మీ Shopify ఖాతాలోకి లాగిన్, లాగ్ అవుట్ అవ్వండి

మీరు మీ డెస్క్‌టాప్ వెబ్ బ్రౌజర్‌లో https://www.shopify.com/login నమోదు చేయడం ద్వారా మీ Shopify ఖాతాను యాక్సెస్ చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు మీ టాబ్లెట్ లేదా మొబైల్ పరికరంలో Shopify యాప్ ద్వారా లాగిన్ కావచ్చు. మీరు మీ మొబైల్ పరికరం బయోమెట్రిక్స్‌ను ఉపయోగించి కూడా Shopify యాప్‌లోకి లాగిన్ కావచ్చు. Shopify యాప్ అనేది iOS, iPadOS మరియు Android ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అనుకూలంగా ఉంటుంది.

మీ Shopify ఖాతాలోకి లాగిన్ అవ్వండి

డెస్క్‌టాప్, టాబ్లెట్ లేదా మొబైల్ పరికరంలో ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఉపయోగించి మీరు మీ Shopify అడ్మిన్‌లోకి లాగిన్ కావచ్చు. టాబ్లెట్, మొబైల్ పరికరాల్లో, మీరు Shopify యాప్ను ఉపయోగించి కూడా లాగిన్ కావచ్చు.

మీరు ఇంతకు ముందు అదే పరికరంలో మీ స్టోర్‌లోకి లాగిన్ అయి ఉంటే, మీ స్టోర్ ఇప్పటికే లాగిన్ పేజీలో జాబితా చేయబడి ఉండవచ్చు. మీ స్టోర్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు లాగిన్ అవ్వవచ్చు, ఇమెయిల్ అడ్రస్‌ను నమోదు చేయమని మిమ్మల్ని అడగరు.

Shopify యాప్‌ను ఉపయోగించకుండా మీరు మీ టాబ్లెట్ లేదా మొబైల్ పరికరంలో మీ Shopify అడ్మిన్‌లోకి లాగిన్ కావాలనుకుంటే, మీరు ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఉపయోగించవచ్చు మరియు మీరు డెస్క్‌టాప్ పరికరంలో లాగిన్ అయ్యే విధంగానే మీ Shopify అడ్మిన్‌లోకి లాగిన్ కావచ్చు.

దశలు:

డెస్క్‌టాప్
  1. Shopify లాగిన్ పేజీకి వెళ్లండి.
  2. మీ Shopify ఖాతాకు అనుబంధంగా ఉన్న ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి లేదా లాగిన్ అవ్వడానికి లాగిన్ సర్వీసులలో ఒకదానిని ఉపయోగించండి.
  3. మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, ఆపై లాగిన్‌పై క్లిక్ చేయండి.
  4. మీ Shopify ఖాతాలో రెండు-దశల ప్రామాణీకరణ యాక్టివేట్ చేసి ఉంటే, మీ ప్రామాణీకరణ పద్ధతిని ఉపయోగించి ప్రామాణీకరణ కోడ్‌ను ఎంటర్ చేసి, ఆపై లాగిన్‌పై క్లిక్ చేయండి.
  5. మీ Shopify ఖాతాకు బహుళ Shopify స్టోర్‌లు అనుబంధంగా ఉంటే, మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్న స్టోర్‌ను ఎంచుకోండి.
మొబైల్
  1. Shopify యాప్‌ను తెరిచి, ఆపై లాగిన్‌పై ట్యాప్ చేయండి.
  2. కొనసాగించండి‌పై ట్యాప్ చేయండి (iOS మాత్రమే).
  3. మీ Shopify ఖాతాకు అనుబంధంగా ఉన్న ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి లేదా లాగిన్ అవ్వడానికి లాగిన్ సర్వీసులలో ఒకదానిని ఉపయోగించండి.
  4. మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, ఆపై లాగిన్‌పై ట్యాప్ చేయండి.
  5. మీ Shopify ఖాతాలో రెండు-దశల ప్రామాణీకరణ యాక్టివేట్ చేసి ఉంటే, మీ ప్రామాణీకరణ పద్ధతిని ఉపయోగించి ప్రామాణీకరణ కోడ్‌ను ఎంటర్ చేసి, ఆపై లాగిన్‌పై ట్యాప్ చేయండి.
  6. మీ Shopify ఖాతాకు బహుళ Shopify స్టోర్‌లు అనుబంధంగా ఉంటే, మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్న స్టోర్‌ను ఎంచుకోండి.

బహుళ Shopify ఖాతాలలోకి లాగిన్ అవ్వండి

మీరు టాబ్లెట్ లేదా మొబైల్ పరికరాన్ని ఉపయోగించి Shopify యాప్‌లో బహుళ ఖాతాలలోకి లాగిన్ అవ్వవచ్చు. డెస్క్‌టాప్ పరికరంలో మీరు బహుళ ఖాతాలలోకి లాగిన్ కాలేరు, మీరు వేర్వేరు ఖాతాల మధ్య మాత్రమే మారగలరు.

మీరు ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత, అది మీ యాక్టివ్ ఖాతాగా మారుతుంది, అలాగే మీరు మీ ఖాతాల మధ్య మారవచ్చు

దశలు:

iPhone
  1. Shopify యాప్ నుండి, మీ స్టోర్ పేరు పక్కన ఉన్న ప్రొఫైల్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
  2. మీ ఖాతాపై ట్యాప్ చేయండి.
  3. ఖాతాను మేనేజ్ చేయండి‌పై ట్యాప్ చేయండి.
  4. మీ ఇమెయిల్ అడ్రస్‌పై ట్యాప్ చేయండి.
  5. మరొక ఖాతాలోకి లాగిన్ అవ్వండి > కొనసాగించండి‌పై ట్యాప్ చేయండి.
  6. వేరొక ఖాతాలోకి లాగిన్ అవ్వండి‌పై ట్యాప్ చేయండి.
  7. Shopify ఖాతాకు అనుబంధంగా ఉన్న ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి లేదా లాగిన్ అవ్వడానికి లాగిన్ సర్వీసులలో ఒకదానిని ఉపయోగించండి.
  8. మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, ఆపై లాగిన్‌పై ట్యాప్ చేయండి.
  9. ఆప్షనల్: మీ Shopify ఖాతాలో రెండు-దశల ప్రామాణీకరణ యాక్టివేట్ చేసి ఉంటే, మీ ప్రామాణీకరణ పద్ధతిని ఉపయోగించి ప్రామాణీకరణ కోడ్‌ను ఎంటర్ చేసి, ఆపై లాగిన్‌పై ట్యాప్ చేయండి.
  10. ఆప్షనల్: మీ Shopify ఖాతాకు బహుళ Shopify స్టోర్‌లు అనుబంధంగా ఉంటే, మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్న స్టోర్‌ను ఎంచుకోండి.
Android
  1. Shopify యాప్ నుండి, మీ స్టోర్ పేరు పక్కన ఉన్న ప్రొఫైల్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
  2. మీ ఖాతాపై ట్యాప్ చేయండి.
  3. స్టోర్‌ను జోడించండి‌పై ట్యాప్ చేయండి.
  4. వేరొక ఖాతాలోకి లాగిన్ అవ్వండి‌పై ట్యాప్ చేయండి.
  5. Shopify ఖాతాకు అనుబంధంగా ఉన్న ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి లేదా లాగిన్ అవ్వడానికి లాగిన్ సర్వీసులలో ఒకదానిని ఉపయోగించండి.
  6. మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, ఆపై లాగిన్‌పై ట్యాప్ చేయండి.
  7. ఆప్షనల్: మీ Shopify ఖాతాలో రెండు-దశల ప్రామాణీకరణ యాక్టివేట్ చేసి ఉంటే, మీ ప్రామాణీకరణ పద్ధతిని ఉపయోగించి ప్రామాణీకరణ కోడ్‌ను ఎంటర్ చేసి, ఆపై లాగిన్‌పై ట్యాప్ చేయండి.
  8. ఆప్షనల్: మీ Shopify ఖాతాకు బహుళ Shopify స్టోర్‌లు అనుబంధంగా ఉంటే, మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్న స్టోర్‌ను ఎంచుకోండి.

మీ Shopify లాగిన్ వివరాలను రికవర్ చేయండి

మీ లాగిన్ వివరాలను రికవర్ చేయడంలో సహాయపడటానికి కింది సమాచారాన్ని సమీక్షించండి:

  • పాస్‌వర్డ్ మర్చిపోయారా: ఒకవేళ మీరు మీ Shopify ఖాతా పాస్‌వర్డ్‌ను మర్చిపోతే, మీరు మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయవచ్చు.
  • ఇమెయిల్ అడ్రస్ మర్చిపోయారా: ఒకవేళ మీరు మీ ఇమెయిల్ అడ్రస్‌ను మర్చిపోతే, ట్రబుల్షూటింగ్ చేయడానికి ప్రయత్నించండి. మీ Shopify ఖాతాకు అనుబంధంగా ఉన్న ఇమెయిల్ అడ్రస్‌ను అప్‌డేట్ చేయాల్సి వస్తే, Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.
  • ఇతర లాగిన్ సమస్యలు: మీ ఖాతాలోకి లాగిన్ కావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ ట్రబుల్షూటింగ్ దశలను అనుసరించడానికి ప్రయత్నించండి.

పరికరాలను మేనేజ్ చేయండి

మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి, ఇటీవలి కాలంలో ఏయే పరికరాలు మీ ఖాతాను యాక్సెస్ చేశాయో మీరు సమీక్షించవచ్చు, మీకు తెలియని పరికరాల నుండి లాగ్ అవుట్ అవ్వవచ్చు.

  1. మీ Shopify అడ్మిన్ నుండి, మీ స్టోర్ పేరుపై క్లిక్ చేయండి.

  2. మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేసి, ఆపై భద్రతపై క్లిక్ చేయండి.

  3. పరికరాల విభాగంలో, మీ ఖాతాలోకి ఈమధ్య లాగిన్ అయిన, అలాగే లాగ్ అవుట్ అయిన పరికరాలను సమీక్షించండి.

  4. ఆప్షనల్: పరికరం యొక్క లాగిన్ చరిత్ర, సందర్శించిన పేజీలను సమీక్షించడానికి, పరికరం పేరుపై క్లిక్ చేయండి.

  5. ఆప్షనల్: మీ ఖాతా నుండి పరికరాలను లాగ్ అవుట్ చేయడానికి, కింది వాటిలో ఒకదాన్ని చేయండి:

    • పరికరం పేరుకి కుడి వైపున ఉన్న లాగ్ అవుట్ బటన్‌పై క్లిక్ చేయండి.
    • పరికరం పేరుపై క్లిక్ చేసి, ఆపై పరికరం నుండి లాగ్ అవుట్ చేయండిపై క్లిక్ చేయండి.
    • ఇటీవలి కాలంలో లాగిన్ అయిన పరికరాలు ఐదు కంటే ఎక్కువగా ఉంటే, మీరు అన్ని పరికరాల నుండి లాగ్ అవుట్ చేయండి > లాగ్ అవుట్‌పై క్లిక్ చేయవచ్చు.

ఒక Shopify ఖాతా నుండి లాగ్ అవుట్ చేయండి

డెస్క్‌టాప్
  1. మీ Shopify అడ్మిన్ నుండి, స్టోర్ పేరుపై క్లిక్ చేయండి.
  2. లాగ్ అవుట్‌పై క్లిక్ చేయండి.
మొబైల్
  1. Shopify యాప్ నుండి, మీ స్టోర్ పేరు పక్కన ఉన్న ప్రొఫైల్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
  2. మీ ఖాతాపై ట్యాప్ చేయండి.
  3. పేజీ అడుగు భాగాన, లాగ్ అవుట్‌పై ట్యాప్ చేయండి.
  4. లాగ్ అవుట్‌పై ట్యాప్ చేయండి.