ఉత్పత్తి ధరలలో పన్నులను చేర్చండి

యునైటెడ్ కింగ్‌డమ్ వంటి కొన్ని దేశాల్లో, చాలా రకాల సరుకుల కోసం మీరు ప్రదర్శిత ధరలలో అమ్మకపు పన్నును చేర్చాల్సి ఉంటుంది.

మీరు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసినప్పుడు, పన్ను అనేది Tax = (Tax Rate X Price) / (1 + Tax Rate) సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా లెక్కించబడుతుంది. ఎటువంటి పన్నులు జోడించబడినట్లు కనిపించకపోయినా, పన్ను అనేది మీకు మరియు మీ కస్టమర్‌లకు ఒక లైన్ ఐటెమ్‌గా ప్రదర్శించబడుతుంది. ఉపమొత్తం మరియు మొత్తం సమానంగా ఉంటాయి, కానీ ఒక ఆర్డర్ కోసం మీరు రెమిట్ చేయాల్సిన పన్ను మొత్తం కూడా సూచించబడుతుంది.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > పన్నులు మరియు సుంకాలుకు వెళ్లండి.

  2. ఉత్పత్తి ధర మరియు షిప్పింగ్ రేటులో అమ్మకపు పన్నును చేర్చండిని ఎంచుకోండి.

  3. సేవ్ చేయండిని క్లిక్ చేయండి.

మీ దేశపు పన్ను రేటుకు బదులుగా మీ కస్టమర్ స్థానిక పన్ను రేటును ఉపయోగించడానికి, మీరు విక్రయించే ప్రతి మార్కెట్ కోసం పన్ను కలిపి ఉన్న ధర నిర్ణయంని సెటప్ చేయండి.

పన్నులను చేర్చడానికి మీరు మీ ధరలను సెటప్ చేసిన తర్వాత, మీ ఉత్పత్తి పేజీలలో ఈ ఉత్పత్తికి పన్ను వసూలు చేయండి ఎంపిక చేసి ఉంచండి, తద్వారా పన్నులు ప్రదర్శించబడే ధరలో చేర్చబడతాయి. చెక్‌అవుట్‌లో మొత్తం పక్కన చేర్చబడిన పన్ను మొత్తం కస్టమర్‌లకు ప్రదర్శించబడుతుంది.

పన్నులను చేర్చడానికి మీ ధరలను సెటప్ చేయడం అనేది మీ పన్ను రిపోర్టింగ్‌ను ప్రభావితం చేయదు.

ఉదాహరణకు, మాయ మరియు గాబ్రియేల్ ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు మరియు ఇద్దరికీ ఆన్‌లైన్ స్టోర్‌లు ఉన్నాయి. ఆ ప్రాంతం 10% పన్ను రేటును కలిగి ఉంది మరియు వ్యాపార యజమానులు తమ ధరలలో పన్నులను చేర్చాలా వద్దా అని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.

  • మాయ తన ధరలలో పన్నులను చేర్చదు. ఆమె ఒక ఉత్పత్తిని $100కు లిస్ట్ చేసినట్లయితే, అప్పుడు మొత్తం విక్రయ ధర $110 కోసం, పన్ను $10గా లెక్కించబడుతుంది. దీనికి సూత్రం Total = List Price X (1 + Tax Rate):

    $100 X (1 + 0.1) = $100 X 1.1 = $110

  • గాబ్రియేల్ తను లిస్ట్ చేసిన ధరలలో అన్ని పన్నులను చేర్చాలని నిర్ణయించుకుంటాడు. పన్నుతో కలిపి మొత్తం లిస్ట్ చేసిన ధర $100కు చేరుకోవడానికి, పన్ను భాగాన్ని లెక్కించడానికి పన్ను కలిపి ఉన్న సూత్రం ఉపయోగించబడుతుంది. దీనికి సూత్రం Tax = (Tax Rate X Price) / (1 + Tax Rate):

    ధరలోని పన్ను భాగం = (0.1 X $100) / (1 + 0.1) = $10 / 1.1 = $9.09

    ధరలోని ఉత్పత్తి భాగం = $100 - $9.09 = $90.91

    ఈ లెక్కలు ఆటోమేటిక్‌గా చేయబడతాయి. అన్ని ఆర్డర్‌ల వివరాలలో పన్ను మొత్తం కనిపిస్తుంది, తద్వారా ఛార్జ్ చేసిన అసలు పన్ను మొత్తం గాబ్రియేల్‌కు అలాగే అతని కస్టమర్‌లకు ప్రదర్శించబడుతుంది.

మీ కస్టమర్ దేశం ఆధారంగా పన్నును చేర్చండి లేదా మినహాయించండి

మీరు అంతర్జాతీయంగా విక్రయిస్తుంటే, అప్పుడు మీరు మీ కస్టమర్ లొకేషన్ ఆధారంగా మీ ఉత్పత్తి ధరలలో పన్నులను చేర్చవచ్చు లేదా మినహాయించవచ్చు. యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలు లేదా ప్రాంతాల్లోని కస్టమర్‌లకు వారి స్థానిక విలువ ఆధారిత పన్ను (VAT)తో కలిపి ధరలు ప్రదర్శించబడతాయి, లేదా యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు లేదా ప్రాంతాల్లోని కస్టమర్‌లకు చెక్‌అవుట్‌లో పన్నులు జోడించబడతాయని వారు ఆశిస్తారు కాబట్టి పన్నులు మినహాయించి ప్రదర్శించబడతాయి.

మీరు విక్రయించే ప్రతి మార్కెట్ కోసం పన్ను చేర్పును సెట్ చేస్తారు. ఎలాగో తెలుసుకోవడానికి, పన్ను కలిపి ఉన్న ధర నిర్ణయం మరియు మార్కెట్‌లలో నిర్దిష్ట మార్కెట్‌ల కోసం సుంకాలు మరియు పన్నులను సెట్ చేయండిని చూడండి.

మీరు నిర్దిష్ట ఉత్పత్తులు లేదా ఉత్పత్తుల కలెక్షన్‌ల కోసం పన్ను ఓవర్‌రైడ్‌లను ఉపయోగిస్తుంటే, మీ మార్జిన్‌లు ప్రభావితం కావచ్చు. మీ కస్టమర్ దేశం ఆధారంగా పన్నును చేర్చడం లేదా మినహాయించడం కోసం పరిగణించవలసిన అంశాల గురించి మరింత తెలుసుకోండి.

ఉదాహరణకు, గాబ్రియేల్ 10% పన్ను ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నాడు, పన్నును చేర్చడానికి తన ధరలను సెట్ చేసుకున్నాడు మరియు తన స్వంత ప్రాంతం వెలుపల అనేక ప్రాంతాలకు విక్రయిస్తాడు. అతని కస్టమర్ లొకేషన్ ఆధారంగా పన్నును చేర్చడానికి లేదా మినహాయించడానికి అతని మార్కెట్‌లు సెట్ చేయబడ్డాయి. అతను ఒక ఉత్పత్తిని $100కు విక్రయిస్తాడు.

  • అతని స్వంత ప్రాంతంలో, ఉత్పత్తికి $100 ఖర్చు అవుతుంది. Tax = (Tax Rate X Price) / (1 + Tax Rate) సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా, ధరలోని ఉత్పత్తి భాగం $90.91 అవుతుంది మరియు ధరలోని పన్ను భాగం $9.09 అవుతుంది.
  • గాబ్రియేల్ పన్ను వసూలు చేయాల్సిన అవసరం లేని ప్రాంతాల్లో, చెక్‌అవుట్‌లో ఉత్పత్తి ధర $90.91గా ఉంటుంది, ఇది ధరలోని ఉత్పత్తి భాగం.
  • గాబ్రియేల్ 20% పన్ను రేటుతో పన్ను వసూలు చేయాల్సిన అవసరం ఉన్న ప్రాంతంలో, చెక్‌అవుట్‌లో ఉత్పత్తి ధర $109.09గా ఉంటుంది. ధరలోని ఉత్పత్తి భాగానికి ఆ ప్రాంతం యొక్క 20% పన్ను రేటును వర్తింపజేయడం ద్వారా ఈ ధర లెక్కించబడుతుంది.

Shopify అడ్మిన్‌లోని మీ స్టోర్ అడ్రస్ మీ హోమ్ పన్ను రేటును నిర్ణయించడానికి ఉపయోగించబడుతుంది, మీరు పన్ను కలిపి ఉండే మరో దేశం లేదా ప్రాంతానికి విక్రయించినప్పుడు ఇది పన్ను కలిపి ఉండే మీ ధరల నుండి తీసివేయబడుతుంది. అడ్మిన్‌లో మీ స్టోర్ అడ్రస్‌ను వేరే దేశం లేదా ప్రాంతానికి మార్చడం వలన హోమ్ పన్ను రేటు మారుతుంది.

మీ కస్టమర్ దేశం ఆధారంగా పన్నును చేర్చడం లేదా మినహాయించడం కోసం పరిగణించాల్సిన అంశాలు

మీరు మీ కస్టమర్ లొకేషన్ ఆధారంగా పన్నును చేర్చడానికి లేదా మినహాయించడానికి ముందు, కింద ఉన్న అంశాలను రివ్యూ చేయండి.

  • మీ కస్టమర్ దేశం లేదా ప్రాంతం ఆధారంగా పన్నును చేర్చడానికి లేదా మినహాయించడానికి కింద ఉన్న సందర్భాల్లో సపోర్ట్ లేదు:
    • కొనుగోలు తర్వాతి అప్‌సెల్లింగ్‌ను ఆఫర్ చేసే థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించే స్టోర్‌లు.
    • Google Pay లేదా Apple Pay వంటి యాక్సిలరేటెడ్ చెల్లింపు పద్ధతులకు Shopify Payments ఉపయోగించే వ్యాపారుల కోసం మాత్రమే సపోర్ట్ ఉంది. ఇతర పేమెంట్ గేట్‌వేలను ఉపయోగించే వ్యాపారుల కోసం యాక్సిలరేటెడ్ చెల్లింపు పద్ధతులకు సపోర్ట్ లేదు.
    • మీ కస్టమర్ దేశం ఆధారంగా పన్నును చేర్చడం లేదా మినహాయించడంతో పాటు ఉపయోగించడానికి యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లకు సపోర్ట్ లేదు. మీ కస్టమర్ లొకేషన్ ఆధారంగా మీరు మీ ధరల్లో పన్నును చేర్చాలనుకుంటే లేదా మినహాయించాలనుకుంటే, మీ యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను డీయాక్టివేట్ చేయండి.
  • మీ స్టోర్ అడ్రస్ ద్వారా మీ హోమ్ పన్ను రేటు నిర్ణయించబడుతుంది. ఇది మీ పన్ను ఓవర్‌రైడ్‌లను ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు, ఒకవేళ మీకు 10% పన్ను రేటు ఉన్న ఉత్పత్తి కోసం ఓవర్‌రైడ్ ఉండి, మీ స్టోర్ హోమ్ పన్ను రేటు అంతకంటే ఎక్కువగా ఉంటే, అంతర్జాతీయంగా షిప్పింగ్ చేస్తున్నప్పుడు ఈ ఉత్పత్తుల నుండి ఆ అధిక హోమ్ పన్ను రేటు తీసివేయబడుతుంది. ఇది మీ లాభాలపై ప్రభావం చూపవచ్చు. అలాంటి ఐటెమ్‌లు అంతర్జాతీయంగా షిప్ చేయబడకుండా మీరు నివారించాలనుకుంటే, షిప్పింగ్ ప్రొఫైల్‌లను ఉపయోగించండి.
  • చెక్‌అవుట్ వద్ద ధరను లెక్కించడానికి మీ హోమ్ పన్ను రేటు ఉపయోగించబడుతుంది. వేర్వేరు పన్ను రేట్లు ఉన్న ప్రాంతాల్లో ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్‌లను మీరు కలిగి ఉంటే, ఇది తప్పులకు దారితీయవచ్చు.
  • మీ కస్టమర్ లొకేషన్ ఆధారంగా పన్నును చేర్చినప్పుడు లేదా మినహాయించినప్పుడు, చెక్‌అవుట్ వద్ద ధరలు సరిగ్గా ప్రదర్శించబడతాయి. అయితే, కింద ఉన్న వాటిలో ఏదైనా ఒకటి వర్తిస్తే తప్ప, ఉత్పత్తి పేజీలు లేదా కార్ట్ ధరలను సరిగ్గా ప్రదర్శించవు:
    • మీరు వివిధ కరెన్సీల్లో విక్రయిస్తూ మరియు Shopify Paymentsని ఉపయోగిస్తూ ఉండాలి. ఈ సందర్భంలో, చెక్‌అవుట్ వద్ద, ఉత్పత్తి పేజీల్లో, అలాగే కార్ట్‌లో ధరలు సరిగ్గా ప్రదర్శించబడతాయి.
    • కస్టమర్‌లు ధర అడ్జస్ట్‌మెంట్‌కు అర్హత ఉన్న ప్రాంతంలో ఉన్న అడ్రస్‌ను ఉపయోగించి కొనుగోళ్లు చేయాలి, కుక్కీలను యాక్టివేట్ చేసి ఉండాలి, బ్రౌజర్ క్యాష్‌ను క్లియర్ చేయకుండా ఉండి ఉండాలి, ఇంకా అజ్ఞాత మోడ్‌ను ఉపయోగించి స్టోర్‌ను సందర్శిస్తూ ఉండకూడదు. ఈ సందర్భంలో, తదుపరి స్టోర్ సందర్శనలలో చెక్‌అవుట్ వద్ద, ఉత్పత్తి పేజీల్లో, ఇంకా కార్ట్‌లో ధరలు సరిగ్గా ప్రదర్శించబడతాయి.

పన్ను కలిపి ఉండే ధరలతో పాటు పన్ను మినహాయింపుల కోసం పరిగణించాల్సిన అంశాలు

మీరు మీ ఉత్పత్తి ధరలలో పన్నులను చేర్చితే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెలుపల ఉన్న కస్టమర్‌లకు ఉండే GST మినహాయింపుల లాంటి పన్ను మినహాయించబడిన ధరను మీరు నిర్దిష్ట కస్టమర్‌ల కోసం ప్రదర్శించలేరు.

నిర్దిష్ట కస్టమర్‌లకు పన్ను మినహాయింపు ఇవ్వాల్సి ఉంటే, మీ ధరల్లో పన్నులను చేర్చవద్దు.