మీ UK పన్నులను మేనేజ్ చేయండి

యునైటెడ్ కింగ్‌డమ్‌లో మీరు పన్ను సేకరణను అప్‌డేట్ చేసిన తర్వాత, మీ రిజిస్ట్రేషన్‌లు, ఓవర్‌రైడ్‌లు మరియు కస్టమర్ మినహాయింపులతో సహా మీ పన్ను సెట్టింగ్‌లను మీరు మేనేజ్ చేయవచ్చు.

మీరు రిజిస్టర్ చేయబడిన ప్రాంతాలను మేనేజ్ చేయండి

మీరు మీ రిజిస్ట్రేషన్‌లను లేదా అకౌంట్ నంబర్‌లను ఎప్పుడైనా జోడించవచ్చు, తొలగించవచ్చు లేదా మార్చవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > పన్నులు మరియు సుంకాలుకి వెళ్లండి.

  2. ప్రాంతీయ సెట్టింగ్‌ల విభాగంలో, యునైటెడ్ కింగ్‌డమ్‌పై క్లిక్ చేయండి.

  3. ప్రాంతీయ సెట్టింగ్‌ల విభాగంలో, కిందివాటిలో ఏదైనా ఒకదాన్ని చేయండి:

    1. కొత్త VAT రిజిస్ట్రేషన్‌ను సెటప్ చేయడానికి, VAT వసూలు చేయండి పై క్లిక్ చేయండి.
    2. ఇప్పటికే ఉన్న VAT రిజిస్ట్రేషన్‌ను ఎడిట్ చేయడానికి, హారిజాంటల్ మెనూ పై క్లిక్ చేయండి.
  4. మీ VAT సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.

  5. సేవ్ చేయండి పై క్లిక్ చేయండి.

పన్నులను ఓవర్‌రైడ్ చేయండి

కొన్నిసార్లు నిర్దిష్ట ఉత్పత్తులకు డిఫాల్ట్ పన్ను రేట్లు వర్తించవు. ఉదాహరణకు, నిర్దిష్ట రకాల పిల్లల దుస్తులు పన్ను నుండి మినహాయించబడవచ్చు లేదా తక్కువ పన్ను రేటును కలిగి ఉండవచ్చు. ఒకవేళ డిఫాల్ట్ రేట్లు వర్తించకపోతే, అప్పుడు మీరు ఒక ఓవర్‌రైడ్‌ను సృష్టించాలి.

ఉత్పత్తి పన్ను ఓవర్‌రైడ్‌ను సృష్టించండి

ఉత్పత్తుల కోసం ఓవర్‌రైడ్‌ను సృష్టించడం అనేది రెండు-దశల ప్రాసెస్. ముందుగా, విభిన్న పన్ను రేటును కలిగి ఉన్న ఉత్పత్తులతో మీరు ఒక కలెక్షన్‌ను సృష్టిస్తారు. తర్వాత మీరు ఓవర్‌రైడ్ ఏ ప్రాంతానికి వర్తిస్తుందో, అలాగే ఉపయోగించాల్సిన పన్ను రేటును పేర్కొంటారు.

దశలు:

  1. కిందివాటిని చేయడం ద్వారా ఒక కలెక్షన్‌ను సృష్టించండి:
    1. మీ Shopify అడ్మిన్ నుండి, ఉత్పత్తులు > కలెక్షన్‌లుకు వెళ్లండి.
    2. కలెక్షన్‌ను జోడించండి పై క్లిక్ చేయండి.
    3. టైటిల్‌ను జోడించండి పై క్లిక్ చేసి, ఆపై మీ కలెక్షన్ కోసం ఒక టైటిల్‌ను ఎంటర్ చేయండి.
    4. డిఫాల్ట్ ఉత్పత్తులు సోర్స్‌లో, productఉత్పత్తులను జోడించండిని క్లిక్ చేయండి.
    5. చేర్చాల్సిన ఉత్పత్తులను ఎంచుకోండి డైలాగ్‌లో, మీరు జోడించాలనుకుంటున్న ఉత్పత్తులను ఎంచుకుని, ఆపై జోడించండిని క్లిక్ చేయండి.
    6. సేవ్ చేయండి పై క్లిక్ చేయండి.
  2. కింది వాటిని చేయడం ద్వారా ఓవర్‌రైడ్‌ను సృష్టించండి:
    1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > పన్నులు మరియు సుంకాలుకి వెళ్లండి.
    2. పన్ను ప్రాంతాలు విభాగంలో, దేనికైతే ఓవర్‌రైడ్‌ను సృష్టించాలో ఆ దేశం లేదా ప్రాంతంపై క్లిక్ చేయండి.
    3. పన్ను ఓవర్‌రైడ్‌లు విభాగంలో, ఉత్పత్తి ఓవర్‌రైడ్‌ను జోడించండిపై క్లిక్ చేయండి.
    4. కలెక్షన్‌ను ఎంచుకోండి.
    5. ఓవర్‌రైడ్ వర్తించే ప్రాంతాన్ని ఎంచుకోండి.
    6. ఆ ప్రాంతంలోని కలెక్షన్ కోసం పన్ను రేటును ఎంటర్ చేయండి.
    7. సేవ్ చేయండి పై క్లిక్ చేయండి.

షిప్పింగ్ పన్ను ఓవర్‌రైడ్‌ను సృష్టించండి

షిప్పింగ్ ఛార్జీల పన్నులను కూడా ఓవర్‌రైడ్ చేయవచ్చు. మీ పన్నులు, సుంకాలు పేజీలో పన్ను పాలసీ అమలులో ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా షిప్పింగ్ పన్ను ఓవర్‌రైడ్‌లు అమలులోకి వస్తాయి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > పన్నులు మరియు సుంకాలుకి వెళ్లండి.

  2. ప్రాంతీయ సెట్టింగ్‌ల విభాగంలో, యునైటెడ్ కింగ్‌డమ్‌పై క్లిక్ చేయండి.

  3. షిప్పింగ్ ఓవర్‌రైడ్‌లు విభాగంలో, ఓవర్‌రైడ్‌పై క్లిక్ చేయండి.

  4. ఓవర్‌రైడ్ వర్తించే ప్రాంతాన్ని ఎంచుకోండి.

  5. ఆ ప్రాంతంలో షిప్పింగ్ కోసం పన్ను రేటును ఎంటర్ చేయండి.

  6. సేవ్ చేయండి పై క్లిక్ చేయండి.

మీ పన్ను క్యాలిక్యులేషన్‌లను మేనేజ్ చేయండి

మీ ఉత్పత్తులపై పన్ను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నిర్ణయించే వివిధ సెట్టింగ్‌లను మీరు మేనేజ్ చేయవచ్చు. ఉదాహరణకు, మీ ధరల్లో పన్నులు చేర్చాలా వద్దా, డిజిటల్ వస్తువులపై VAT ఛార్జ్ చేయాలా వద్దా, అలాగే షిప్పింగ్ ఖర్చులకు పన్నును వర్తింపజేయాలా వద్దా అనేవి మీరు సెట్ చేయవచ్చు. మీరు ఈ సెట్టింగ్‌లను పన్నులు, సుంకాలు సెట్టింగ్‌ల పేజీలో మేనేజ్ చేస్తారు. మరింత తెలుసుకోవడానికి పన్ను ఓవర్‌రైడ్‌లు, మినహాయింపులును చూడండి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > పన్నులు మరియు సుంకాలుకి వెళ్లండి.

  2. పన్ను క్యాలిక్యులేషన్‌లు విభాగంలో, వర్తించే ఆప్షన్‌లను ఎంచుకోండి.

  3. సేవ్ చేయండి పై క్లిక్ చేయండి.

పన్ను రౌండ్ చేయడం

గతంలో, ఆర్డర్ ఉపమొత్తంపై పన్నులను లెక్కించడం ద్వారా, ఆపై ఫలితాలను రౌండ్ చేయడం ద్వారా ఇన్‌వాయిస్ స్థాయిలో పన్నులు రౌండ్ చేయబడేవి. UK పన్ను ఫీచర్‌లను ఉపయోగించడానికి మీ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేసిన తర్వాత, లైన్ ఐటెమ్ స్థాయిలో పన్ను మొత్తాలు రౌండ్ చేయబడతాయి. ఈ సందర్భంలో, ఆర్డర్‌లోని ప్రతి లైన్‌కు పన్ను రేటును వర్తింపజేసి, ఫలితాన్ని రౌండ్ చేయడం ద్వారా, ఆపై ఆర్డర్ మొత్తం విలువను తెలుసుకోవడానికి ఈ ఉపమొత్తాలను కలిపి మొత్తం పన్ను విలువ లెక్కించబడుతుంది.

పన్నులను లైన్ స్థాయిలో రౌండ్ చేయడం ద్వారా వివిధ పన్ను రేట్ల క్యాలిక్యులేషన్ మెరుగుపడుతుంది, అలాగే పన్ను విధించదగిన, పన్ను విధించబడని ఉత్పత్తులు ఉన్న ఆర్డర్‌లకు పన్నులను లెక్కించడం సులభతరం అవుతుంది.

ఇన్‌వాయిస్ స్థాయిలో, అలాగే లైన్ ఐటెమ్ స్థాయిలో పన్ను రౌండ్ చేయడానికి ఉదాహరణ

ఒక కస్టమర్ 42 విభిన్న ఐటెమ్‌లకు ఆర్డర్ చేస్తారు, ఒక్కొక్కదాని ధర 14.99 GBP ఉండి, 18% పన్ను విధించబడుతుంది. ప్రతి ఉత్పత్తికి పన్ను రేటు (0.18)తో ధర (14.99 GBP)ని గుణించడం ద్వారా లైన్ ఐటెమ్ పన్ను నిర్ణయించబడుతుంది, ఫలితంగా ఇది 2.6982 GBPకి చేరుతుంది.

గతంలో, ప్రతి లైన్ ఐటెమ్ పన్ను కలిపి, మొత్తం రౌండ్ చేయబడేది. ఈ సందర్భంలో, కలుపబడిన మొత్తం 113.3244 GBP, ఇది 113.32 GBPకి రౌండ్ చేయబడింది.

పన్ను ఇప్పుడు లైన్ ఐటెమ్ స్థాయిలో రౌండ్ చేయబడింది, అంటే ప్రతి ఉత్పత్తికి విడిగా పన్ను మొత్తం రౌండ్ చేయబడుతుంది. లైన్ ఐటెమ్ పన్ను మొత్తం 2.6982 GBP కాస్తా 2.70 GBPకి రౌండ్ చేయబడింది, ఆపై మొత్తాన్ని పొందడానికి అది కలిపి వేయబడుతుంది. ఈ సందర్భంలో, పన్ను మొత్తం 113.40 GBP.

రివర్స్ ఛార్జ్ (EU/UK) మినహాయింపు

ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్ దేశం, గమ్యస్థాన దేశం వేర్వేరుగా ఉన్న పక్షంలో యూరోపియన్ యూనియన్ లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కస్టమర్‌లకు షిప్ చేయబడే ఆర్డర్‌లపై రివర్స్ ఛార్జ్ (EU/UK) మినహాయింపు ద్వారా VAT మినహాయించబడుతుంది. మినహాయింపు వర్తించినప్పుడు, కస్టమర్ ఆర్డర్‌పై VAT ఛార్జ్ చేయబడదు. దానికి బదులుగా వారే స్వయంగా తమ పన్ను రిటర్న్‌లపై VATని రిపోర్ట్ చేసి, చెల్లించాల్సి ఉంటుంది.

అర్హత కలిగిన EU లేదా UK క్రాస్-బోర్డర్ ఆర్డర్‌ల కోసం కస్టమర్‌లు తమ VAT నంబర్‌ను ఎంటర్ చేయడానికి, రివర్స్ ఛార్జ్ మినహాయింపును వర్తింపజేయడానికి మీరు మీ చెక్‌అవుట్‌లో కంపెనీ VAT నంబర్ ఫీల్డ్‌ని ప్రదర్శించవచ్చు. పన్ను మినహాయింపు వర్తించినప్పుడు, VAT ఇన్‌వాయిస్‌కు రివర్స్ ఛార్జ్ విధానం: VAT కోసం గ్రహీత బాధ్యత వహిస్తారు అనే నోట్ జోడించబడుతుంది. ఏదైనా కస్టమర్ లేదా B2B ప్రొఫైల్‌కు ఒక VAT నంబర్‌ను జోడించినప్పుడు, భవిష్యత్తు సూచన కోసం అది ఆటోమేటిక్‌గా ధృవీకరించబడి, ఆ ప్రొఫైల్‌లో స్టోర్ చేయబడుతుంది. యూరోపియన్ యూనియన్ లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లో పన్నును క్యాలిక్యులేట్ చేయడానికి Shopify Taxని ఉపయోగించే స్టోర్‌లకు మాత్రమే చెక్‌అవుట్‌లో VAT ధృవీకరణ అందుబాటులో ఉంటుంది.

ఉదాహరణకు, ఫ్రాన్స్‌లోని ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్ నుండి ఐర్లాండ్‌లోని B2B కస్టమర్‌కు షిప్ చేసిన ఆర్డర్‌కు ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ మినహాయింపు అనేది మీ ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్ ఆధారంగా ఉంటుంది తప్ప, మీ సాధారణ సెట్టింగ్‌లలోని స్టోర్ చిరునామా ఆధారంగా కాదు. రివర్స్ ఛార్జ్ మినహాయింపు అనేది యూరోపియన్ యూనియన్ నుండి ఇతర EU దేశాలకు చేసే ఆర్డర్‌లపై, అలాగే యూరోపియన్ యూనియన్ నుండి UK దేశాలకు చేసే ఆర్డర్‌లపై వర్తిస్తుంది. యునైటెడ్ కింగ్‌డమ్ నుండి యూరోపియన్ యూనియన్‌కు చేసే ఆర్డర్‌లపై, లేదా యునైటెడ్ కింగ్‌డమ్ నుండి యునైటెడ్ కింగ్‌డమ్‌కు చేసే ఆర్డర్‌లపై ఈ మినహాయింపు వర్తించదు. EU/UK రివర్స్ ఛార్జ్ మినహాయింపు సక్రమంగా పని చేయడానికి, యూరోపియన్ యూనియన్‌లో యాక్టివ్ ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్ అవసరం అవుతుంది. ఒకవేళ మీకు బహుళ ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్‌లు ఉంటే, మినహాయింపు సక్రమంగా పని చేయడానికి మీరు కస్టమర్ ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్‌ను వారి షిప్పింగ్ దేశం వెలుపల ఉన్న మరొక లొకేషన్‌కు మార్చవచ్చు.