UK పన్ను సూచన
బ్రెక్సిట్ (Brexit) పరివర్తన కాలం డిసెంబర్ 31, 2020న ముగిసింది. ఫలితంగా, జనవరి 1, 2021 నుండి UK, EU మధ్య విక్రయాలకు కొత్త చట్టాలు వర్తిస్తాయి. మీరు కింది వాటిలో ఒకటైతే, ఈ మార్పు కారణంగా మీ పన్ను ప్రక్రియలను సమీక్షించి, అప్‌డేట్ చేయాల్సి రావచ్చు:
- ఒక UK వ్యాపారి - మీరు యునైటెడ్ కింగ్‌డమ్‌లో వ్యాపారాన్ని కలిగి ఉన్న వ్యాపారి.
- ఒక EU వ్యాపారి - మీరు యునైటెడ్ కింగ్‌డమ్ కాకుండా వేరే ఏదైనా యూరోపియన్ యూనియన్ సభ్య దేశంలో వ్యాపారాన్ని కలిగి ఉన్న వ్యాపారి.
- ఒక EU-యేతర వ్యాపారి - మీరు UK, EU కాకుండా వేరే దేశంలో వ్యాపారాన్ని కలిగి ఉన్న వ్యాపారి.
ఒకవేళ మీరు UK వ్యాపారి అయి ఉండి, EU సభ్య దేశాల కస్టమర్‌లకు విక్రయిస్తుంటే, లేదా మీరు EU వ్యాపారి అయి ఉండి, UKలోని కస్టమర్‌లకు విక్రయిస్తుంటే, అప్పుడు మీ వ్యాపారంలోని అనేక అంశాలపై ప్రభావం చూపే మార్పులు ఉంటాయి.
ఈ పేజీలో
- VAT
- అంతర్జాతీయ వ్యాపారుల కోసం సుంకాలు, స్వదేశీ పన్నుల వసూలు
- మీ పన్ను సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయడం
- తరచుగా అడిగే ప్రశ్నలు
- ఉత్తర ఐర్లాండ్‌లో VAT లెక్కింపు
- మీరు Shopifyలో EU, UK పన్నులను సెటప్ చేయడం ప్రారంభించే ముందు
- UK కోసం మీ VAT రిజిస్ట్రేషన్‌ను సెటప్ చేయండి
- EU కోసం మీ VAT రిజిస్ట్రేషన్‌లను సెటప్ చేయండి
- మీ VAT రిజిస్ట్రేషన్‌లను మేనేజ్ చేయండి
- సంబంధిత లింక్‌లు
VAT
జనవరి 1, 2021న అమలులోకి వచ్చిన కొత్త UK VAT చట్టాలు ఉన్నాయి. ఈ కొత్త చట్టాలు UK కస్టమర్‌లకు విక్రయించే EU, అలాగే EU-యేతర వ్యాపారులందరిపై ప్రభావం చూపుతాయి.
EU వ్యాపారులు ఇతర సభ్య దేశాల్లోని కస్టమర్‌లకు విక్రయించినప్పుడు, ఆ సభ్య దేశంలోని వారి విక్రయాలు నిర్దిష్ట పరిమితిని దాటితే తప్ప, VAT కోసం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరాన్ని తొలగించే సులభతరమైన విధానాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఈ పరిమితి కంటే తక్కువ ఉంటే, వ్యాపారులు తమ సొంత ప్రాంతాలలో మాత్రమే VAT నంబర్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి, లేదా అస్సలు చేసుకోనవసరం లేదు.
పరివర్తన కాలం తర్వాత, EU కస్టమర్‌లకు విక్రయించే UK వ్యాపారులు, అలాగే UK కస్టమర్‌లకు విక్రయించే EU వ్యాపారులు ఈ సులభతరమైన విధానాలను ఉపయోగించలేరు. UK, EU దేశాల మధ్య విక్రయించే వ్యాపారులకు అదనపు దేశాలలో VAT రిజిస్ట్రేషన్‌లు అవసరం కావచ్చు.
| వ్యాపారి లొకేషన్ | మార్పులు, ఆవశ్యకతలు |
|---|---|
| యునైటెడ్ కింగ్‌డమ్ | UK వ్యాపారుల నుండి EU కస్టమర్‌లకు జరిగే వస్తువుల విక్రయాలు డిస్పాచ్‌లు (ఒక EU సభ్య దేశం నుండి మరొక EU సభ్య దేశానికి వస్తువులను పంపడం) కాకుండా ఎగుమతులు (ఒక దేశం లేదా కస్టమ్స్ యూనియన్ నుండి ఆ దేశం లేదా కస్టమ్స్ యూనియన్ వెలుపలకు వస్తువులను పంపడం)గా మారాయి.
UK వ్యాపారులు VAT కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి రావచ్చు, అలాగే EUలో దిగుమతికి సంబంధించిన VAT లెక్కలను చూపాల్సి రావచ్చు. మీ సప్లై చైన్, మీ కస్టమర్‌ల లొకేషన్, అలాగే వస్తువులను ఎక్కడ డెలివరీ చేస్తారు అనే వాటితో సహా (అవి మాత్రమే కాదు) పలు అంశాల ఆధారంగా బహుళ EU సభ్య దేశాల్లో VAT రిజిస్ట్రేషన్‌లు అవసరం కావచ్చు. |
| యూరోపియన్ యూనియన్ | EU వ్యాపారుల నుండి UK కస్టమర్‌లకు జరిగే వస్తువుల విక్రయాలు దిగుమతులు (ఒక దేశం లేదా కస్టమ్స్ యూనియన్ వెలుపల నుండి ఆ దేశం లేదా కస్టమ్స్ యూనియన్‌లోనికి వస్తువులను స్వీకరించడం)గా మారాయి, అంతేగానీ సేకరణలు (ఒక EU సభ్య దేశం నుండి మరొక EU సభ్య దేశానికి వస్తువులను స్వీకరించడం) కాదు.
జనవరి 1, 2021న అమలులోకి వచ్చిన UK VAT చట్టాల ఫలితంగా £135 GBP లేదా అంతకంటే తక్కువ విలువ గల విక్రయాలకు కొత్త VAT ఆవశ్యకతలు ఏర్పడ్డాయి.
|
| UK, EU వెలుపల | జనవరి 1, 2021న అమలులోకి వచ్చిన కొత్త UK VAT చట్టాలు EU-యేతర వ్యాపారుల నుండి UK కస్టమర్‌లకు జరిగే వస్తువుల విక్రయాలకు కూడా వర్తిస్తాయి. UK కస్టమర్‌లకు విక్రయించే EU-యేతర వ్యాపారులు UKలో VAT కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి రావచ్చు.
జనవరి 1, 2021న అమలులోకి వచ్చిన UK VAT చట్టాల ఫలితంగా £135 GBP లేదా అంతకంటే తక్కువ విలువ గల విక్రయాలకు కొత్త VAT ఆవశ్యకతలు ఏర్పడ్డాయి.
|
అంతర్జాతీయ వ్యాపారుల కోసం సుంకాలు మరియు స్థానిక పన్నుల సేకరణ
మీరు UKలో విక్రయిస్తున్న అంతర్జాతీయ వ్యాపారి అయితే, మరియు మీరు సుంకాలు, దిగుమతి పన్నులను యాక్టివేట్ చేస్తే, UK ఆర్డర్‌లపై పన్నును సుంకాల సిస్టమ్ మాత్రమే వసూలు చేస్తుంది. అటువంటి ఆర్డర్‌లకు Shopify బిల్ట్-ఇన్ పన్నుల సేకరణ వర్తించదు.
మీ పన్ను సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయడం
మీరు చేయవలసిన అప్‌డేట్‌లు, మీరు ప్రస్తుతం పన్నులను ఎలా నిర్వహిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటాయి.
Shopify Tax
మీరు Shopify Taxని ఉపయోగిస్తే, మీ ప్రస్తుత రిజిస్ట్రేషన్‌లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. కొత్త రిజిస్ట్రేషన్‌లు ఆటోమేటిక్‌గా జోడించబడవు మరియు మీకు ఇతర దేశాలలో రిజిస్ట్రేషన్‌లు అవసరమైతే, మీకు ఎలాంటి హెచ్చరిక పంపబడదు. ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలో మీకు కచ్చితంగా తెలియకపోతే, స్థానిక పన్ను నిపుణుడిని సంప్రదించండి.
మాన్యువల్ పన్ను
మీరు ఇంకా Shopify Taxకి మైగ్రేట్ కానట్లయితే, మీ ప్రస్తుత పన్ను సెట్టింగ్‌లు అప్‌డేట్ కావు. మీ పన్ను సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయడానికి, Shopify Taxకు అప్‌డేట్ చేయండి లేదా మీ పన్ను రేట్లను మాన్యువల్‌గా అప్‌డేట్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
బ్రెక్జిట్ గురించి నాకు మరింత సమాచారం ఎక్కడ లభిస్తుంది?
బ్రెక్జిట్ మీ వ్యాపారాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే దాని గురించి సమాచారాన్ని పొందడానికి స్థానిక పన్ను నిపుణుడిని సంప్రదించడం ఉత్తమ మార్గం.
ఫిస్కల్ ప్రతినిధి అంటే ఎవరు? నాకు వాళ్ళ అవసరం ఉందా?
ఫిస్కల్ ప్రతినిధులు స్థానిక పన్ను అధికారులతో వ్యవహరించేటప్పుడు మీకు ప్రాతినిధ్యం వహించే స్థానిక కంపెనీలు లేదా వ్యక్తులు. మీ పన్ను రిపోర్టింగ్ నిర్వహణకు మరియు కొన్ని సందర్భాల్లో VAT అప్పులకు వారు బాధ్యత వహిస్తారు.
మీ వ్యాపారం EU మెంబర్ దేశంలో లేనట్లయితే మరియు మీరు అక్కడ కస్టమర్‌లకు విక్రయాలు చేస్తుంటే, మీకంటూ ఒక స్థానిక ప్రతినిధి ఉండాలని కొన్ని EU మెంబర్ దేశాలు కోరుతాయి. జనవరి 1, 2021 తర్వాత, EU కస్టమర్‌లకు విక్రయించేటప్పుడు UK వ్యాపారులు ఒక ఫిస్కల్ ప్రతినిధిని నియమించాల్సి రావచ్చు. అన్ని EU మెంబర్ దేశాలకు ఫిస్కల్ ప్రతినిధి అవసరం లేదు మరియు ఈకామర్స్ విక్రేతలకు ఈ ఆవశ్యకతలు తక్కువగా ఉండవచ్చు.
ఒకవేళ EU మెంబర్ దేశంలో మీరు ఫిస్కల్ ప్రతినిధిని నియమించాలా వద్దా అని మీకు కచ్చితంగా తెలియకపోతే, వారి పన్ను అధికారులను లేదా స్థానిక పన్ను నిపుణుడిని సంప్రదించండి.
నాకు కొత్త EORI నంబర్ అవసరమా?
అది సందర్భంపై ఆధారపడి ఉంటుంది. Economic Operator Registration and Identification Number (EORI) అనేది కస్టమ్స్ ఆథరైజేషన్‌లు, ఆమోదాలు మరియు నిర్ణయాలను ట్రాక్ చేయడానికి, రిజిస్టర్ చేయడానికి ఉపయోగించే ID కోడ్. గతంలో, UK మరియు ఇతర EU మెంబర్ దేశాల్లోని పన్ను అధికారులకు ఒకే EORI నంబర్ ఉపయోగపడేది. జనవరి 1, 2021 తర్వాత, వేర్వేరు UK మరియు EU EORI నంబర్‌లు అవసరం అవుతాయి.
మీరు వస్తువులను EUలోకి దిగుమతి చేస్తున్నట్లయితే మరియు మీ వద్ద EORI నంబర్ లేకుంటే లేదా మీకు UK జారీ చేసిన GBతో మొదలయ్యే EORI నంబర్ ఉన్నట్లయితే, మీరు EU EORI కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీకు EU మెంబర్ దేశం కోసం EORI నంబర్ అవసరమైతే, వారి పన్ను అధికారులను సంప్రదించండి.
మీరు వస్తువులను UKలోకి దిగుమతి చేస్తున్నట్లయితే మరియు మీ వద్ద EORI నంబర్ లేకుంటే లేదా మీ వద్ద మరొక EU మెంబర్ దేశం ద్వారా జారీ చేయబడిన EORI నంబర్ ఉంటే, మీరు UK EORI కోసం రిజిస్టర్ చేసుకోవాలి. మీరు HM Revenue and Customsతో UK EORI నంబర్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
మీకు కొత్త EORI నంబర్ అవసరమా లేదా అనేది కచ్చితంగా తెలియకపోతే, స్థానిక పన్ను నిపుణుడిని సంప్రదించండి.
నేను డిజిటల్ ఉత్పత్తులను విక్రయిస్తున్నాను, ఇది నాపై ప్రభావం చూపుతుందా?
అది ఆధారపడి ఉంటుంది. VAT Mini One Stop Shop (MOSS) స్కీమ్‌లో రెండు వేరియంట్‌లు ఉన్నాయి. union scheme అనేది EUలో స్థాపించబడిన లేదా EU మెంబర్ దేశంలో కనీసం ఒక శాఖ ఉన్న వ్యాపారాలకు అందుబాటులో ఉంటుంది. EUలో స్థాపించబడని మరియు EU మెంబర్ దేశాలలో ఎలాంటి శాఖలు లేని వ్యాపారాలకు non-union స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
ఒకవేళ డిజిటల్ ఉత్పత్తులను విక్రయించడానికి మీరు ప్రస్తుతం MOSS స్కీమ్‌ను ఉపయోగిస్తుంటే, VAT నంబర్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలో నిర్ణయించడానికి మీ పన్ను అధికారులను లేదా స్థానిక పన్ను నిపుణుడిని సంప్రదించండి.
ఆర్డర్ విలువ £135 GBP కంటే ఎక్కువగా ఉంటే, నేను UKలో VAT ఎలా ఛార్జ్ చేయాలి?
£135 GBP కంటే ఎక్కువ ఉన్న ఆర్డర్‌లపై VAT ఛార్జ్ చేయడంపై దశలవారీ సూచనల కోసం, UK వ్యాపారుల కోసం పన్ను రిజిస్ట్రేషన్ను చూడండి.
నా నిబంధనలు మరియు షరతులను నేను మార్చుకోవాలా?
బహుశా మార్చుకోవచ్చు. జనవరి 1, 2021 తర్వాత, మీరు UK మరియు EU సభ్య దేశాల మధ్య వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు లేదా ఎగుమతి చేసినప్పుడు, మీ ఉత్పత్తులపై ఇంపోర్ట్ VAT మరియు టారిఫ్‌లు ఛార్జ్ చేయబడవచ్చు. రెండు అత్యంత జనాదరణ పొందిన అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు లేదా ఇంకోటెర్మ్‌లు ఇక్కడ ఉన్నాయి:
- డెలివర్డ్ డ్యూటీ పెయిడ్ (DDP). వస్తువులు సరిహద్దులను దాటుతున్నప్పుడు చెల్లించాల్సిన VAT మరియు సుంకాల వంటి ఏవైనా దిగుమతి ఖర్చులకు విక్రేతే బాధ్యత వహిస్తారని ఈ పదం సూచిస్తుంది. వస్తువులను అందుకున్న తర్వాత కస్టమర్ ఊహించని ఫీజులు లేదా పన్నులను చెల్లించకుండా ఈ ఆప్షన్ కాపాడుతుంది, కానీ DDPలో మీరు దిగుమతి ప్రక్రియను నిర్వహించాలి, దీని కారణంగా VAT రిజిస్ట్రేషన్ బాధ్యతలు కూడా ఏర్పడవచ్చు.
- డెలివర్డ్ ఎట్ ప్లేస్ (DAP). విక్రేత కేవలం ఉత్పత్తి షిప్పింగ్ బాధ్యతలను మాత్రమే తీసుకుంటారని మరియు VAT, సుంకాలు, అలాగే క్లియరింగ్ ఫీజుల వంటి ఏవైనా దిగుమతి ఖర్చులను కస్టమరే చెల్లించాల్సి ఉంటుందని ఈ పదం సూచిస్తుంది. దిగుమతి ప్రక్రియను నిర్వహించాల్సిన పని లేకుండా ఈ ఆప్షన్ మిమ్మల్ని కాపాడవచ్చు, కానీ DAP వల్ల మీ కస్టమర్‌కి ఊహించని ఖర్చులు రావచ్చు. అలాగే దీనివల్ల షిప్‌మెంట్‌లు ఆలస్యం అవడం లేదా రిటర్న్ అవడం వంటివి జరగవచ్చు.
మీరు ఏ ఇంకోటెర్మ్‌లను ఉపయోగిస్తారో నిర్ణయించుకునే బాధ్యత మీదే, అయితే చాలా వరకు EU మెంబర్ దేశాల విషయంలో, మీ కస్టమర్‌లకు వర్తించే అన్ని ఛార్జీలు మరియు పన్నుల గురించి వారికి తెలిసేలా చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది.
HS కోడ్ అంటే ఏమిటి? నేను దీన్ని ఎలా జోడించాలి?
హార్మోనైజ్డ్ సిస్టమ్ (HS) కోడ్ అనేది అంతర్జాతీయంగా షిప్ చేయబడుతున్న ఉత్పత్తులను గుర్తించడానికి ఉపయోగించే ఒక విధానం, దీనివల్ల షిప్‌మెంట్‌లకు పన్నులు మరియు టారిఫ్‌లు కచ్చితంగా అప్లయి చేయబడతాయి. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ఈ సిస్టమ్ గురించి మరింత తెలుసుకోవడానికి వనరులను అందిస్తుంది మరియు మీ ఉత్పత్తికి సంబంధించిన HS కోడ్‌ను కనుగొనడానికి మీరు ఇక్కడ వెతకవచ్చు.
మీ ఉత్పత్తి యొక్క HS కోడ్ మీకు తెలిసిన తర్వాత, మీరు దాన్ని మీ Shopify అడ్మిన్‌లో జోడించవచ్చు.
ఉత్తర ఐర్లాండ్‌లో VAT లెక్కింపు
బ్రెక్జిట్ కింద, ఉత్తర ఐర్లాండ్ (NI) ద్వంద్వ హోదాను స్వీకరించింది మరియు EU మరియు UK పన్ను విధానాల రెండింటిలోనూ ఒక భాగంగా పరిగణించబడుతుంది. సరైన సరిహద్దుల-వారీ VAT వసూలును నిర్ధారించడానికి, EU మరియు UK ప్రాంతాల రెండింటికీ ఒకే పన్ను సేవను ఉపయోగించండి.
ఒకవేళ మీరు Shopify Taxని ఉపయోగిస్తే, ఆర్డర్ మూలం మరియు దాని గమ్యం ఆధారంగా VAT లెక్కించబడుతుంది. UKలోని ఆర్డర్‌ల నుండి ఉత్తర ఐర్లాండ్‌లో ఉన్న కస్టమర్‌లకు UK VAT వర్తిస్తుంది. EUలోని ఆర్డర్‌ల నుండి NIలో ఉన్న కస్టమర్‌లకు EU VAT వర్తిస్తుంది.
| ఆర్డర్ మూలం | ఆర్డర్ గమ్యం | చెక్అవుట్ వద్ద వర్తించే VAT |
|---|---|---|
| యునైటెడ్ కింగ్‌డమ్ | యునైటెడ్ కింగ్‌డమ్ | మీకు UK VAT రిజిస్ట్రేషన్ ఉంటే, UK VAT ఛార్జ్ చేయబడుతుంది. |
| ఉత్తర ఐర్లాండ్ | మీకు UK VAT రిజిస్ట్రేషన్ ఉంటే, UK VAT ఛార్జ్ చేయబడుతుంది. | |
| యూరోపియన్ యూనియన్ | VAT ఛార్జ్ చేయబడదు. | |
| ఉత్తర ఐర్లాండ్ | యునైటెడ్ కింగ్‌డమ్ | మీకు UK VAT రిజిస్ట్రేషన్ ఉంటే, UK VAT ఛార్జ్ చేయబడుతుంది. |
| ఉత్తర ఐర్లాండ్ | మీకు UK VAT రిజిస్ట్రేషన్ ఉంటే, UK VAT ఛార్జ్ చేయబడుతుంది. | |
| యూరోపియన్ యూనియన్ | మీకు EU VAT రిజిస్ట్రేషన్ ఉంటే, EU VAT ఛార్జ్ చేయబడుతుంది. | |
| యూరోపియన్ యూనియన్ | యునైటెడ్ కింగ్‌డమ్ | VAT ఛార్జీలు ఆర్డర్ ఖర్చుపై, అలాగే మీకు UK VAT రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటాయి.
|
| ఉత్తర ఐర్లాండ్ |
| |
| యూరోపియన్ యూనియన్ | మీకు EU VAT రిజిస్ట్రేషన్ ఉంటే, EU VAT ఛార్జ్ చేయబడుతుంది. |
జూలై 1 నుండి, నిర్దిష్ట దేశాల థ్రెషోల్డ్‌లు వర్తించవు. దానికి బదులుగా, మొత్తం EUకు ఒకే థ్రెషోల్డ్ వర్తిస్తుంది.
- మీ సొంత దేశంలోని కస్టమర్‌లకు, మీ స్థానిక VAT రేటు ఛార్జ్ చేయబడుతుంది.
- మీ దేశం కాకుండా ఇతర EU దేశాల్లోని కస్టమర్‌ల కోసం, మీరు రిజిస్ట్రేషన్ థ్రెషోల్డ్‌ను మించారా లేదా అనే దాని ఆధారంగా రేటు నిర్ణయించబడుతుంది.
- ఇతర EU సభ్య దేశాలన్నింటికి కలిపి మీ విక్రయాలు మొత్తం €10,000 EUR కంటే తక్కువ ఉంటే, అప్పుడు మీరు మీ సొంత ప్రాంతపు VAT రేటును ఛార్జ్ చేస్తారు.
- ఇతర EU సభ్య దేశాలన్నింటికి కలిపి మీ విక్రయాలు మొత్తం €10,000 EUR లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, ఇతర దేశాలు లేదా ప్రాంతాలకు చేసే అన్ని విక్రయాలకు మీ కస్టమర్ లొకేషన్‌లోని VAT రేటును ఛార్జ్ చేస్తారు.
జూలై 1, 2021 నుండి కొత్త వన్-స్టాప్ షాప్ స్కీమ్ (OSS) అందుబాటులో ఉంది. ఈ OSS స్కీమ్, ప్రతి సభ్య దేశానికి విడిగా రిజిస్టర్ చేసుకోవడానికి బదులుగా, అన్ని EU సభ్య దేశాలలోని విక్రయాలకు VATను వసూలు చేయడానికి మరియు రెమిట్ చేయడానికి వ్యాపారులను అనుమతిస్తుంది.
నార్తర్న్ ఐర్లాండ్ (NI)లో లొకేషన్‌లు ఉన్న వ్యాపారులు Import One-Stop Shop (IOSS) స్కీమ్‌ను కాకుండా, OSSను ఉపయోగిస్తారు. బ్రెగ్జిట్ కింద, నార్తర్న్ ఐర్లాండ్ ద్వంద్వ హోదాను స్వీకరించింది మరియు EU, UK పన్నుల విధానాలు రెండింటిలోనూ భాగంగా పరిగణించబడుతుంది.
మీరు Shopify Tax ఉపయోగిస్తే, ఆర్డర్ మూలం మరియు గమ్యం ఆధారంగా VAT లెక్కించబడుతుంది. యునైటెడ్ కింగ్‌డమ్ నుండి నార్తర్న్ ఐర్లాండ్‌లోని కస్టమర్‌లకు వచ్చే ఆర్డర్‌లకు మరియు నార్తర్న్ ఐర్లాండ్ నుండి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కస్టమర్‌లకు వచ్చే ఆర్డర్‌లకు UK VAT వర్తిస్తుంది. యూరోపియన్ యూనియన్ నుండి నార్తర్న్ ఐర్లాండ్‌లోని కస్టమర్‌లకు వచ్చే ఆర్డర్‌లకు మరియు నార్తర్న్ ఐర్లాండ్ నుండి యూరోపియన్ యూనియన్‌లోని కస్టమర్‌లకు వచ్చే ఆర్డర్‌లకు EU VAT వర్తిస్తుంది.
Shopifyలో EU, UK పన్నులను సెటప్ చేయడం ప్రారంభించడానికి ముందు
మీరు పన్నులను ఛార్జ్ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. మీకు ఖచ్చితంగా తెలియకపోతే, స్థానిక పన్ను అధికారులను లేదా పన్ను నిపుణుడిని సంప్రదించండి. సాధారణంగా, మీరు EUలోని దేశాలకు విక్రయించాలని భావిస్తే, EU VATను ఛార్జ్ చేయడానికి మీ సొంత దేశంలోని పన్ను అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. 12 నెలల వ్యవధిలో UKలోని కస్టమర్‌లకు మీ విక్రయాలు £90,000 GBP లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, UK VATను ఛార్జ్ చేయడానికి సాధారణంగా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు EUలోని ఒక దేశంలో నిర్దిష్ట విక్రయాల థ్రెషోల్డ్‌ను దాటితే లేదా మీకు అక్కడ గణనీయమైన వ్యాపార ఉనికి ఉంటే, మీరు వన్-స్టాప్ షాప్ (OSS) స్కీమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి రావచ్చు లేదా సంబంధిత ఏజెన్సీలను సంప్రదించి, వారి వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి రావచ్చు. మీ వ్యాపారం ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ విక్రయిస్తారు మరియు వ్యక్తిగత ప్రభుత్వ ఆవశ్యకతలను బట్టి ఈ ప్రాసెస్ మారుతూ ఉంటుంది. మీ కస్టమర్‌లకు మీరు ఏ రేట్లను ఛార్జ్ చేస్తారనేది, VATను వసూలు చేయడానికి మీరు ఎక్కడ రిజిస్టర్ అయ్యారనే దానిపై ఆధారపడి ఉంటుంది.
- మీ సొంత దేశంలోని కస్టమర్‌లకు, మీ స్థానిక VAT రేటు ఛార్జ్ చేయబడుతుంది.
- మీ సొంత దేశం మినహా ఇతర EU దేశాలలోని కస్టమర్‌ల కోసం, మీరు €10,000 EURల రిజిస్ట్రేషన్ థ్రెషోల్డ్‌ను మించారా లేదా అనే దాని ఆధారంగా రేటు నిర్ణయించబడుతుంది.
- మీరు థ్రెషోల్డ్‌ను మించకపోతే, మీ స్థానిక VAT రేటు ఛార్జ్ చేయబడుతుంది. EUలోని కస్టమర్‌లకు మీ స్థానిక పన్ను రేటును ఛార్జ్ చేయడానికి, మీరు మైక్రో-బిజినెస్ మినహాయింపును ఉపయోగించాలి.
- మీరు థ్రెషోల్డ్‌ను మించితే, మీ కస్టమర్ దేశానికి చెందిన VAT రేటు ఛార్జ్ చేయబడుతుంది. గమ్యస్థాన దేశం యొక్క VAT రేటును ఛార్జ్ చేయడానికి, మీరు OSSతో లేదా ఆ దేశంతో VAT నంబర్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి.
మీకు ఒక దేశంలో గణనీయమైన ఉనికి ఉంటే, పన్నులను వసూలు చేయడానికి మీరు రిజిస్టర్ చేసుకోవాలా వద్దా అని నిర్ధారించడానికి మీరు ఆ దేశ పన్ను అధికారిని సంప్రదించాలి. మీ వ్యాపారం దూర విక్రయాల (distance sales) థ్రెషోల్డ్‌ను మించిందో లేదో నిర్ధారించుకోవడం మీ బాధ్యత.
OSSతో VATను ఛార్జ్ చేయండి
యూనియన్ OSS అని కూడా పిలువబడే వన్-స్టాప్ షాప్ స్కీమ్, EU, NIలలో లొకేషన్‌లను కలిగి ఉండి, ఇతర EU సభ్య దేశాలలోని కస్టమర్‌లకు చేసే విక్రయాలకు గమ్యస్థాన దేశాల ఆధారంగా VATను ఛార్జ్ చేసి, రెమిట్ చేయాల్సిన వ్యాపారుల కోసం ఉద్దేశించబడింది.
ఇతర EU సభ్య దేశాలన్నింటికి మీ వార్షిక విక్రయాలు €10,000 EUR కంటే తక్కువగా ఉంటే, అప్పుడు మీరు ఈ కిందివాటిలో ఏదైనా ఒకదాన్ని చేయవచ్చు:
- మీ స్థానిక VAT రేటును ఛార్జ్ చేయడానికి మైక్రో-బిజినెస్ మినహాయింపును ఉపయోగించండి.
- మీరు మీ కస్టమర్‌ల లొకేషన్ ఆధారంగా VAT ఛార్జ్ చేయాలనుకుంటే OSS కోసం రిజిస్టర్ చేసుకోండి.
మీ స్టోర్ బేసిక్ ట్యాక్స్ సేవను ఉపయోగిస్తే మాత్రమే మీరు OSSని ఉపయోగించగలరు. బేసిక్ ట్యాక్స్ సేవను ఉపయోగించడానికి మీరు మీ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయకపోయి ఉంటే, అప్పుడు మాన్యువల్ పన్ను రేట్లను ఉపయోగించి మీ పన్ను రేట్లను మాన్యువల్‌గా అప్‌డేట్ చేయండి.
UK కోసం మీ VAT రిజిస్ట్రేషన్‌ను సెటప్ చేయండి
VAT నంబర్ ఫార్మాట్, థ్రెషోల్డ్ నియమాలతో సహా UK VAT వసూలును సెటప్ చేయడం గురించిన దశలవారీ సూచనల కోసం, UK వ్యాపారుల కోసం పన్ను రిజిస్ట్రేషన్ను చూడండి.
మీ పన్ను ప్రాంతాలను సెటప్ చేసిన తర్వాత, డిఫాల్ట్ పన్ను రేట్లు వర్తించని ఉత్పత్తుల కోసం మీరు పన్ను ఓవర్‌రైడ్‌లను సృష్టించవచ్చు.
EU కోసం మీ VAT రిజిస్ట్రేషన్‌లను సెటప్ చేయండి
OSS, IOSS మరియు దేశం వారీ ఆప్షన్‌లతో సహా EU VAT రిజిస్ట్రేషన్‌లను సెటప్ చేయడంపై దశలవారీ సూచనల కోసం, EUలోని పన్ను సేవలు చూడండి.
మీ పన్ను ప్రాంతాలను సెటప్ చేసిన తర్వాత, డిఫాల్ట్ పన్ను రేట్లు వర్తించని ఉత్పత్తుల కోసం మీరు పన్ను ఓవర్‌రైడ్‌లను సృష్టించవచ్చు.
మీ VAT రిజిస్ట్రేషన్‌లను మేనేజ్ చేయండి
మీ UK, EU VAT రిజిస్ట్రేషన్‌లను మేనేజ్ చేయడం గురించిన సూచనల కోసం, మీ UK పన్నులను మేనేజ్ చేయండిని చూడండి.