ఉత్తర అమెరికాలో Shopify బిల్లింగ్‌పై పన్ను మినహాయింపులు మరియు ఛార్జీల కోసం సాధారణ మార్గదర్శకాలు

మీ ఖాతా ఛార్జీల పైన Shopify పన్నులు వసూలు చేయాల్సిన ప్రాంతంలో మీరు నివసిస్తుంటే, ఆ ఛార్జీలు మీ Shopify ఇన్‌వాయిస్‌లో ప్రదర్శించబడతాయి.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు (US) మరియు కెనడాలోని నిర్దిష్ట పన్ను అవసరాలను నావిగేట్ చేయడం, పన్ను మినహాయింపుల కోసం దరఖాస్తు చేయడం మరియు మీ పన్ను బాధ్యతలను అర్థం చేసుకోవడం సహా మీ Shopify స్టోర్‌ కోసం పన్నులను మేనేజ్ చేయడం గురించి ఈ పేజీ వివరిస్తుంది.

ఒక వ్యాపారిగా మీ పన్ను బాధ్యతలను అర్థం చేసుకోవడం

Shopify ఉత్పత్తులు, సేవల కొనుగోలుకు లేదా మీ సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించిన అన్ని పన్నులకు మీరే బాధ్యత వహించాలి. మీరు అందించే బిల్లింగ్ చిరునామాను ఉపయోగించి ఈ పన్నులు లెక్కించబడతాయి, అలాగే మీరు అధికారమిచ్చిన చెల్లింపు పద్ధతికి ఛార్జ్ చేయబడతాయి. మీరు కొత్త ప్రాంతానికి మారితే, అప్పుడు మీరు మీ Shopify అడ్మిన్‌లో మీ లొకేషన్‌ను అప్‌డేట్ చేయాలి.

మీ Shopify స్టోర్‌లోని విక్రయాల నుండి లేదా సేవలను ఉపయోగించడం ద్వారా వచ్చే ఏవైనా పన్నులు, సుంకాలు, రుసుములు లేదా అదనపు ఛార్జీలను లెక్కించడం, వసూలు చేయడం, నిలిపి ఉంచడం, నివేదించడం మరియు చెల్లించడం వంటి వాటికి సంబంధించిన అన్ని పనులను కూడా మీరే చూసుకోవాలి. మరింత సమాచారం కోసం Shopify సేవా నిబంధనల రుసుములు మరియు పన్నుల చెల్లింపు విభాగం మరియు పన్ను ఓవర్‌రైడ్‌లు మరియు మినహాయింపులను చూడండి.

మీ పన్ను రేటు ఎలా నిర్ణయించబడుతుంది

మీ ఇన్‌వాయిస్‌లలో వసూలు చేసే పన్నులు మీ స్టోర్ బిల్లింగ్ చిరునామా ఆధారంగా ఉంటాయి. మీ ఇన్‌వాయిస్‌లో ఊహించని పన్నులను మీరు గమనిస్తే, మీ బిల్లింగ్ చిరునామా కచ్చితమైనదని, అలాగే అప్‌డేట్‌గా ఉందని నిర్ధారించుకోండి. మీ స్టోర్ చిరునామాను మార్చడం ఎలాగో తెలుసుకోండి.

మీ Shopify ఇన్‌వాయిస్‌లు మరియు పన్ను ఛార్జీలను చూడటం

మీ అకౌంట్‌పై వసూలు చేసిన పన్నులను అర్థం చేసుకోవడానికి మీ ఇన్‌వాయిస్‌లను నేరుగా మీ Shopify అడ్మిన్‌లో రివ్యూ చేయవచ్చు. ఇన్‌వాయిస్‌లలో వర్తించే ఏవైనా పన్నులతో సహా అన్ని ఛార్జీల వివరణాత్మక విభజన ఉంటుంది. మీ రాబోయే మరియు గత Shopify బిల్లులను చూడటం ఎలాగో తెలుసుకోండి.

మీ పన్ను ఫైలింగ్‌ల కోసం రికార్డులను ఉంచుకోవడానికి మీరు మీ బిల్లింగ్ చరిత్రను ఎగుమతి కూడా చేయవచ్చు.

పన్ను మినహాయింపు అర్హత మరియు అవసరాలు

మీరు మీ సబ్‌స్క్రిప్షన్ లేదా Shopify ఉత్పత్తులు, సేవల కొనుగోలుకు సంబంధించిన పన్నులను చెల్లించాల్సిన అవసరం లేకుంటే, అప్పుడు మీరు మీ పన్ను మినహాయింపు స్టేటస్‌కు సంబంధించిన రుజువును Shopifyకు అందించాలి. అర్హత ఆవశ్యకతలు, అలాగే అవసరమైన డాక్యుమెంటేషన్ అనేది దేశం, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి.

బిల్లింగ్ పన్ను మినహాయింపునకు ఎవరు అర్హులు

అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడాలోని కింది రకాల సంస్థల కోసం Shopify బిల్లింగ్ పన్ను మినహాయింపులను అందించగలదు:

  • రిజిస్టర్ చేయబడిన లాభాపేక్ష లేని సంస్థలు (అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 501(c)(3))
  • ప్రభుత్వ సంస్థలు
  • కెనడాలోని స్థానిక ప్రజలు మరియు ఫస్ట్ నేషన్స్ బ్యాండ్‌లు (నిర్దిష్ట అవసరాలతో)
  • వారి రాష్ట్ర లేదా ప్రావిన్షియల్ పన్ను అథారిటీ నుండి చెల్లుబాటు అయ్యే పన్ను మినహాయింపు స్టేటస్‌ను కలిగి ఉన్న ఇతర సంస్థలు

ప్రాంతం వారీగా అవసరమైన డాక్యుమెంట్‌లు

పన్ను మినహాయింపు కోసం అవసరమైన డాక్యుమెంటేషన్ అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. మీ కేసుకు ఏ డాక్యుమెంటేషన్ అవసరమో తెలుసుకోవడానికి మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించవచ్చు.

బిల్లింగ్ సెట్టింగ్‌లలో పన్ను మినహాయింపును యాక్టివేట్ చేయడానికి మీరు మీ పన్ను నంబర్‌ను ఎంటర్ చేయగల దేశాలు

కింది దేశాలలో, Shopify సపోర్ట్‌ను సంప్రదించకుండా పన్ను మినహాయింపు పొందడానికి మీ పన్ను వివరాలను నేరుగా మీ Shopify అడ్మిన్‌లో ఎంటర్ చేయవచ్చు:

బిల్లింగ్ పన్ను మినహాయింపు కోసం మీ పన్ను నంబర్‌ను జోడించండి

పన్ను రిజిస్ట్రేషన్ నంబర్‌ను జోడించడానికి సపోర్ట్ చేసే దేశంలో మీరు ఉన్నట్లయితే, దాన్ని నేరుగా మీ Shopify అడ్మిన్‌లో జోడించవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > బిల్లింగ్కు వెళ్లండి.

  2. బిల్లింగ్ సమాచారం విభాగంలో, ఎడిట్ చేయండిపై క్లిక్ చేయండి.

  3. మీ Australian Business Number (ABN), న్యూజిలాండ్ ఇన్‌ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ (IRD) నంబర్ లేదా వాల్యూ-యాడెడ్ ట్యాక్స్ (VAT) నంబర్ లాంటి తగిన ఫీల్డ్‌లో మీ పన్ను రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.

  4. సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.

మీ నంబర్ వెరిఫై చేయబడిన తర్వాత భవిష్యత్తు ఇన్‌వాయిస్‌లలో మీ పన్ను మినహాయింపు అమలులోకి వస్తుంది. గత ఇన్‌వాయిస్‌లకు ఈ మినహాయింపు వర్తించదు.

Shopifyలో పన్ను మినహాయింపు అప్లికేషన్‌లు అందుబాటులో లేని దేశాలు

కింది దేశాల్లోని వ్యాపారులకు VAT లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) పన్ను మినహాయింపు స్టేటస్ అందుబాటులో లేదు:

  • ఐర్లాండ్: ఐర్లాండ్‌లోని వ్యాపారులు తమ Shopify బిల్లులపై విధించిన వ్యాట్ కోసం పన్ను మినహాయింపు స్టేటస్‌కు దరఖాస్తు చేయలేరు.
  • దక్షిణాఫ్రికా: దక్షిణాఫ్రికాలోని వ్యాపారులు తమ Shopify బిల్లులపై విధించిన వ్యాట్ కోసం పన్ను మినహాయింపు స్టేటస్‌ను పొందే ఆప్షన్‌ను కలిగి లేరు.
  • సింగపూర్: సింగపూర్‌లోని వ్యాపారులు తమ Shopify బిల్లులపై విధించిన GST కోసం పన్ను మినహాయింపు స్టేటస్‌కు దరఖాస్తు చేయలేరు.
  • స్విట్జర్లాండ్: స్విట్జర్లాండ్‌లోని వ్యాపారులు తమ Shopify బిల్లులపై విధించిన వ్యాట్ కోసం పన్ను మినహాయింపు స్టేటస్‌ను అభ్యర్థించలేరు.

Shopify బిల్లింగ్‌పై పన్ను మినహాయింపునకు ఎలా దరఖాస్తు చేయాలి

యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలోని వ్యాపారుల కోసం, పన్ను మినహాయింపు అప్లికేషన్ ప్రాసెస్‌కు Shopify సపోర్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. మీరు ప్రారంభించడానికి ముందు, ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడానికి అవసరమైన డాక్యుమెంటేషన్ అంతా సేకరించండి.

పన్ను మినహాయింపు అభ్యర్థనల కోసం సన్నాహక చెక్‌లిస్ట్

పన్ను మినహాయింపును అభ్యర్థించడం కోసం Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి ముందు, కింది డాక్యుమెంట్‌లను సేకరించండి:

  • మీరు పూర్తి చేసిన రాష్ట్రం లేదా ప్రావిన్స్ పన్ను మినహాయింపు సర్టిఫికెట్
  • మీ వ్యాపార రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లు
  • మీ EIN (యునైటెడ్ స్టేట్స్) లేదా వ్యాపార నంబర్ (కెనడా)
  • మీ పరిధి ద్వారా అవసరమైన ఏవైనా అదనపు రాష్ట్ర-ఆధారిత ఫారమ్‌లు
  • మినహాయింపు డాక్యుమెంట్‌లలోని మీ సంస్థ పేరు, మీ Shopify ఖాతా సమాచారానికి సరిపోలుతుందనే నిర్ధారణ

పన్ను మినహాయింపు అప్లికేషన్ ప్రాసెస్

మీరు డాక్యుమెంటేషన్‌ను సేకరించిన తర్వాత, ఈ దశలను అనుసరించండి:

  1. మీరు పూర్తి చేసిన పన్ను మినహాయింపు డాక్యుమెంటేషన్‌ను జోడించి Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.
  2. మీ స్టోర్ URLను మరియు మీ మినహాయింపు అభ్యర్థనకు సంబంధించిన సంక్షిప్త వివరణను చేర్చండి.
  3. మీ మినహాయింపును రివ్యూ చేసి, ప్రాసెస్ చేయడం కోసం Shopify సపోర్ట్ వంతు వచ్చే వరకు వేచి ఉండండి. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి గరిష్టంగా 2 వారాల వరకు సమయం పట్టవచ్చు.
  4. మీ మినహాయింపు వర్తించినప్పుడు ఇమెయిల్ ద్వారా నిర్ధారణను పొందండి.

మీ మినహాయింపు ఆమోదించబడిన తర్వాత ఏమి జరుగుతుంది

మీ పన్ను మినహాయింపు ఆమోదించబడిన తర్వాత:

  • భవిష్యత్తు ఇన్‌వాయిస్‌లలో వర్తించే పన్నులు చేర్చబడవు.
  • గత ఇన్‌వాయిస్‌లకు ఈ మినహాయింపు వర్తించదు.
  • మీ సర్టిఫికెట్‌కు గడువు ముగింపు తేదీ ఉంటే, మీరు మీ మినహాయింపును పునరుద్ధరించాల్సి రావచ్చు. ప్రస్తుతం ఉన్న మినహాయింపు గడువు ముగియనున్నప్పుడు మీకు తెలియజేయబడుతుంది.

మీ మినహాయింపు ఆమోదించబడకపోతే ఏమి జరుగుతుంది

ఒకవేళ మీ పన్ను మినహాయింపు అభ్యర్థన ఆమోదించబడకపోతే, దానికి గల కారణంతో Shopify సపోర్ట్ మిమ్మల్ని సంప్రదిస్తుంది. కింది పరిస్థితుల కారణంగా మినహాయింపు అభ్యర్థన తిరస్కరించబడవచ్చు లేదా అదనపు చర్య అవసరం కావచ్చు:

  • అసంపూర్ణ డాక్యుమెంటేషన్: ఒకవేళ మీ ఫారమ్‌లో అవసరమైన సమాచారం (సంతకాలు, తేదీలు, "బ్లాంకెట్" చెక్‌బాక్స్ లేదా విక్రేత వివరాలు వంటివి) లేనట్లయితే, మీరు సరిదిద్దబడిన డాక్యుమెంటేషన్‌ను అందించమని అడగబడతారు మరియు మీ అభ్యర్థనను మళ్లీ సమర్పించవచ్చు.
  • గడువు ముగిసిన సర్టిఫికెట్: మినహాయింపు సర్టిఫికెట్‌ల కోసం కొన్ని రాష్ట్రాలు గడువు నియమాలను కలిగి ఉంటాయి. ఒకవేళ మీ సర్టిఫికెట్ గడువు ముగిసినట్లయితే, మీరు మీ రాష్ట్ర పన్ను విభాగాధికారి నుండి కొత్త సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది.
  • అనర్హమైన మినహాయింపు కారణం: ఏయే మినహాయింపు కారణాలు అర్హత పొందుతాయి అనే విషయానికి సంబంధించి ప్రతి రాష్ట్రం నిర్దిష్ట నియమాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు, రీసేల్ మినహాయింపులు Shopify సబ్‌స్క్రిప్షన్ రుసుములకు వర్తించవు, ఎందుకంటే ఆ సర్వీస్ అనేది మీ వ్యాపారాన్ని నిర్వహించడానికి ఉపయోగించబడుతుంది, తిరిగి విక్రయించడానికి కాదు.
  • రాష్ట్రం మినహాయింపులను ఆఫర్ చేయదు: హవాయి (సబ్‌స్క్రిప్షన్ రుసుములకు) మరియు సౌత్ కరోలినా వంటి కొన్ని రాష్ట్రాలు, Shopify సబ్‌స్క్రిప్షన్‌లకు వర్తించే బిల్లింగ్ పన్ను మినహాయింపులను ఆఫర్ చేయవు.

అసంపూర్ణమైన లేదా సరికాని డాక్యుమెంటేషన్ కారణంగా ఒకవేళ మీ మినహాయింపు తిరస్కరించబడితే, అప్పుడు మీ రాష్ట్రం లేదా ప్రావిన్స్ పన్ను విభాగాధికారి నుండి సరైన డాక్యుమెంట్‌లను పొందిన తర్వాత, మీరు మీ అభ్యర్థనను మళ్లీ సమర్పించవచ్చు.

యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలో నిర్దిష్ట పన్ను బాధ్యతలు

ఒకవేళ మీ వ్యాపారం అనేది Shopify వ్యాపార ఉనికి ఉన్న కెనడియన్ లేదా అమెరికన్ అధికార పరిధిలో ఉన్నట్లయితే, అప్పుడు మీ సబ్‌స్క్రిప్షన్‌పై వర్తించే పన్నులను ఛార్జ్ చేయడం Shopify చట్టబద్ధంగా చేయాల్సి ఉంటుంది. మీ పరిధిలోని పన్ను విభాగాధికారులచే అవసరమైన చోట మాత్రమే Shopify పన్నులను విధిస్తుంది. ఈ పన్నులు మీ Shopify సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించినవి మరియు మీరు విక్రయించే ఉత్పత్తులు లేదా సేవల ద్వారా ప్రభావితం కావు.

మానిటోబా రిటైల్ అమ్మకపు పన్ను (కెనడా)

1 జనవరి 2026 నుండి, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు మానిటోబా రిటైల్ అమ్మకపు పన్ను (RST) వర్తిస్తుంది. ఫలితంగా, మానిటోబాలో బిల్లింగ్ చిరునామా లేదా షిప్పింగ్ చిరునామా ఉన్న వ్యాపారుల కోసం వర్తించే Shopify ఛార్జీలపై 7% మానిటోబా RSTని విధించాల్సి ఉంటుంది.

మీ Shopify బిల్లు మానీటోబా చిరునామాకు పంపబడితే, 7% RST మీ ఇన్‌వాయిస్‌లో ప్రత్యేక పన్ను లైన్ ఐటెమ్‌గా ప్రదర్శించబడుతుంది.

అమ్మకపు పన్ను వసూలు చేయమని Shopifyని ఆదేశించే US రాష్ట్రాలు, జిల్లాలు మరియు భూభాగాలు

కింది US రాష్ట్రాలు, జిల్లాలు మరియు భూభాగాల్లో అమ్మకపు పన్నును వసూలు చేయాల్సిన ఆవశ్యకతతో కెనడాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కెనడియన్ కంపెనీయే Shopify.

Shopify విధిగా అమ్మకపు పన్నును వసూలు చేయాల్సిన స్థలాలు US రాష్ట్రాలు, జిల్లాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో చేర్చబడ్డాయి. అయితే ప్రతి చోట సబ్‌స్క్రిప్షన్ ఫీజులపై పన్ను ఉంటుందా లేదా అనే విషయాన్ని ఇది సూచించదు. జాబితాలో పేర్కొన్న కొన్ని రాష్ట్రాల్లో, సబ్‌స్క్రిప్షన్ ఫీజులపై Shopify పన్నును వసూలు చేయదు.

ఒకవేళ మీ స్టోర్ కెనడాలో లేదా లిస్ట్ చేయబడిన రాష్ట్రాలు, జిల్లాలు మరియు భూభాగాల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే, అప్పుడు మీ సబ్‌స్క్రిప్షన్‌కు హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్ (HST), ప్రావిన్షియల్ సేల్స్ ట్యాక్స్ (PST), వస్తు మరియు సేవల పన్ను (GST), రాష్ట్ర పన్ను, కౌంటీ పన్ను లేదా మున్సిపల్ పన్ను వంటి వర్తించే పన్నులు విధించబడవచ్చు.

ఒకవేళ మీ స్టోర్ అనేది కెనడా వెలుపల లేదా పన్ను వసూలు ఆవశ్యకత ఉన్న రాష్ట్రాలు, జిల్లాలు మరియు భూభాగాల వెలుపల ఉన్నట్లయితే, అప్పుడు మీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీకి పన్నులు వర్తించవు.

మీ బిల్లులోని ప్రత్యేక లైన్‌లో పన్నులు ప్రదర్శించబడతాయి. మీరు మీ లొకేషన్ ఆధారంగా పన్నుల గణనను కూడా చూడవచ్చు.

అమ్మకపు పన్నును వసూలు చేయడానికి Shopify బాధ్యత వహించే US రాష్ట్రాలు, జిల్లాలు మరియు భూభాగాల జాబితా

అమ్మకపు పన్ను వసూలు చేయమని Shopifyని ఆదేశించే US రాష్ట్రాలు, జిల్లాలు మరియు భూభాగాలు
  • అలబామా
  • అలాస్కా
  • అరిజోనా
  • అర్కాన్సాస్
  • కాలిఫోర్నియా
  • కనెక్టికట్
  • కొలరాడో
  • ఫ్లోరిడా
  • జార్జియా
  • హవాయి
  • ఇడాహో
  • ఇల్లినాయిస్
  • ఇండియానా
  • అయోవా
  • కాన్సాస్
  • కెంటకీ
  • లూసియానా
  • మెయిన్
  • మేరీల్యాండ్
  • మసాచుసెట్స్
  • మిచిగాన్
  • మిన్నెసోటా
  • మిస్సిస్సిప్పి
  • మిస్సోరీ
  • నెబ్రాస్కా
  • నెవాడా
  • న్యూ జెర్సీ
  • న్యూ మెక్సికో
  • న్యూ యార్క్
  • నార్త్ కరోలినా
  • నార్త్ డకోటా
  • ఓహియో
  • ఓక్లహోమా
  • పెన్సిల్వేనియా
  • ప్యూర్టో రికో
  • రోడ్ ఐలాండ్
  • సౌత్ కరోలినా
  • సౌత్ డకోటా
  • టేనస్సీ
  • టెక్సాస్
  • ఉటా
  • వెర్మోంట్
  • వర్జీనియా
  • వాషింగ్టన్, డి.సి.
  • వాషింగ్టన్
  • వెస్ట్ వర్జీనియా
  • విస్కాన్సిన్
  • వ్యోమింగ్

షిప్పింగ్ లేబుల్‌ల మీద పన్నులు విధించే US రాష్ట్రాలు మరియు భూభాగాలు

Shopify అడ్మిన్‌లో కొనుగోలు చేసిన షిప్పింగ్ లేబుల్‌లు కొన్ని US రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పన్ను పరిధిలోకి వస్తాయి. ఒకవేళ మీరు అరిజోనా, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, హవాయి, న్యూ మెక్సికో, ప్యూర్టో రికో లేదా వెస్ట్ వర్జీనియాలో పన్ను-మినహాయింపు స్టేటస్‌ను కలిగి ఉంటే, మీరు రీసేల్ మినహాయింపులతో సహా, షిప్పింగ్ లేబుల్ పన్ను మినహాయింపుకు అర్హత సాధించవచ్చు. షిప్పింగ్ లేబుల్‌లపై పన్నుల గురించి మరింత తెలుసుకోండి.

సాధారణ బిల్లింగ్ పన్ను సమస్యల ట్రబుల్షూటింగ్

బిల్లింగ్ పన్నులకు సంబంధించిన సాధారణ సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి కింది సమాచారాన్ని ఉపయోగించండి.

మీ ఇన్‌వాయిస్‌లోని ఊహించని పన్ను ఛార్జీలను ట్రబుల్షూట్ చేయండి

మీ ఇన్‌వాయిస్‌లో మీ ప్రస్తుత లొకేషన్‌తో సరిపోలని పన్నులు ఉన్నట్లు మీరు గమనిస్తే, కింది అంశాలను రివ్యూ చేయండి:

  • వ్యాపార చిరునామా చరిత్ర: ఇన్‌వాయిస్‌ను జనరేట్ చేసిన సమయంలో ఉన్న మీ బిల్లింగ్ చిరునామా ఆధారంగా పన్నులు లెక్కించబడతాయి. ఒకవేళ మీరు ఇటీవల వేరే చోటికి మారినట్లయితే, మీ మునుపటి ఇన్‌వాయిస్‌ల కోసం పాత చిరునామా ఉపయోగించబడి ఉండవచ్చు.
  • షిప్పింగ్ లేబుల్ పన్నులు: ఇతర ప్రావిన్సుల్లోని కస్టమర్ల కోసం కొనుగోలు చేసిన షిప్పింగ్ లేబుల్‌లకు కెనడియన్ వ్యాపారుల ఇన్‌వాయిస్‌లపై క్యూబెక్ సేల్స్ ట్యాక్స్ (QST) లాంటి ప్రాంతీయ పన్నులు వసూలు చేయబడవచ్చు. నిర్దిష్ట రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో షిప్పింగ్ చేస్తున్నప్పుడు US వ్యాపారులకు షిప్పింగ్ లేబుల్‌ల మీద పన్నులు విధించబడవచ్చు.
  • చిరునామా ధృవీకరణ: సెట్టింగ్‌లు > బిల్లింగ్లో మీ ప్రస్తుత బిల్లింగ్ చిరునామా సరైనదని నిర్ధారించుకోండి.
ఇన్‌వాయిస్‌లపై ప్రదర్శించబడని పన్ను మినహాయింపును ట్రబుల్‌షూట్ చేయండి

మీ ఇన్‌వాయిస్‌లలో మీ పన్ను మినహాయింపు ప్రతిబింబించకపోతే, కింది అంశాలను రివ్యూ చేయండి:

  • ప్రాసెసింగ్ సమయం: మీరు మీ డాక్యుమెంటేషన్‌ను సమర్పించిన తర్వాత పన్ను మినహాయింపులను ప్రాసెస్ చేయడానికి 2 వారాల సమయం పట్టవచ్చు.
  • అమలు తేదీ: మినహాయింపులు భవిష్యత్తులో వచ్చే ఇన్‌వాయిస్‌లకు మాత్రమే వర్తిస్తాయి. మీ పన్ను మినహాయింపు ఆమోదించబడక ముందు రూపొందించిన ఇన్‌వాయిస్‌లకు అవి వర్తించవు.
  • స్వీయ-సేవల ప్రాంతాలు: మీరు మీ పన్ను నంబర్‌ను జోడించడానికి సపోర్ట్ చేసే దేశంలో (ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ వంటివి) ఉన్నట్లయితే, మీరు మీ పన్ను రిజిస్ట్రేషన్ నంబర్‌ను సెట్టింగ్‌లు > బిల్లింగ్ > బిల్లింగ్ సమాచారంలో ఎంటర్ చేశారో లేదో ధృవీకరించుకోండి.
  • గడువు ముగింపు: ఒకవేళ మీకు ఇప్పటికే ఒక మినహాయింపు ఉంటే, దాని గడువు ముగియలేదని నిర్ధారించుకోండి. మినహాయింపు గడువు ముగియనున్నప్పుడు మీకు తెలియజేయబడుతుంది.
ఇన్‌వాయిస్‌పై తప్పు పన్ను రేటును ట్రబుల్షూట్ చేయండి

మీ ఇన్‌వాయిస్‌పై పన్ను రేటు తప్పుగా అనిపిస్తే, కింది అంశాలను రివ్యూ చేయండి:

  • కలిపిన పన్ను రేట్లు: కొన్ని న్యాయపరిధులలో, మీ ఇన్‌వాయిస్‌లో യുనైటెడ్ స్టేట్స్‌లోని రాష్ట్ర, కౌంటీ, అలాగే మున్సిపల్ పన్నులు లేదా కెనడాలోని GST, PST లాంటి బహుళ పన్ను విభాగాలు ఉండవచ్చు.
  • రేటు మార్పులు: ప్రభుత్వ పాలసీ అప్‌డేట్‌ల కారణంగా పన్ను రేటులు మారవచ్చు. ఛార్జ్ చేసిన రేటు అనేది బిల్లింగ్ సమయంలో వర్తించే రేటును ప్రతిబింబిస్తుంది.
  • చిరునామా కచ్చితత్వం: పన్ను రేటులు నిర్దిష్ట లొకేషన్‌ను బట్టి మారుతాయి కాబట్టి, మీ బిల్లింగ్ చిరునామా సరిగ్గా ఎంటర్ చేశారో లేదో ధృవీకరించుకోండి.
పునఃవిక్రేత మినహాయింపు అభ్యర్థనలను ట్రబుల్షూట్ చేయండి

సబ్‌స్క్రిప్షన్ ఫీజుల రీసేల్ ఆధారంగా Shopify పన్ను మినహాయింపులను అందించలేదు. మీరు ఒక వస్తువును తిరిగి విక్రయించే ఉద్దేశంతో కొనుగోలు చేసినప్పుడు రీసేల్ మినహాయింపులు వర్తిస్తాయి. Shopify సేవలు మీ వ్యాపారాన్ని నిర్వహించడానికి ఉపయోగించబడతాయి, అవేవీ తిరిగి విక్రయించబడవు కాబట్టి, రీసేల్ మినహాయింపులు వీటికి వర్తించవు.

అరిజోనా, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, హవాయి, న్యూ మెక్సికో, ప్యూర్టో రికో, వెస్ట్ వర్జీనియాలోని షిప్పింగ్ లేబుల్ పన్నులు మాత్రమే దీనికి మినహాయింపు, అక్కడ రీసేల్ మినహాయింపులు ఆమోదించబడవచ్చు.

Shopify నుండి పన్ను డాక్యుమెంట్‌లను అభ్యర్థించడం

మీ పన్ను ఫైలింగ్‌లలో సహాయం చేయడానికి Shopify కొన్ని డాక్యుమెంట్‌లను అందించగలదు. ఏయే డాక్యుమెంట్‌లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా అభ్యర్థించాలో అర్థం చేసుకోవడం వలన పన్ను సీజన్ కోసం సిద్ధం కావడానికి మీకు సహాయపడుతుంది.

Shopify నుండి అందుబాటులో ఉన్న డాక్యుమెంట్‌లు

అభ్యర్థనపై కింది పన్ను-సంబంధిత డాక్యుమెంట్‌లు అందుబాటులో ఉండవచ్చు:

  • ఫిస్కల్ రెసిడెన్సీ సర్టిఫికెట్: మీ దేశానికి సంబంధించి Shopify పన్ను నివాస స్థితిని నిర్ధారిస్తుంది. మీ దేశం, మీకు Shopify బిల్లులు జారీ చేసే దేశం మధ్య పన్ను ఒప్పందం ఉన్నప్పుడు రెట్టింపు పన్నును నివారించడంలో ఈ డాక్యుమెంట్ సహాయపడుతుంది.
  • W8-BEN-E ఫారమ్: పన్ను ప్రయోజనాల కోసం Shopify విదేశీ హోదాను డాక్యుమెంట్ చేయాల్సిన US వ్యాపారులకు అందుబాటులో ఉంది.
  • ఫారమ్ 10F లేదా శాశ్వత స్థాపన లేని సర్టిఫికేట్: భారతదేశంలో Shopifyకి ఎలాంటి శాశ్వత స్థాపన లేదని నిర్ధారించే డాక్యుమెంటేషన్ అవసరమైన భారతదేశంలోని వ్యాపారులకు అందుబాటులో ఉంటుంది.

మీరు మీ Shopify అడ్మిన్‌లో ఏ డాక్యుమెంట్‌లను యాక్సెస్ చేయవచ్చు

Shopify సపోర్ట్‌ని సంప్రదించకుండానే కింది బిల్లింగ్ సమాచారం నేరుగా మీ Shopify అడ్మిన్‌లో అందుబాటులో ఉంటుంది:

  • ఇన్‌వాయిస్‌లు మరియు బిల్లింగ్ చరిత్ర: సెట్టింగ్‌లు > బిల్లింగ్ నుండి గత ఇన్‌వాయిస్‌లను వీక్షించండి మరియు డౌన్‌లోడ్ చేయండి.
  • చెల్లింపు రికార్డ్‌లు: ఫైల్‌లో చెల్లింపు చరిత్ర మరియు పద్ధతులను రివ్యూ చేయండి.

ఫిస్కల్ రెసిడెన్సీ సర్టిఫికేట్ లేదా ఇతర పన్ను డాక్యుమెంట్‌ను అభ్యర్థించండి

మీకు Shopify నుండి ఫిస్కల్ రెసిడెన్సీ సర్టిఫికేట్ లేదా ఇతర పన్ను డాక్యుమెంటేషన్ అవసరమైతే, కింది సమాచారంతో Shopify సపోర్ట్ని సంప్రదించండి:

  • మీకు కావాల్సిన డాక్యుమెంట్ రకం
  • మీకు డాక్యుమెంట్ అవసరమైన సంవత్సరాలు
  • మీ నివాస దేశం
  • మీకు ఒరిజినల్, స్టాంప్ వేసిన డాక్యుమెంట్ అవసరమా (కొంతమంది పన్ను అధికారులకు భౌతిక కాపీలు అవసరం కావచ్చు)
  • మీ మెయిలింగ్ చిరునామా (భౌతిక డాక్యుమెంట్ అవసరమైతే)

ప్రాసెసింగ్ సమయాలు డాక్యుమెంట్ రకం, ప్రమేయం ఉన్న పన్ను అథారిటీని బట్టి మారుతుంటాయి. కెనడా రెవెన్యూ ఏజెన్సీ ద్వారా అభ్యర్థించిన ఫిస్కల్ రెసిడెన్సీ సర్టిఫికెట్‌లను ప్రాసెస్ చేయడానికి 8 నుండి 10 వారాల సమయం పట్టవచ్చు, అయితే ఇతర అధికార పరిధుల నుండి డాక్యుమెంట్‌లు మరింత త్వరగా రావచ్చు.

Shopify Tax లావాదేవీ రుసుములు

Shopify Tax ఉపయోగించి వర్తించే ఆర్డర్‌లపై పన్ను లావాదేవీల రుసుములు వర్తిస్తాయి మరియు ఇవి మీ Shopify సబ్‌స్క్రిప్షన్ నుండి విడిగా ఛార్జ్ చేయబడతాయి. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కస్టమర్‌లకు విక్రయించే వ్యాపారులందరికీ Shopify Tax అందుబాటులో ఉంటుంది. Shopify Tax లావాదేవీల రుసుముల గురించి మరింత తెలుసుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

గత ఇన్‌వాయిస్‌లలో విధించిన పన్నులకు నాకు రీఫండ్ అందుతుందా?

ఆ సమయంలో ఉన్న మీ బిల్లింగ్ చిరునామా ఆధారంగా పన్నులను సరిగ్గా లెక్కించినట్లయితే, గత ఇన్‌వాయిస్‌లలో ఛార్జ్ చేసిన పన్నులను Shopify రీఫండ్ చేయదు. మీ బిల్లింగ్ సమాచారం కచ్చితమైనదని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మీదే. పొరపాటున పన్నులు విధించబడ్డాయని మీరు భావిస్తే, మీ నిర్దిష్ట పరిస్థితిని సమీక్షించడానికి Shopify సపోర్ట్ను సంప్రదించండి.

పన్ను మినహాయింపు ప్రాసెస్‌కు ఎంత సమయం పడుతుంది?

మీరు మీ పన్ను మినహాయింపు డాక్యుమెంటేషన్‌ను సమర్పించిన తర్వాత, Shopify సపోర్ట్ మినహాయింపును సమీక్షించి, ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రాసెస్‌కు 2 వారాల వరకు పట్టవచ్చు. మీ పన్ను మినహాయింపు వర్తింపజేయబడినప్పుడు మీరు నిర్ధారణను పొందుతారు. అసంపూర్ణమైన డాక్యుమెంటేషన్ వల్ల జాప్యాలు జరగవచ్చు.

ప్రతి US రాష్ట్రానికి నాకు ప్రత్యేక మినహాయింపు అవసరమా?

అవును. పన్ను మినహాయింపు సర్టిఫికెట్‌లను ఆయా రాష్ట్రాలు జారీ చేస్తాయి కాబట్టి, మీ Shopify బిల్లింగ్‌పై పన్నుల నుండి మినహాయింపును కోరుకునే ప్రతి రాష్ట్రానికి చెల్లుబాటు అయ్యే మినహాయింపు సర్టిఫికెట్‌ను మీరు అందించాలి. ప్రతి రాష్ట్రానికి దానికంటూ ప్రత్యేక ఫారమ్ మరియు అవసరాలు ఉంటాయి.

నా పన్ను రిటర్న్‌ల కోసం నేను Shopify నుండి ఏ డాక్యుమెంట్‌లను పొందగలను?

మీరు సెట్టింగ్‌లు > బిల్లింగ్ నుండి నేరుగా మీ Shopify అడ్మిన్‌లో మీ ఇన్‌వాయిస్‌లు, బిల్లింగ్ చరిత్రను యాక్సెస్ చేయవచ్చు. ఫిస్కల్ రెసిడెన్సీ సర్టిఫికెట్‌లు లేదా W8-BEN-E ఫారమ్‌ల వంటి అదనపు పన్ను డాక్యుమెంట్‌ల కోసం, మీకు అవసరమైన నిర్దిష్ట డాక్యుమెంట్, అది కవర్ చేసే పన్ను సంవత్సరాల గురించిన వివరాలతో Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.

నేను Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి బదులుగా ఎప్పుడు పన్ను నిపుణులను సంప్రదించాలి?

కింది పరిస్థితులలో పన్ను నిపుణుడిని సంప్రదించండి:

  • మీ పరిధిలో మీకు పన్ను మినహాయింపులకు అర్హత ఉందా లేదా అనే దానిపై సలహా కోసం
  • మీ పన్నులను సరిగ్గా ఎలా ఫైల్ చేయాలనే దానిపై మార్గదర్శకత్వం కోసం
  • మీ నిర్దిష్ట పన్ను బాధ్యతల గురించి ఏవైనా ప్రశ్నల కోసం
  • పన్ను చట్టాలు మరియు నియంత్రణల వివరణ కోసం
  • మీ వ్యాపారం కోసం వ్యూహాత్మక పన్ను ప్రణాళిక కోసం

కింది పరిస్థితులలో Shopify సపోర్ట్‌ను సంప్రదించండి:

  • మీ పన్ను మినహాయింపు డాక్యుమెంటేషన్‌ను ఎలా సమర్పించాలి అనేదానిపై ప్రశ్నల కోసం
  • Shopify నుండి నిర్దిష్ట పన్ను డాక్యుమెంట్‌ల కోసం అభ్యర్థనల కోసం
  • మీ Shopify ఇన్‌వాయిస్‌పై ఉన్న ఛార్జీల గురించి ప్రశ్నల కోసం
  • మీ బిల్లింగ్ సెట్టింగ్‌లతో సాంకేతిక సహాయం కోసం

మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి ముందు

మీ సమస్యను వేగంగా పరిష్కరించడానికి, Shopify సపోర్ట్‌ను సంప్రదించే ముందు కింది సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోండి:

  • సెట్టింగ్‌లు > బిల్లింగ్లో లిస్ట్ చేయబడిన ప్రభావిత ఇన్‌వాయిస్‌ల నంబర్‌లు
  • మీ ఇన్‌వాయిస్‌లో పన్ను లైన్ ఐటెమ్‌ల స్క్రీన్‌షాట్‌లు
  • మీ ప్రస్తుత బిల్లింగ్ చిరునామా మరియు ఇటీవల జరిగిన చిరునామా మార్పులు
  • మీ పన్ను మినహాయింపు సర్టిఫికెట్ లేదా డాక్యుమెంటేషన్ (వర్తిస్తే)
  • మీ సంస్థ యొక్క EIN (యునైటెడ్ స్టేట్స్) లేదా వ్యాపార నంబర్ (కెనడా)
  • మినహాయింపు అభ్యర్థనల కోసం: మినహాయింపు డాక్యుమెంట్‌లపై మీ సంస్థ పేరు, మీ Shopify ఖాతాతో సరిపోలుతుందనే నిర్ధారణ
  • సమస్య పరిష్కారం కోసం మీరు ఇప్పటికే ప్రయత్నించిన దశలు

ఈ సమాచారం సిద్ధంగా ఉండటం వలన మీకు మరింత సమర్థవంతంగా సహాయం చేయడానికి Shopify సపోర్ట్‌కు ఉపయోగపడుతుంది.