మీ Shopify బిల్లులపై ఛార్జీలు
ఈ విభాగం పన్నులు, థర్డ్-పార్టీ ఛార్జీలతో సహా మీ Shopify బిల్లులలో మీకు పడే ఛార్జీల రకాల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. దానికితోడు డబుల్ ఛార్జీలను లేదా తెలియని ఛార్జీలను మీరు ఎలా హ్యాండిల్ చేయవచ్చో తెలియజేస్తుంది.
మీ స్టోర్ లొకేషన్, అలాగే మీ స్టోర్ ఉపయోగించే సర్వీస్‌ల ఆధారంగా మీరు మీ Shopify ఖాతాకు పొందే బిల్లులలో కింది ఛార్జీలు కనిపించవచ్చు:
- పునరావృత ఛార్జీలు: ప్రతి 30 రోజులకు బిల్ చేయబడే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఖర్చులు, పునరావృత యాప్ రుసుములు వంటి ఛార్జీలు. Shopify ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌లతో పోలిస్తే, యాప్‌లు భిన్నమైన సైకిల్‌లో బిల్ చేయబడతాయి.
- పే-పర్-యూజ్ ఛార్జీలు: లావాదేవీ రుసుములు, షిప్పింగ్ లేబుల్‌ల వంటి వాడకం ఆధారంగా బిల్ చేయబడే ఛార్జీలు.
- వన్-టైమ్ ఛార్జీలు: థీమ్ కొనుగోలు లేదా మొదటిసారి డొమైన్ ఛార్జీల వలె నిర్ధారణ తర్వాత వెంటనే బిల్ చేయబడే ఛార్జీలు.
మీ ప్రాథమిక చెల్లింపు పద్ధతిని ఉపయోగించి మీ బిల్లులు చెల్లించబడతాయి. Shopify బిల్లింగ్ ఛార్జీలు మీ బ్యాంక్ లేదా కార్డ్ స్టేట్‌మెంట్‌లో SHOPIFY * <9-అంకెల బిల్లు నంబర్> వలె ప్రదర్శించబడతాయి.