మీ Shopify బిల్లులలో డబుల్ ఛార్జీలను అర్థం చేసుకోవడం, పరిష్కరించడం

డబుల్ ఛార్జీలను ఎలా హ్యాండిల్ చేయాలో మీరు ఈ పేజీలో కనుగొంటారు, వాటి అర్థం, వాటికి గల సాధారణ కారణాలు, వాటిని సమర్థవంతంగా పరిష్కరించడానికి, అలాగే నిరోధించడానికి వివరణాత్మక మార్గదర్శకత్వం వంటి వివరాలు ఉంటాయి.

డబుల్ ఛార్జీ అంటే ఏమిటి?

ఒకే లావాదేవీకి సంబంధించి మీ ఖాతాలో ఒకే రకమైన లేదా దాదాపుగా ఒకే రకమైన రెండు ఛార్జీలు ప్రాసెస్ చేయబడటమే డబుల్ ఛార్జీ. దీని వలన ఒకే ఒక ఖర్చుకు బదులుగా మీ ఖాతా నుండి రెండుసార్లు డబ్బు డెబిట్ అవుతుంది.

Shopify సేవా నిబంధనల్లోని విభాగం 5.10లో పేర్కొన్నట్లుగా, సాధారణంగా Shopify సబ్‌స్క్రిప్షన్ రుసుములు వాపసు చేయబడవు. అవాంఛిత ఛార్జీలను నివారించడానికి, మీ సబ్‌స్క్రిప్షన్ ఎంపికలను జాగ్రత్తగా రివ్యూ చేసి, మేనేజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలో ఎర్రర్ ఉందని మీరు భావిస్తే, మీ కేసును రివ్యూ చేయడం కోసం మీరు Shopify సపోర్ట్‌ని సంప్రదించవచ్చు. రీఫండ్‌లు, క్రెడిట్‌లకు గ్యారెంటీ ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో రివ్యూ చేసిన తర్వాత అవి ఆమోదించబడవచ్చు.

డబుల్ ఛార్జీలకు సాధారణ కారణాలు

డబుల్ ఛార్జీ పడటానికి గల కొన్ని సాధారణ కారణాలు కింద ఇవ్వబడ్డాయి:

  • బహుళ ఖాతాలు: మీకు ఒకటి కంటే ఎక్కువ యాక్టివ్ Shopify ఖాతాలు ఉండటం వలన డూప్లికేట్ ఛార్జీలు పడవచ్చు.
  • బిల్లింగ్ ఎర్రర్‌లు: అప్పుడప్పుడు, చెల్లింపు ప్రాసెసింగ్ సిస్టమ్‌లోని అవాంతరాల వలన అనుకోని ఛార్జీలు పడవచ్చు.
  • యూజర్ ఎర్రర్‌లు: ఒకే చెల్లింపును ఒకటి కంటే ఎక్కువసార్లు సమర్పించడం వంటి ఎర్రర్‌లు.
  • బిల్లింగ్ సైకిల్ గందరగోళాలు: మీ బిల్లింగ్ సైకిల్ గురించిన అపార్థాలు కూడా డబుల్ ఛార్జీల వలె కనిపించవచ్చు.

తెలియని ఛార్జీల గురించి మరింత తెలుసుకోండి.

డబుల్ ఛార్జీని పరిష్కరించండి

  1. ఛార్జీని వెరిఫై చేయండి: డబుల్ ఛార్జీ పడిందో లేదో నిర్ధారించడానికి మీ ఖాతా స్టేట్‌మెంట్‌లను చెక్ చేయండి.
  2. మీ ఖాతాలను రివ్యూ చేయండి: పొరపాటున మీ పేరు మీద బహుళ ఖాతాలు ఏవీ యాక్టివ్‌గా లేవని నిర్ధారించుకోండి.
  3. Shopify సపోర్ట్‌ని సంప్రదించండి: మీరు సమస్యను పరిష్కరించలేకపోతే, ఆ ఛార్జీకి సంబంధించిన వివరాలతో Shopify సపోర్ట్‌ని సంప్రదించండి. ఒక సపోర్ట్ అడ్వైజర్ మీ కేసును రివ్యూ చేసి, రీఫండ్ లేదా క్రెడిట్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.

మీకు డబుల్ ఛార్జీలకు సంబంధించి సమస్యలు ఎదురవుతుంటే, దానికి కొన్ని సాధారణ సమస్యలు కారణం కావచ్చు.

ఖాతా స్టేట్‌మెంట్‌లను కనుగొనలేకపోవడం

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > బిల్లింగ్కు వెళ్లండి.

  2. గత బిల్లులు కింద, సవిస్తరమైన సమాచారం కోసం మీరు రివ్యూ చేయాలనుకుంటున్న బిల్లును ఎంచుకోండి.

ఒకే ఖాతాకు రెండుసార్లు ఛార్జీ పడటం

కింది దశలను పూర్తి చేయడం ద్వారా మీ యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌లను రివ్యూ చేసి, మేనేజ్ చేయండి:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > ప్లాన్కు వెళ్లండి.

  2. సబ్‌స్క్రిప్షన్‌లు విభాగంలో, అన్ని సబ్‌స్క్రిప్షన్‌లను చూడండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

  3. ఏవైనా డూప్లికేట్ సబ్‌స్క్రిప్షన్‌లు ఉంటే మేనేజ్ చేయండి లేదా రద్దు చేయండి.

  4. ఆప్షనల్: భవిష్యత్తులో ఛార్జీలు పడకుండా నివారించడానికి మీ స్టోర్‌లలో ఒకదాన్ని డీయాక్టివేట్ చేయండి.