ప్లాన్‌ల కోసం Shopify రీఫండ్ విధానాన్ని అర్థం చేసుకోవడం

Shopify సేవా నిబంధనల లోని విభాగం 5.10లో పేర్కొన్న విధంగా, Shopify ప్లాన్‌లు సాధారణంగా వాపసు చేయబడనివి. ప్లాన్ రద్దు చేయడం మరియు డియాక్టివేట్ చేయడం సహా చాలా పరిస్థితులకు ఇది వర్తిస్తుంది. అయితే, మీకు పొరపాటుగా ఛార్జ్ చేయబడిందని మీరు భావిస్తే లేదా మీకు ఏదైనా ప్రత్యేక పరిస్థితి ఉన్నట్లయితే, మీ పరిస్థితిని సమీక్షించడానికి మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించవచ్చు.

ఈ పేజీలో

రీఫండ్ అర్హత సమయ వ్యవధులు

రీఫండ్‌లకు హామీ లేనప్పటికీ, అర్హత కలిగిన అభ్యర్థనలను Shopify సపోర్ట్ ఒక్కో కేసు ఆధారంగా సమీక్షిస్తుంది. రీఫండ్ సమీక్ష కోసం అర్హత పొందాలంటే, మీ రద్దు లేదా అభ్యర్థన తప్పనిసరిగా నిర్దిష్ట సమయ వ్యవధులలోపు ఉండాలి:

సబ్‌స్క్రిప్షన్ రకంరీఫండ్ పరిశీలన కోసం సమయ వ్యవధి
నెలవారీ సబ్‌స్క్రిప్షన్ఇన్‌వాయిస్ జారీ చేసిన తేదీ నుండి 7 రోజులలోపు
ట్రయల్ వ్యవధి తర్వాత మొదటి ఇన్‌వాయిస్ఇన్‌వాయిస్ జారీ చేసిన తేదీ నుండి 30 రోజులలోపు
వార్షిక సబ్‌స్క్రిప్షన్ఇన్‌వాయిస్ జారీ చేసిన తేదీ నుండి 30 రోజులలోపు
SEPA డైరెక్ట్ డెబిట్ చెల్లింపులుఇన్‌వాయిస్ జారీ చేసిన తేదీ నుండి 14 రోజులలోపు
బ్రెజిల్‌లో ఉన్న వ్యాపారులుఇన్‌వాయిస్ జారీ చేసిన తేదీ నుండి 90 రోజులలోపు

రీఫండ్ కోసం ఏవి అర్హత పొందవు

కింది పరిస్థితులు సాధారణంగా రీఫండ్‌లకు అర్హత పొందవు:

  • ప్లాన్ డౌన్‌గ్రేడ్‌లు: మీరు సైకిల్ మధ్యలో మీ ప్లాన్‌ను డౌన్‌గ్రేడ్ చేసినప్పుడు, రీఫండ్‌కు బదులుగా భవిష్యత్తు ఇన్‌వాయిస్‌లకు వర్తింపజేయడానికి మీకు అకౌంట్ క్రెడిట్‌లు అందుతాయి. మీ ప్రస్తుత ప్లాన్ ఫీచర్‌లు మీ బిల్లింగ్ సైకిల్ ముగిసే వరకు అలాగే ఉంటాయి.
  • సమయ వ్యవధుల వెలుపలి అభ్యర్థనలు: అర్హత కలిగిన సమయ వ్యవధులు ముగిసిన తర్వాత చేసిన రద్దు లేదా రీఫండ్ అభ్యర్థనలు.
  • వినియోగించని సేవలు: Shopify సేవను అందించడాన్ని కొనసాగిస్తున్నందున, మీ బిల్లింగ్ వ్యవధిలో మీ Shopify స్టోర్‌ను ఉపయోగించనప్పటికీ రీఫండ్ కోసం ఆటోమేటిక్‌గా మీకు అర్హత లభించదు.
  • థర్డ్-పార్టీ యాప్ ఛార్జీలు: థర్డ్-పార్టీ యాప్‌ల నుండి వచ్చిన ఛార్జీలను Shopify రీఫండ్ చేయలేదు. మీరు తప్పనిసరిగా నేరుగా యాప్ డెవలపర్‌ను సంప్రదించాలి.
  • థీమ్ కొనుగోళ్లు: థీమ్ విక్రయాలు అంతిమమైనవి, వాపసు చేయబడనివి. థీమ్ రీఫండ్ విధానాల గురించి మరింత తెలుసుకోండి.

నిర్దిష్ట బిల్లింగ్ మరియు రీఫండ్ పరిస్థితులను నిర్వహించడం

Shopifyలో ప్లాన్‌లతో వ్యవహరించేటప్పుడు, బిల్లింగ్ మరియు రీఫండ్ విధానాలను అర్థం చేసుకోవడం చాలా కీలకమైన వివిధ పరిస్థితులను మీరు ఎదుర్కోవచ్చు. కింద కొన్ని ప్రధాన పరిస్థితులు, వాటిని ఎలా నావిగేట్ చేయాలో ఇవ్వబడ్డాయి:

  • ప్లాన్ రద్దు చేయడం: ఒకవేళ మీరు మీ Shopify ప్లాన్‌ను రద్దు చేస్తే, రద్దు చేసిన తర్వాతి మిగిలిన వ్యవధికి ఎటువంటి రీఫండ్‌లు జారీ చేయబడవు.
  • ప్లాన్ డౌన్‌గ్రేడ్‌లు: Shopify ప్లాన్‌లు ప్రీ-పెయిడ్ (ముందుగా చెల్లించేవి). మీరు సైకిల్ మధ్యలో డౌన్‌గ్రేడ్ ఎంచుకున్నట్లయితే, అప్పుడు మీ కొత్త ప్లాన్ ప్రస్తుత బిల్లింగ్ సైకిల్ ముగింపులో అమలులోకి వస్తుంది. బిల్లింగ్ సైకిల్స్ గురించి మరింత తెలుసుకోండి.
  • బిల్లింగ్ ఎర్రర్‌లు: బిల్లింగ్ ఎర్రర్ ఏర్పడిందని మీరు భావిస్తే, Shopify సపోర్ట్‌ను సంప్రదించండి. ఒక సపోర్ట్ అడ్వైజర్ మీ బిల్లింగ్ సమస్యను సమీక్షించి దాన్ని పరిష్కరించడంలో సహాయపడతారు.
  • ఊహించని ఛార్జీలు: మీరు ఊహించని ఛార్జీలను నివారించాలనుకుంటే, తదుపరి బిల్లింగ్ సైకిల్ ప్రారంభం కావడానికి ముందే మీరు మీ ప్లాన్‌ను రద్దు చేసుకోవాలి. అనాలోచితంగా పడే ఛార్జీలను నిరోధించడానికి మీ స్టోర్‌ను డియాక్టివేట్ చేసే ప్రక్రియ గురించి తెలుసుకోండి.

బిల్లింగ్ సమీక్షను అభ్యర్థించండి

మీకు తప్పుగా ఛార్జ్ చేయబడిందని, మీకు నకిలీ (డూప్లికేట్) స్టోర్‌లు ఉన్నాయని లేదా ఏదైనా ఇతర ప్రత్యేక పరిస్థితి ఉందని మీరు భావిస్తే, అప్పుడు Shopify సపోర్ట్‌ను సంప్రదించండి. సపోర్ట్ అడ్వైజర్ మీ పరిస్థితిని సమీక్షించి, రీఫండ్ లేదా క్రెడిట్ సరైనదా కాదా అని నిర్ధారిస్తారు. రీఫండ్‌లు మరియు క్రెడిట్‌లకు హామీ ఉండదు, కానీ కొన్ని పరిస్థితులలో సమీక్షించిన తర్వాత అవి ఆమోదించబడవచ్చు.

బిల్లింగ్ రీఫండ్ లేదా క్రెడిట్ గురించి మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి ముందు

బిల్లింగ్ రీఫండ్ లేదా క్రెడిట్ గురించి Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి ముందు, మీ సమస్యను వేగంగా పరిష్కరించడంలో సహాయపడటానికి కింది సమాచారాన్ని సేకరించండి:

  • రీఫండ్ అభ్యర్థనలను వారు మాత్రమే సమర్పించగలరు కాబట్టి, మీరు స్టోర్ యజమాని లేదా బిల్లింగ్ అనుమతులు ఉన్న సిబ్బంది సభ్యుడని నిర్ధారించండి
  • మీ స్టోర్ URL మరియు అకౌంట్ ఇమెయిల్ చిరునామా
  • సందేహాస్పద ఛార్జీ కోసం ఇన్‌వాయిస్ నంబర్ మరియు తేదీ
  • మీరు మీ స్టోర్‌ను రద్దు చేసిన లేదా డౌన్‌గ్రేడ్ చేసిన తేదీ, ఒకవేళ వర్తిస్తే
  • ఇది మీ ట్రయల్ వ్యవధి తర్వాత మొదటి ఇన్‌వాయిస్ అవునా కాదా అనే విషయం
  • యాప్ రీఫండ్‌ల కోసం: మీరు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసిన తేదీ మరియు యాప్ బిల్లింగ్ వ్యవధి ప్రారంభ తేదీ
  • బిల్లింగ్ ఎర్రర్ లేదా డూప్లికేట్ ఛార్జీ వంటి, మీరు రీఫండ్‌ను ఎందుకు అభ్యర్థిస్తున్నారనే దాని గురించి చిన్న వివరణ
  • బిల్లింగ్ ఎర్రర్‌ల స్క్రీన్‌షాట్‌లు లేదా రద్దు చేసిన నిర్ధారణ వంటి, సహాయక డాక్యుమెంటేషన్ ఏదైనా ఉంటే
  • ఈ పేజీలోని ట్రబుల్షూటింగ్ విభాగాల నుండి మీరు ఇది వరకే ప్రయత్నించిన దశలు

ఈ సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా, మీకు మరింత సమర్థవంతంగా సహాయం చేయడానికి Shopify సపోర్ట్‌కు వీలవుతుంది.

ఉపయోగించని సేవా క్లెయిమ్‌లను నిర్వహించడం

Shopify ప్లాన్‌లు ప్రీ-పెయిడ్ కాబట్టి, మధ్యలో డౌన్‌గ్రేడ్ చేస్తే, మీ ప్రస్తుత బిల్లింగ్ సైకిల్ ముగిసిన తర్వాత మాత్రమే మీ కొత్త ప్లాన్ అమలులోకి వస్తుంది.

అనధికారిక లేదా తప్పు ఛార్జీల కోసం రీఫండ్‌ను అభ్యర్థించండి

బిల్లింగ్ వ్యత్యాసాలలో ఉన్న గుర్తింపు లేని ఛార్జీలను పరిష్కరించడం లేదా అనధికారిక లేదా తప్పు ఛార్జీల కోసం రీఫండ్‌ను అభ్యర్థించడం గురించిన సమాచారం కోసం, మీ Shopify బిల్లులపై తెలియని ఛార్జ్ సమస్యలను పరిష్కరించడం చూడండి.

బిల్లింగ్ వ్యత్యాసం ఏర్పడిన సందర్భంలో రీఫండ్ అర్హత

Shopify సేవా నిబంధనలు రీఫండ్‌లను అనుమతించవు. అయితే, స్పష్టమైన పొరపాటు జరిగితే, మీ బిల్లులో ఆ నిర్దిష్ట సమస్యను సమీక్షించి పరిష్కరించడానికి మీరు వెంటనే Shopify సపోర్ట్‌తో చర్చించవచ్చు.

Shopify App Store కొనుగోళ్లకు రీఫండ్‌లు

యాప్ కొనుగోళ్ల రీఫండ్ విధానాలు ఆ యాప్‌ను Shopify డెవలప్ చేసిందా లేదా థర్డ్-పార్టీ డెవలపర్ చేశారా అనే దానిపై ఆధారపడి మారుతూ ఉంటాయి.

థర్డ్-పార్టీ యాప్‌లు

థర్డ్-పార్టీ యాప్‌లకు సంబంధించిన రీఫండ్‌లను Shopify కాకుండా నేరుగా యాప్ డెవలపరే నిర్వహిస్తారు. థర్డ్-పార్టీ యాప్ కోసం రీఫండ్ లేదా క్రెడిట్‌ని అభ్యర్థించడానికి, నేరుగా యాప్ డెవలపర్‌ను సంప్రదించండి. యాప్ ఛార్జీల వివాదాలను, రీఫండ్‌లను పరిష్కరించడం (ట్రబుల్షూటింగ్) గురించి మరింత తెలుసుకోండి.

Shopify యాప్‌లు

Shopify డెవలప్ చేసిన యాప్‌ల విషయానికి వస్తే, యాప్ బిల్లింగ్ వ్యవధి ప్రారంభమైన 7 రోజుల్లోపు అన్‌ఇన్‌స్టాల్ చేస్తే ఆ రీఫండ్ అభ్యర్థనలు పరిగణించబడతాయి. భవిష్యత్తులో ఛార్జీలు పడకుండా ఉండటానికి, రీఫండ్‌ను అభ్యర్థించే ముందు మీరు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేశారని నిర్ధారించుకోండి.

Shopify App Store కొనుగోళ్లకు రీఫండ్ లేదా క్రెడిట్‌ను అభ్యర్థించడం

Shopify App Store నుండి కొనుగోలు చేసిన యాప్‌ల కోసం క్రెడిట్ లేదా రీఫండ్‌ను కోరుతున్నప్పుడు, యాప్ డెవలపర్‌తో మాట్లాడే సరైన దశలను తెలుసుకోవడం, రీఫండ్ విధానాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.

Shopify App Store కొనుగోళ్లకు రీఫండ్ లేదా క్రెడిట్‌ను అభ్యర్థించడం ఎలా

మీరు ఒక యాప్ కోసం రీఫండ్ లేదా క్రెడిట్‌ని అభ్యర్థించినప్పుడు, చెల్లింపు ఎలా నిర్వహించబడిందనే దానిపై ఆధారపడి ప్రక్రియ ఈ క్రింది విధాలుగా మారవచ్చు:

  • Shopify ప్రాసెస్ చేసిన చెల్లింపులు: యాప్‌కు సంబంధించిన ఛార్జీ Shopify ద్వారా ప్రాసెస్ చేయబడితే, యాప్ డెవలపర్ రీఫండ్‌ను జారీ చేయవచ్చు లేదా మీకు క్రెడిట్‌ను అందించవచ్చు. క్రెడిట్‌లు భవిష్యత్తులో చేసే Shopify App Store కొనుగోళ్లకు వర్తిస్తాయి, ఇవి మీ సబ్‌స్క్రిప్షన్ బిల్లులో డాక్యుమెంట్ చేయబడతాయి.
  • బాహ్యంగా ప్రాసెస్ చేసిన చెల్లింపులు: ఛార్జీ అనేది Shopify వెలుపల ప్రాసెస్ చేయబడితే, డెవలపర్ అసలు చెల్లింపు పద్ధతి ద్వారా ఆ రీఫండ్‌ను నిర్వహిస్తారు.

రీఫండ్ విధానానికి సంబంధించిన నిర్దిష్ట వివరాల కోసం ఎల్లప్పుడూ యాప్ లిస్టింగ్ పేజీని లేదా డెవలపర్ హోమ్‌పేజీని తనిఖీ చేయండి, ఎందుకంటే ఆమోదం ఆయా నిబంధనలపై ఆధారపడి ఉండవచ్చు.

దశలు:

  1. Shopify App Storeని సందర్శించి యాప్ కోసం వెతకండి.
  2. యాప్‌ని క్లిక్ చేసి, ఆపై సపోర్ట్ పొందండి మీద క్లిక్ చేయండి.
  3. మీ సమాచారాన్ని, అభ్యర్థనకు సంబంధించిన మెసేజ్‌ను అందించి, ఆపై మెసేజ్ పంపండిని క్లిక్ చేయండి.

డెవలపర్ రిప్లయిలు, మీ Shopify ఖాతాతో అనుసంధానించబడిన ఇమెయిల్ అడ్రస్‌కు పంపబడతాయి.

యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం

ఇకపై యాప్ అవసరం లేదని మీరు నిర్ణయించుకుంటే, దాన్ని నేరుగా మీ Shopify అడ్మిన్ నుండి అన్‌ఇన్‌స్టాల్ చేయవచ్చు.

థీమ్ కొనుగోళ్లకు రీఫండ్ విధానం

Shopify Theme Store నుండి కొనుగోలు చేసిన థీమ్‌లు తుది విక్రయాలు, వీటికి వాపసు వర్తించదు. మీరు థీమ్‌ను కొనుగోలు చేసినప్పుడు, వెంటనే దాని సోర్స్ కోడ్‌కు పూర్తి యాక్సెస్‌ను పొందుతారు, కొనుగోలు చేసిన తర్వాత ఆ యాక్సెస్‌ను Shopify వెనక్కి తీసుకోదు.

థీమ్‌ను కొనుగోలు చేసే ముందు, వీటిని పరిగణించండి:

  • కొనే ముందు ట్రై చేయండి: మీరు కొనుగోలు చేయడానికి ముందు మీ స్టోర్‌లో ఏ థీమ్‌నైనా ఉచితంగా ట్రై చేయవచ్చు. థీమ్ మీ అవసరాలకు అనుగుణంగా పని చేస్తుందో లేదో సరిచూసుకోవడానికి దాన్ని ఉపయోగించండి.
  • థీమ్ డాక్యుమెంటేషన్‌ను సమీక్షించండి: కొనుగోలు చేసే ముందు, దాని లిస్టింగ్ పేజీలో థీమ్ ఫీచర్‌లను, అవసరాలను తనిఖీ చేయండి.
  • థీమ్ డెవలపర్‌ను సంప్రదించండి: థీమ్ పనితీరుకు సంబంధించి మీకు ప్రశ్నలు ఉంటే, కొనుగోలు చేయడానికి ముందు థీమ్ లిస్టింగ్ పేజీ ద్వారా డెవలపర్‌ను సంప్రదించండి.

స్పెల్లింగ్ తప్పు ఉన్న డొమైన్‌లకు రీఫండ్ విధానం

ఉపయోగించని సేవలు, స్పెల్లింగ్ తప్పు ఉన్న డొమైన్‌లు లేదా అనర్హత సందర్భాలతో సహా, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల కోసం Shopify సాధారణంగా రీఫండ్‌లను జారీ చేయదు. పొరపాటున ఛార్జీ విధించబడిందని మీరు భావిస్తే, సమీక్షను అభ్యర్థించడానికి Shopify సపోర్ట్‌ని సంప్రదించండి. Shopify రీఫండ్ విధాన వివరాల కోసం, Shopify సేవా నిబంధనలలోని 5.10 విభాగాన్ని చూడండి.

లావాదేవీ రుసుము విధానాలను అర్థం చేసుకోవడం

మీరు Shopifyలో ఆర్డర్‌ను రద్దు చేసినప్పుడు, ఆ రద్దుకు సంబంధించిన లావాదేవీ రుసుము మీ ఖాతాకు రీఫండ్ చేయబడదు లేదా క్రెడిట్ అవ్వదు.

లావాదేవీ రుసుములు అనేవి Shopify Payments రుసుముల నుండి వేరుగా ఉంటాయి, ఇవి మీ పేఅవుట్ నుండి నేరుగా తీసుకోబడతాయి. రుసుములు మరియు ఖర్చుల గురించి మరింత తెలుసుకోండి.