifyలో EU పన్నులను సెటప్ చేయడం ప్రారంభించడానికి ముందు
మీరు పన్నులు వసూలు చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. మీకు ఖచ్చితంగా తెలియకపోతే, స్థానిక పన్ను అధికారులను లేదా ఒక పన్ను నిపుణుడిని సంప్రదించండి. సాధారణంగా, మీరు EUలోని ఇతర దేశాలకు విక్రయించాలని భావిస్తే, VATను వసూలు చేయడం కోసం మీరు మీ స్వంత దేశంలోని పన్ను అధికారులతో రిజిస్టర్ చేసుకోవాలి.
మీరు EUలోని మరొక దేశంలో నిర్దిష్ట విక్రయాల పరిమితిని దాటితే, లేదా మీకు అక్కడ గణనీయమైన వ్యాపార ఉనికి ఉంటే, మీరు వన్ స్టాప్ షాప్ (OSS) స్కీమ్ కోసం రిజిస్టర్ చేసుకోవలసి రావచ్చు లేదా ఆయా ఏజెన్సీలను సంప్రదించి వారితో రిజిస్టర్ చేసుకోవలసి రావచ్చు. ఈ ప్రక్రియ మీ వ్యాపారం ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ విక్రయిస్తారు మరియు ఆయా దేశ ప్రభుత్వాల అవసరాలను బట్టి మారుతుంది. మీరు మీ కస్టమర్‌లకు విధించే రేట్లను, మీరు VAT వసూలు చేయడానికి రిజిస్టర్ చేసుకున్న స్థానం నిర్ధారిస్తుంది.
- మీ స్వదేశంలోని కస్టమర్‌ల కోసం, మీ స్థానిక VAT రేటు ఛార్జ్ చేయబడుతుంది.
- మీ దేశం వెలుపల ఉన్న EU దేశాల కస్టమర్ల కోసం, మీరు రిజిస్ట్రేషన్ పరిమితి అయిన €10,000 EURను మించారా లేదా అనే దాన్ని బట్టి రేటు నిర్ణయించబడుతుంది.
- ఒకవేళ మీరు ఆ పరిమితిని మించకపోతే, మీ స్థానిక VAT రేటు ఛార్జ్ చేయబడుతుంది.
- ఒకవేళ మీరు ఆ పరిమితిని మించితే, మీ కస్టమర్ దేశం యొక్క VAT రేటు ఛార్జ్ చేయబడుతుంది. గమ్యస్థాన దేశం యొక్క VAT రేటును ఛార్జ్ చేయడానికి, మీరు తప్పనిసరిగా ఆ దేశంలో లేదా వన్ స్టాప్ షాప్ (OSS)లో VAT నంబర్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి.
మీకు ఒక దేశంలో గణనీయమైన ఉనికి ఉంటే, మీరు పన్నులను వసూలు చేయడానికి రిజిస్టర్ చేసుకోవాలా వద్దా అని నిర్ధారించుకోవడానికి ఆ దేశపు పన్ను అధికారులను సంప్రదించాలి. మీ వ్యాపారం VAT రిజిస్ట్రేషన్ పరిమితిని మించిపోయిందా లేదా అని నిర్ధారించుకోవడం మీ బాధ్యత.
OSSతో VAT ఛార్జ్ చేయండి
యూనియన్ OSS అని కూడా పిలువబడే వన్ స్టాప్ షాప్ స్కీమ్ అనేది EUలో లొకేషన్‌లను కలిగి ఉండి, ఇతర EU సభ్య దేశాలకు చేసే విక్రయాలకు ఆయా గమ్యస్థాన దేశాల ఆధారంగా VAT ఛార్జ్ చేసి, రెమిట్ చేయాల్సిన వ్యాపారుల కోసం ఉద్దేశించబడింది. ఉత్తర ఐర్లాండ్ ద్వంద్వ హోదా కారణంగా, ఉత్తర ఐర్లాండ్‌లో లొకేషన్‌లు ఉన్న వ్యాపారులు కూడా OSSను ఉపయోగించవచ్చు.
మిగతా అన్ని EU సభ్య దేశాలకు మీ వార్షిక విక్రయాలు €10,000 EUR కంటే తక్కువగా ఉంటే, మీ స్థానిక VAT రేటును ఛార్జ్ చేయడానికి మీరు మైక్రో-బిజినెస్ మినహాయింపును ఉపయోగించవచ్చు లేదా మీ కస్టమర్‌ల లొకేషన్ ఆధారంగా VAT ఛార్జ్ చేయాలనుకుంటే OSS కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
మీ స్టోర్ మీ పన్ను సేవగా Shopify Tax లేదా బేసిక్ ట్యాక్స్‌ను ఉపయోగిస్తే మాత్రమే మీరు OSSను ఉపయోగించగలరు. మీరు EUలో మీ పన్ను లెక్కింపు కోసం ఈ సేవలలో దేనినీ ఉపయోగించకపోతే, మాన్యువల్ పన్ను రేట్లను ఉపయోగించి మీ పన్ను రేట్లను మాన్యువల్‌గా అప్‌డేట్ చేయండి.
మీ VAT రిజిస్ట్రేషన్‌లను సెటప్ చేయడం
మీరు VAT సభ్య దేశాలతో రిజిస్టర్ చేసుకుని, మీ EU VAT నంబర్ను పొందిన తర్వాత, మీరు మీ పన్నులను సెటప్ చేయవచ్చు. Shopify సరైన VAT వసూలు చేసిందని, కంప్లైంట్ అయిన VAT ఇన్‌వాయిస్‌లను జెనరేట్ చేసిందని అలాగే మీ పన్ను బాధ్యతలను మరింత కచ్చితంగా తెలియజేస్తుందని నిర్ధారించుకోవడానికి, మీ VAT రిజిస్ట్రేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండండి. మీరు ప్రారంభించడానికి ముందు, మీ VAT రిజిస్ట్రేషన్‌ను ఎలా ఎంటర్ చేయాలో నిర్ధారించుకోండి:
- మీరు VAT ఛార్జ్ చేయడానికి నిర్దిష్ట దేశాలతో రిజిస్టర్ చేసుకున్నట్లయితే, స్థానిక VAT రిజిస్ట్రేషన్‌ను సెటప్ చేయండి.
- మీరు మీ దేశం వెలుపల విక్రయాలు చేసి, OSS స్కీమ్ కోసం రిజిస్టర్ చేసుకుని, EU సభ్య దేశాల కస్టమర్‌లకు చేసే అన్ని విక్రయాలకు సంబంధించి ఒకే VAT రిటర్న్‌ను సమర్పించాలని ప్లాన్ చేస్తే, OSS VAT రిజిస్ట్రేషన్‌ను సెటప్ చేయండి.
- మీరు మీ దేశం వెలుపల చేసే మొత్తం విక్రయాలు €10,000 EUR లేదా అంతకంటే తక్కువ ఉండి, మీ స్థానిక పన్ను అధికారికి VAT రిటర్న్‌ను సమర్పించాలని ప్లాన్ చేస్తే, మైక్రో-బిజినెస్ VAT రిజిస్ట్రేషన్‌ను సెటప్ చేయండి.
Shopify పన్ను రిజిస్ట్రేషన్‌లు VATను ఎలా వసూలు చేస్తాయనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, EU, యునైటెడ్ కింగ్‌డమ్‌లో పన్ను రిజిస్ట్రేషన్ ప్రవర్తనలను పరిశీలించండి.
స్థానిక VAT రిజిస్ట్రేషన్‌ను సెటప్ చేయండి
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > పన్నులు, సుంకాలుకు వెళ్లండి.
ప్రాంతీయ సెట్టింగ్‌లు విభాగంలో, యూరోపియన్ యూనియన్‌ను క్లిక్ చేయండి.
EU దేశంలో VATను వసూలు చేయండి విభాగంలో, VATను వసూలు చేయండిని క్లిక్ చేయండి.
మీకు VAT రిజిస్ట్రేషన్ ఉన్న దేశాన్ని ఎంచుకుని, ఆపై మీ VAT నంబర్‌ను ఎంటర్ చేయండి.
VATను వసూలు చేయండిని క్లిక్ చేయండి.
ఆప్షనల్: మీరు అదనపు దేశాల్లో VAT వసూలు చేయడానికి రిజిస్టర్ చేసుకున్నట్లయితే, అదనపు VAT నంబర్‌లను జోడించడానికి మరో లొకేషన్‌లో వసూలు చేయండిని క్లిక్ చేయండి.
OSS VAT రిజిస్ట్రేషన్‌ను సెటప్ చేయండి
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > పన్నులు, సుంకాలుకు వెళ్లండి.
ప్రాంతీయ సెట్టింగ్‌లు విభాగంలో, యూరోపియన్ యూనియన్‌ను క్లిక్ చేయండి.
క్రాస్-బోర్డర్ VATను వసూలు చేయండి విభాగంలో, VATను వసూలు చేయండిని క్లిక్ చేయండి.
వన్ స్టాప్ షాప్ (OSS) రిజిస్ట్రేషన్‌ను ఉపయోగించి వసూలు చేయండిని ఎంచుకోండి.
మీకు OSS రిజిస్ట్రేషన్ ఉన్న దేశాన్ని ఎంచుకుని, ఆపై మీ VAT నంబర్‌ను ఎంటర్ చేయండి.
VATను వసూలు చేయండిని క్లిక్ చేయండి.
మైక్రో-బిజినెస్ VAT రిజిస్ట్రేషన్‌ను సెటప్ చేయండి
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > పన్నులు, సుంకాలుకు వెళ్లండి.
ప్రాంతీయ సెట్టింగ్‌లు విభాగంలో, యూరోపియన్ యూనియన్‌ను క్లిక్ చేయండి.
క్రాస్-బోర్డర్ VATను వసూలు చేయండి విభాగంలో, VATను వసూలు చేయండిని క్లిక్ చేయండి.
మీ స్వదేశపు రిజిస్ట్రేషన్‌ను ఉపయోగించి వసూలు చేయండిని ఎంచుకోండి.
మీరు రిజిస్టర్ చేసుకున్న దేశాన్ని ఎంచుకుని, ఆపై మీ VAT నంబర్‌ను ఎంటర్ చేయండి.
VATను వసూలు చేయండిని క్లిక్ చేయండి.