మీ Shopify స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడం, రీయాక్టివేట్ చేయడం
ఒకవేళ మీరు స్టోర్ యజమాని అయితే, మీ స్టోర్ అర్హత కలిగి ఉంటే, మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడానికి, మీ ప్రస్తుత బిల్లింగ్ సైకిల్ ముగింపులో మీ స్టోర్‌ను పూర్తిగా డీయాక్టివేట్ చేయడానికి మీ Shopify అడ్మిన్‌ను ఉపయోగించవచ్చు.
ఒకవేళ మీరు మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయాలనుకుంటే, కానీ మీ ఇమెయిల్ లేదా పాస్‌వర్డ్ గుర్తులేకుంటే, మీరు మీ Shopify లాగిన్ వివరాలను రికవర్ చేయవచ్చు.
ఈ పేజీలో
- మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడానికి ముందు పరిగణించాల్సిన అంశాలు
- ఉచిత ట్రయల్ లేదా ప్రమోషనల్ ధర వర్తించే వ్యవధిలో మీ Shopify స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడం
- మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి, మీ Shopify స్టోర్‌ను డీయాక్టివేట్ చేయండి
- స్టోర్ డీయాక్టివేషన్ సమయంలో రెండు-దశల ప్రామాణీకరణ సమస్యలను ట్రబుల్షూట్ చేయడం
- మీ ప్లాన్‌ను రీయాక్టివేట్ చేయండి
- మీ డేటాను తొలగించండి
- మీ స్టోర్‌ను రీయాక్టివేట్ చేయండి
మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడానికి ముందు పరిగణించాల్సిన అంశాలు
మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడానికి ముందు, మీ స్టోర్‌ను మూసివేయడానికి సంబంధించిన సంభావ్య సమస్యలను నివారించడానికి కింది అంశాలను రివ్యూ చేయండి.
మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడానికి ముందు రిమైండర్‌లు
- Shopify Plus వినియోగదారులు: మీ స్టోర్ Shopify Plus ప్లాన్‌లో ఉంటే, సహాయం కోసం Shopify Plus మద్దతును సంప్రదించండి. మీ Shopify Plus ప్లాన్‌ను రెన్యువల్ చేయడం లేదా డౌన్‌గ్రేడ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
- లాగిన్ సమస్యలు: ఒకవేళ మీరు మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయాలనుకుంటే, కానీ మీ ఇమెయిల్ లేదా పాస్‌వర్డ్ గుర్తులేకుంటే, మీరు మీ Shopify లాగిన్ వివరాలను రికవర్ చేయవచ్చు.
- రెండు-దశల ప్రామాణీకరణ సమస్యలు: మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడానికి, మీరు లాగిన్ అయి అవసరమైన ఏదైనా రెండు-దశల ప్రామాణీకరణ ఛాలెంజ్‌ను పూర్తి చేయాలి. ఒకవేళ మీరు మీ సాధారణ రెండు-దశల ప్రామాణీకరణ పద్ధతిని యాక్సెస్ చేయలేకపోతే, స్టోర్ డీయాక్టివేషన్ సమయంలో రెండు-దశల ప్రామాణీకరణ సమస్యలను ట్రబుల్షూట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
- సేవా నిబంధనల రివ్యూ: మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడానికి ముందు, మీరు సేవా నిబంధనలను రివ్యూ చేసి, అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి.
- సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల కోసం Shopify రీఫండ్ విధానం: Shopify సేవా నిబంధనలలోని 5.10 విభాగంలో పేర్కొన్న విధంగా Shopify తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల కోసం కచ్చితమైన నో-రీఫండ్ విధానాన్ని కొనసాగిస్తుంది. ప్లాన్ రద్దులు, అలాగే సబ్‌స్క్రిప్షన్ డీయాక్టివేషన్లతో సహా వివిధ పరిస్థితులలో ఇది విశ్వవ్యాప్తంగా వర్తిస్తుంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల కోసం Shopify రీఫండ్ విధానం గురించి మరింత తెలుసుకోండి.
- Thank you, ఆర్డర్ స్టేటస్ పేజీలు: మీరు మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేసినప్పుడు మీ పేజీలు ఆటోమేటిక్‌గా కొత్త వెర్షన్‌లకు అప్‌గ్రేడ్ అవుతాయి. దీని ద్వారా కస్టమర్‌లు ఇప్పటికీ తమ ఆర్డర్ వివరాలను వీక్షించగలరని నిర్ధారించబడుతుంది. మీ Thank you, ఆర్డర్ స్టేటస్ పేజీలను అప్‌గ్రేడ్ చేయడం, భర్తీ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
స్టోర్ సమాచారం, ఆస్తులను అట్టిపెట్టుకోవడం
మీ ప్లాన్‌ను రద్దు చేసిన తర్వాత మీ ప్రస్తుత బిల్లింగ్ సైకిల్ ముగిసేలోపు, అలాగే మీ స్టోర్ డీయాక్టివేట్ అయ్యేలోపు, మీరు ఏ స్టోర్ సమాచారాన్ని, ఆస్తులను అట్టిపెట్టుకోవాలనుకుంటున్నారో పరిగణించండి:
- ప్రత్యేకమైన డొమైన్‌లు: మీరు అదే
myshopify.comడొమైన్‌ను ఉపయోగించి కొత్త స్టోర్‌ను సృష్టించలేరు.- అదే పేరుతో బ్రాండ్ చేయబడిన కొత్త స్టోర్‌ను మీరు సృష్టించవచ్చు, కానీ మీ
myshopify.comడొమైన్ మాత్రం ప్రతి స్టోర్‌కు ప్రత్యేకంగా ఉంటుంది. - ఉదాహరణకు, మీరు
Very Good Thingsఅని పేరు పెట్టిన, అలాగేvery-good-things.myshopify.comURL ఉన్న స్టోర్‌ను డీయాక్టివేట్ చేస్తారు అనుకుందాం. మీరు కొత్త స్టోర్‌ను సృష్టించాలని నిర్ణయించుకుంటే, మీరు దానికిVery Good Thingsఅని పేరు పెట్టవచ్చు, కానీvery-good-things.myshopify.comURLను మాత్రం ఉపయోగించలేరు.
- అదే పేరుతో బ్రాండ్ చేయబడిన కొత్త స్టోర్‌ను మీరు సృష్టించవచ్చు, కానీ మీ
- స్టోర్ డేటాను ఎగుమతి చేయండి: మీ స్టోర్ సమాచారాన్ని సేవ్ చేయడానికి CSV ఫైల్‌లను ఎగుమతి చేయండి.
- థీమ్ బ్యాకప్‌లు: మీరు ఒకవేళ థీమ్‌ను కొనుగోలు చేసినట్లయితే, మీ థీమ్ బ్యాకప్‌ను డౌన్‌లోడ్ చేయడం గురించి ఆలోచించండి. థీమ్‌ల లైసెన్స్‌లు, వాస్తవానికి మీరు ఏ స్టోర్ కోసం అయితే థీమ్‌ను కొనుగోలు చేస్తారో ఆ స్టోర్‌కు మాత్రమే వర్తిస్తాయి. మీరు స్వంతంగా కలిగి ఉన్న మరో Shopify స్టోర్‌కు లైసెన్స్‌ను బదిలీ చేయడానికి మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించవచ్చు.
ఆర్థిక బాధ్యతలు
మీ ఆర్థిక బాధ్యతలు ఎలా పరిష్కరించబడతాయో పరిగణించండి:
- సబ్‌స్క్రిప్షన్ రద్దు: మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడం ద్వారా, మీ ప్రస్తుత బిల్లింగ్ సైకిల్ చివరిలో మీ వద్ద ఉన్న Shopify సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. మీరు Shopify Plus ప్లాన్‌లో ఉంటే, సహాయం కోసం మీ కస్టమర్ సక్సెస్ మేనేజర్‌ను (CSM) సంప్రదించండి. మీకు CSM లేకపోతే, అప్పుడు Shopify Plus మద్దతును సంప్రదించండి.
- డీయాక్టివేషన్ తర్వాత ఇన్‌వాయిస్‌లు: థర్డ్-పార్టీ ఛార్జీలు, ఛార్జ్‌బ్యాక్‌లు లేదా మీరు స్వంతంగా కలిగి ఉన్న ఇతర Shopify స్టోర్‌ల కోసం డీయాక్టివేషన్ తర్వాత కూడా మీరు ఇన్‌వాయిస్‌లను స్వీకరించవచ్చు.
- పెండింగ్ చెల్లింపులు: మీ స్టోర్ డీయాక్టివేట్ చేయబడిన తర్వాత, Shopify Payments నుండి ఏవైనా పెండింగ్ చెల్లింపులు ఉంటే అవి ప్రాసెస్ చేయబడటం కొనసాగుతుంది, కానీ ఏవైనా సంభావ్య సమస్యలను పరిష్కరించడానికి మీకు మీ Shopify అడ్మిన్‌కు యాక్సెస్ ఉండదు.
- ఛార్జ్‌బ్యాక్‌లు: మీ Shopify స్టోర్‌ను డీయాక్టివేట్ చేసిన తర్వాత కూడా, మునుపటి లావాదేవీలపై ఛార్జ్‌బ్యాక్‌లు ఫైల్ చేయబడవచ్చు. వీటిపై అభ్యంతరం తెలపడానికి మీరు మీ స్టోర్‌ను మళ్లీ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది.
- బకాయి బ్యాలెన్స్‌లు: మీరు మీ ప్లాన్‌ను రద్దు చేసినప్పుడు, యాప్‌లన్నీ ఆటోమేటిక్‌గా అన్‌ఇన్‌స్టాల్ చేయబడతాయి మరియు మీ ఖాతాలో పెండింగ్‌లో ఉన్న ఛార్జీలన్నీ వసూలు చేయబడతాయి. ఈ పెండింగ్ ఛార్జీలలో ఏవైనా బకాయి ఉన్న యాప్ వినియోగ ఛార్జీలు, లావాదేవీ రుసుములు మరియు షిప్పింగ్ లేబుల్ ఛార్జీలు కలిసి ఉంటాయి. మీ బిల్లింగ్ సైకిల్ ముగిసేలోపు మరియు మీ స్టోర్ మూసివేయబడటానికి ముందు, మీ స్టోర్ కార్యకలాపాల ఆధారంగా మీకు అదనపు రుసుములు మరియు ఛార్జీలు పడవచ్చు.
- థర్డ్-పార్టీ యాప్‌లు: మీరు మీ స్టోర్‌ను రద్దు చేసినప్పుడు అన్ని యాప్‌లు ఆటోమేటిక్‌గా అన్‌ఇన్‌స్టాల్ చేయబడతాయి. రద్దు చేసిన సమయంలో, బకాయి ఉన్న యాప్ వినియోగ ఛార్జీలు ఏవైనా ఉంటే అవి ఆటోమేటిక్‌గా విధించబడతాయి. మీ స్టోర్ మూసివేసిన తర్వాత మీకు యాప్ ఛార్జీలు విధించబడకుండా ఉండటానికి, Shopify బిల్లింగ్‌కు వెలుపల ఛార్జ్ చేసే యాప్‌లు ఏవైనా ఉంటే రివ్యూ చేయండి.
- ఆర్థిక ఉత్పత్తులు: డీయాక్టివేషన్ సమయంలో Shopify ఆర్థిక ఉత్పత్తులకు యాక్సెస్ పరిమితం చేయబడవచ్చు లేదా కోల్పోవచ్చు. ఉదాహరణకు, మీ స్టోర్ డీయాక్టివేట్ చేయబడి ఉన్నప్పుడు మీ Shopify Credit కార్డ్‌లు లాక్ చేయబడతాయి.
- డేటా తొలగింపు: ఒకవేళ మీరు మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయాలని ఎంచుకుంటే, మీరు మీ స్టోర్‌ను మళ్లీ తెరవాలని నిర్ణయించుకునే పక్షంలో, మీ స్టోర్ సమాచారానికి 2 సంవత్సరాల వరకు హామీ ఇవ్వబడుతుంది. అయితే, ఆ సమయానికి ముందే మీ డీయాక్టివేట్ చేయబడిన స్టోర్ నుండి మీ కస్టమర్‌ల వ్యక్తిగత డేటాను తొలగించమని మీరు అభ్యర్థించవచ్చు.
మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేసినప్పుడు కలిగే బిల్లింగ్ పర్యవసానాల గురించిన వివరణాత్మక ఓవర్‌వ్యూ కోసం, పాజ్ చేసిన లేదా డీయాక్టివేట్ చేసిన స్టోర్‌ల బిల్లింగ్ పర్యవసానాలను అర్థం చేసుకోవడంని చూడండి.
కస్టమర్ ఆర్డర్ ప్రభావం
నెరవేర్చని ఆర్డర్‌లు ఉన్న మీ ప్రస్తుత కస్టమర్‌లు ఎలా ప్రభావితమవుతారో పరిగణించండి:
- గిఫ్ట్ కార్డ్‌లు: మీరు గిఫ్ట్ కార్డ్‌లను విక్రయిస్తున్నట్లయితే, మీరు బకాయి ఉన్న కార్డ్‌లను పరిష్కరించాల్సి రావచ్చు. బకాయి ఉన్న కార్డ్‌లను పరిష్కరించడానికి మీకు అవసరమైన సమాచారాన్ని కలిగి ఉన్న మీ స్టోర్ గిఫ్ట్ కార్డ్ CSV ఫైల్‌ను మీరు ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు.
- పెండింగ్ ఆర్డర్‌లు: మీరు వేర్వేరు కొనుగోలు ఎంపికలతో (సబ్‌స్క్రిప్షన్‌లు లేదా ప్రీ-ఆర్డర్‌ల లాంటివి) ఉత్పత్తులను విక్రయిస్తే, మీరు పెండింగ్ ఆర్డర్‌లను పరిష్కరించాల్సి ఉంటుంది. రీఫండ్‌లను ఇష్యూ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
- ఆర్డర్ ట్రాకింగ్ యాక్సెస్: మీరు మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేసిన తర్వాత కూడా కస్టమర్‌లు అప్‌గ్రేడ్ చేయబడిన థాంక్యూ, ఆర్డర్ స్టేటస్ పేజీలలో తమ ఆర్డర్ వివరాలను యాక్సెస్ చేయడం కొనసాగించవచ్చు. మీ థాంక్యూ, ఆర్డర్ స్టేటస్ పేజీలను అప్‌గ్రేడ్ చేయడం మరియు భర్తీ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
- ఛార్జ్‌బ్యాక్‌లు: స్టోర్ డీయాక్టివేట్ చేయబడినప్పటికీ కార్డుదారు ఇప్పటికీ ఛార్జ్‌బ్యాక్‌లను జారీ చేయగలరు. స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడం అంటే, ఛార్జ్‌బ్యాక్ జరిగిన సందర్భంలో మీరు Shopify అడ్మిన్ ద్వారా అదనపు ఆధారాలను సమర్పించలేరని అర్థం.
కస్టమ్ డొమైన్ పరిగణనలు
మీ కస్టమ్ డొమైన్ ఎలా ప్రభావితమవుతుందో పరిగణించండి:
- డొమైన్ డిస్‌కనెక్ట్: మీ స్టోర్ డీయాక్టివేట్ అయినప్పుడు లేదా స్తంభింపజేసినప్పుడు, మీ కస్టమ్ డొమైన్‌లు మీ స్టోర్ నుండి డిస్‌కనెక్ట్ చేయబడతాయి. ఒకవేళ మీరు మీ స్టోర్‌ను మళ్లీ యాక్టివేట్ చేసినట్లయితే, మీరు మీ డొమైన్‌లను మళ్లీ కనెక్ట్ చేయాలి.
- Shopify ద్వారా కొనుగోలు చేసిన డొమైన్‌ల బదిలీ: ఒకవేళ మీకు Shopify ద్వారా కొనుగోలు చేసిన కస్టమ్ డొమైన్ ఉంటే, మీరు దానిని థర్డ్-పార్టీ డొమైన్ ప్రొవైడర్‌కు బదిలీ చేయవచ్చు.
- థర్డ్-పార్టీ ద్వారా కొనుగోలు చేసిన డొమైన్‌ల బదిలీ: మీకు థర్డ్-పార్టీ ద్వారా కొనుగోలు చేసిన కస్టమ్ డొమైన్ ఉంటే, మీ Shopify అడ్మిన్‌ను ఉపయోగించి మీ స్టోర్ నుండి దాన్ని తీసివేయవచ్చు. మీరు మీ థర్డ్-పార్టీ ప్రొవైడర్ ద్వారా మీ డొమైన్ DNS రికార్డ్‌లను మేనేజ్ చేస్తారు కాబట్టి, మీరు మీ డొమైన్‌ను ఎప్పుడైనా మరొక ప్లాట్‌ఫారమ్‌కు పాయింట్ చేయవచ్చు. భవిష్యత్తులో మీరు మీ డొమైన్‌ను మరొక Shopify స్టోర్‌తో ఉపయోగించాలనుకుంటే, కొత్త స్టోర్‌కి దాన్ని కనెక్ట్ చేసేటప్పుడు మీరు డొమైన్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
- డొమైన్ పునరుద్ధరణ: మీ స్టోర్‌ను రద్దు చేసినప్పుడు మీ డొమైన్ పునరుద్ధరణలు రద్దు కావు. ఒకవేళ మీ స్టోర్ మూసివేత తేదీకి ముందే మీ డొమైన్‌ను పునరుద్ధరించడానికి షెడ్యూల్ చేయబడితే, మీకు ఇప్పటికీ పునరుద్ధరణ రుసుము విధించబడవచ్చు.
- ఒకవేళ మీకు Shopify-మేనేజ్ చేసే డొమైన్ ఉంటే, ఊహించని ఛార్జీలను నివారించడానికి మీరు మీ Shopify డొమైన్ పునరుద్ధరణ సెట్టింగ్‌లను మేనేజ్ చేయవచ్చు.
- ఒకవేళ మీకు థర్డ్-పార్టీ డొమైన్ ఉంటే, ఊహించని ఛార్జీలను నివారించడానికి మీ రిజిస్ట్రార్ వెబ్‌సైట్‌లో మీ కస్టమ్ డొమైన్ కోసం స్వయంచాలక పునరుద్ధరణను తప్పనిసరిగా డీయాక్టివేట్ చేయండి.
- HTTP స్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్ సెక్యూరిటీ (HSTS) పాలసీ: మీరు మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేసి, మీ డొమైన్‌ను కొత్త ప్లాట్‌ఫారమ్‌కు బదిలీ చేయాలని ప్లాన్ చేస్తుంటే, Shopify యొక్క HTTP స్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్ సెక్యూరిటీ (HSTS) పాలసీ అనేది మీరు మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేసిన తర్వాత 90 రోజుల పాటు మీ డొమైన్‌పై అమల్లో ఉంటుందని గమనించండి. మీ వ్యాపారం మరియు మీ కస్టమర్‌ల గురించిన సమాచారం భద్రంగా ఉండేలా చూడటంలో ఈ పాలసీ సహాయపడుతుంది.
- HTTPSని ఉపయోగించే మరొక ప్లాట్‌ఫారమ్‌కు మీరు మీ డొమైన్‌ను బదిలీ చేస్తే, మీరు అదనపు చర్యలేవీ తీసుకోవాల్సిన అవసరం లేదు.
- ఒకవేళ మీరు మీ డొమైన్‌ను HTTPSని ఉపయోగించని ప్లాట్‌ఫారమ్‌కు బదిలీ చేస్తే, ఆ తర్వాతి 90 రోజుల పాటు, ఎవరైనా మీ డొమైన్‌ను సందర్శించడానికి ప్రయత్నించినప్పుడు బ్రౌజర్‌లో ఎర్రర్ మెసేజ్ ప్రదర్శించబడుతుంది. ఈ సైట్ నమ్మదగినది కాదని లేదా సర్టిఫికెట్ చెల్లదని ఎర్రర్ మెసేజ్ సూచించవచ్చు. 90 రోజుల గడువు ముగిసే వరకు వేచి ఉండండి లేదా HTTPSకు సపోర్ట్ చేసే ప్లాట్‌ఫారమ్‌కు మీ డొమైన్‌ను బదిలీ చేయడాన్ని పరిగణించండి.
ఉచిత ట్రయల్ లేదా ప్రమోషనల్ ధర వ్యవధిలో మీ Shopify స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడం
మీరు మీ Shopify స్టోర్‌ను ఎప్పుడైనా డీయాక్టివేట్ చేయవచ్చు. డీయాక్టివేట్ చేసిన తర్వాత, మీ ప్రస్తుత బిల్లింగ్ సైకిల్ చివరిలో మీ Shopify సబ్‌స్క్రిప్షన్ నిలిపివేయబడుతుంది, దీని వల్ల మీరు మీ Shopify అడ్మిన్ యాక్సెస్‌ను కోల్పోతారు. ఉచిత ట్రయల్ ముగియక ముందే మీరు చెల్లింపు ప్లాన్‌ను ఎంచుకున్నట్లయితే, మీ అకౌంట్‌ను రద్దు చేయడానికి మరియు మీరు ఎంచుకున్న ప్లాన్ రుసుము విధించబడకుండా నిరోధించడానికి మీరు మీ స్టోర్‌ను మాన్యువల్‌గా పాజ్ లేదా డీయాక్టివేట్ చేయాలి.
మీరు చెల్లింపు ప్లాన్‌ను ఎంచుకోకుండా, ఉచిత ట్రయల్ వ్యవధి ముగిసేలోపు మీ Shopify ఖాతాను నిలిపివేయాలని ఎంచుకుంటే, ఎలాంటి అదనపు చర్యలు అవసరం లేదు.
మీరు ఎంచుకున్న ప్లాన్ కోసం ప్రమోషనల్ ధరల వ్యవధిలో మీ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసినట్లయితే, ఈ వ్యవధిలో విధించిన ఎలాంటి ఛార్జీలకైనా మీరు రీఫండ్‌కు అర్హులు కారు. రద్దు చేసిన తర్వాత మీ ఖాతాలో బకాయి ఉన్న బ్యాలెన్స్ ఏదైనా ఛార్జ్ చేయబడుతుంది.
మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి, మీ Shopify స్టోర్‌ను డీయాక్టివేట్ చేయండి
మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడానికి ముందు, పునరుద్ధరణ రుసుములను నివారించడానికి మీకు ఉన్న Shopify-మేనేజ్ చేసే డొమైన్‌లను రివ్యూ చేసి, అవసరమైతే డొమైన్‌ను బదిలీ చేయండి. మీరు మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేసిన తర్వాత, మీ స్టోర్ మూసివేసే నాటికి మీ బిల్లింగ్ సైకిల్ ముగింపుకు చేరుకోకముందే మీ డొమైన్ పునరుద్ధరించబడితే, మీకు పునరుద్ధరణకు ఛార్జీ విధించబడవచ్చు.
మీరు మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేసినప్పుడు, యాప్‌లన్నీ ఆటోమేటిక్‌గా అన్‌ఇన్‌స్టాల్ చేయబడతాయి మరియు మీ ఖాతాలోని పెండింగ్ ఛార్జీలు విధించబడతాయి. ఈ పెండింగ్ ఛార్జీలలో ఏవైనా బకాయి ఉన్న యాప్ వినియోగ ఛార్జీలు, లావాదేవీ రుసుములు మరియు షిప్పింగ్ లేబుల్ ఛార్జీలు కలిసి ఉంటాయి. మీ బిల్లింగ్ సైకిల్ ముగిసేలోపు మరియు మీ స్టోర్ మూసివేయబడటానికి ముందు, మీ స్టోర్ కార్యకలాపాల ఆధారంగా మీకు అదనపు రుసుములు మరియు ఛార్జీలు పడవచ్చు. మీ స్టోర్ మూసివేసిన తర్వాత యాప్‌కు ఛార్జీలు విధించబడకుండా చూసుకోవడానికి, Shopify బిల్లింగ్ వెలుపల ఛార్జ్ చేయబడే యాప్‌లను రివ్యూ చేయండి.
మీరు మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేసి, మీ బిల్లింగ్ సైకిల్ ముగింపుకు చేరుకున్నప్పుడు, మీ థాంక్యూ మరియు ఆర్డర్ స్టేటస్ పేజీలు ఆటోమేటిక్‌గా కొత్త వెర్షన్‌లకు అప్‌గ్రేడ్ అవుతాయి, తద్వారా కస్టమర్‌లు తమ ఆర్డర్ వివరాలను చూడటం కొనసాగించవచ్చు. మీ థాంక్యూ మరియు ఆర్డర్ స్టేటస్ పేజీలను అప్‌గ్రేడ్ చేయడం, భర్తీ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > ప్లాన్కు వెళ్లండి.
మీ ప్లాన్ ఆధారంగా కింది వాటిలో ఒకదాన్ని క్లిక్ చేయండి:
- ఒకవేళ మీ స్టోర్ ఉచిత ట్రయల్ వ్యవధిలో ఉన్నట్లయితే, ట్రయల్ రద్దు చేయండిని క్లిక్ చేయండి.
- ఒకవేళ మీ స్టోర్ చెల్లింపు ప్లాన్‌లో ఉన్నట్లయితే, ప్లాన్‌ను రద్దు చేయండిని క్లిక్ చేయండి.
వర్తిస్తే, మీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను డౌన్‌గ్రేడ్ చేయడానికి లేదా కొత్త స్టోర్‌ను ప్రారంభించడానికి ఉన్న ఆప్షన్‌లను రివ్యూ చేయండి.
రెన్యూవల్ ఫీజులను నివారించడానికి మీకు ఉన్న Shopify డొమైన్‌లను రివ్యూ చేసి, అవసరమైతే డొమైన్‌ను బదిలీ చేయండి మరియు పెండింగ్ ఛార్జీలను రివ్యూ చేయండి. మీరు ఇంకా డీయాక్టివేట్ చేయాలనుకుంటే, అప్పుడు నా ప్లాన్‌ను రద్దు చేసి, అన్ని యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండిని ఎంచుకుని, ఆపై కొనసాగించండిని క్లిక్ చేయండి. రద్దు చేసిన తర్వాత యాప్‌లన్నీ ఆటోమేటిక్‌గా అన్‌ఇన్‌స్టాల్ చేయబడతాయి, అలాగే మీ పెండింగ్ ఛార్జీలు వసూలు చేయబడతాయి.
డీయాక్టివేషన్ కోసం ఒక కారణాన్ని ఎంచుకోండి.
ఆప్షనల్: మరింతగా వివరించడానికి వీలైతే, ఒక కామెంట్‌ను జోడించండి.
కొనసాగించండిని క్లిక్ చేయండి.
ఆప్షనల్: మీరు మీ స్టోర్‌ను వేగంగా తిరిగి తెరవడానికి చెల్లింపు వివరాలను సేవ్ చేయండిని ఎంచుకోవచ్చు.
మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, ఆపై మీ ప్లాన్ ఆధారంగా కింది వాటిలో ఒకదానిపై క్లిక్ చేయండి:
- ఒకవేళ మీ స్టోర్ ఉచిత ట్రయల్ వ్యవధిలో ఉన్నట్లయితే, ట్రయల్ రద్దు చేయండిని క్లిక్ చేయండి.
- ఒకవేళ మీ స్టోర్ చెల్లింపు ప్లాన్‌లో ఉన్నట్లయితే, ప్లాన్‌ను రద్దు చేయండిని క్లిక్ చేయండి.
మొబైల్
- స్టోర్ యజమానిగా Shopify యాప్కి లాగిన్ చేయండి.
లేదా
ను ట్యాప్ చేసి, ఆపై సెట్టింగ్‌లును ట్యాప్ చేయండి.
- ప్లాన్‌ను ట్యాప్ చేయండి.
- మీ ప్లాన్ ఆధారంగా కింది వాటిలో ఒకదానిపై ట్యాప్ చేయండి:
- మీ స్టోర్ ఉచిత ట్రయల్ వ్యవధిలో ఉన్నట్లయితే, అప్పుడు ట్రయల్ రద్దు చేయండిని ట్యాప్ చేయండి.
- మీ స్టోర్ పెయిడ్ ప్లాన్‌లో ఉంటే, అప్పుడు ప్లాన్‌ను రద్దు చేయండిని ట్యాప్ చేయండి.
- వర్తిస్తే, మీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను డౌన్‌గ్రేడ్ చేయడానికి లేదా కొత్త స్టోర్‌ను ప్రారంభించడానికి ఉన్న ఆప్షన్‌లను రివ్యూ చేయండి.
- రెన్యూవల్ ఫీజులను నివారించడానికి మీకు ఉన్న Shopify డొమైన్‌లను రివ్యూ చేసి, అవసరమైతే డొమైన్‌ను బదిలీ చేయండి మరియు పెండింగ్ ఛార్జీలను రివ్యూ చేయండి. మీరు ఇంకా డీయాక్టివేట్ చేయాలనుకుంటే, అప్పుడు నా ప్లాన్‌ను రద్దు చేసి, అన్ని యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండిని ఎంచుకుని, ఆపై కొనసాగించండిని ట్యాప్ చేయండి. రద్దు చేసిన తర్వాత యాప్‌లన్నీ ఆటోమేటిక్‌గా అన్‌ఇన్‌స్టాల్ చేయబడతాయి, అలాగే మీ పెండింగ్ ఛార్జీలు వసూలు చేయబడతాయి.
- డీయాక్టివేషన్ కోసం ఒక కారణాన్ని ఎంచుకోండి.
- ఆప్షనల్: మరింతగా వివరించడానికి వీలైతే, ఒక కామెంట్‌ను జోడించండి.
- కొనసాగించండిని ట్యాప్ చేయండి.
- ఆప్షనల్: మీరు మీ స్టోర్‌ను వేగంగా తిరిగి తెరవడానికి చెల్లింపు వివరాలను సేవ్ చేయండిని ఎంచుకోవచ్చు.
- మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, ఆపై మీ ప్లాన్ ఆధారంగా కింది వాటిలో ఒకదానిపై ట్యాప్ చేయండి:
- మీ స్టోర్ ఉచిత ట్రయల్ వ్యవధిలో ఉన్నట్లయితే, అప్పుడు ట్రయల్ రద్దు చేయండిని ట్యాప్ చేయండి.
- మీ స్టోర్ పెయిడ్ ప్లాన్‌లో ఉంటే, అప్పుడు ప్లాన్‌ను రద్దు చేయండిని ట్యాప్ చేయండి.
మీ స్టోర్ డీయాక్టివేట్ చేయబడిందని నిర్ధారిస్తూ మీరు ఒక ఇమెయిల్ అందుకుంటారు. మీరు ఇప్పటికీ మీ స్టోర్‌ను మళ్లీ తెరవవచ్చు లేదా మీ గత బిల్లులను వీక్షించవచ్చు. మీ స్టోర్ సమాచారం 2 సంవత్సరాల పాటు గ్యారంటీగా ఉంచబడుతుంది. మీరు 2 సంవత్సరాలలోపు మీ స్టోర్‌ను రీయాక్టివేట్ చేయాలనుకుంటే, దాన్ని మీరు మళ్లీ బిల్డ్ చేయకుండానే స్టోర్‌ను తిరిగి తెరవవచ్చు.
స్టోర్ డీయాక్టివేషన్ సమయంలో రెండు-దశల ప్రామాణీకరణ సమస్యలను ట్రబుల్షూటింగ్ చేయడం
Shopify స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడానికి, మీరు స్టోర్ యజమానిగా మీ Shopify అడ్మిన్‌కి లాగిన్ అయి, అవసరమైన ఏవైనా రెండు-దశల ప్రామాణీకరణ ఛాలెంజ్‌లను పూర్తి చేయాలి. మీరు మీ ప్రస్తుత రెండు-దశల ప్రామాణీకరణ కోడ్‌ను రూపొందించలేకపోతే లేదా అందుకోలేకపోతే, లాగిన్ అయి డీయాక్టివేషన్‌ను కొనసాగించడానికి కింది ఆప్షన్‌లను ప్రయత్నించండి.
ఈ పరిస్థితి కింది సందర్భాలలో ఎదురుకావచ్చు:
- మీరు మీ అకౌంట్‌తో అసోసియేట్ చేయబడిన ఫోన్ నంబర్‌ను యాక్సెస్ చేయలేరు.
- మీరు మీ అథెంటికేటర్ యాప్ లేదా పరికరానికి యాక్సెస్‌ను కోల్పోయారు.
- మీ భద్రతా కీ లేదా ఇన్‌బిల్ట్ అథెంటికేటర్ అందుబాటులో లేదు.
దశలు:
- మీరు బ్యాకప్ ప్రామాణీకరణ పద్ధతిని సెటప్ చేసినట్లయితే, ఆ పద్ధతిని ఉపయోగించి లాగిన్ చేయండి.
- ఒకవేళ బ్యాకప్ ప్రామాణీకరణ పద్ధతి అందుబాటులో లేకపోతే, అప్పుడు మీరు సేవ్ చేసిన రికవరీ కోడ్‌లలో ఒకదానిని ఉపయోగించి లాగిన్ చేయండి.
- ఒకవేళ మీకు బ్యాకప్ ప్రామాణీకరణ పద్ధతి లేదా సేవ్ చేసిన రికవరీ కోడ్‌లు ఏవీ లేనట్లయితే, అప్పుడు మీకు ఎలాంటి ప్రామాణీకరణ పద్ధతికి యాక్సెస్ లేనప్పుడు రెండు-దశల ప్రామాణీకరణను డీయాక్టివేట్ చేయడానికి దశలను అనుసరించండి.
- మీ అకౌంట్‌కి తిరిగి యాక్సెస్ పొందిన తర్వాత, మీ Shopify అడ్మిన్‌కి స్టోర్ యజమానిగా లాగిన్ చేయండి మరియు మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడానికి మరియు మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడానికి ఉన్న దశలను పూర్తి చేయండి.
మీ ప్లాన్‌ను రీయాక్టివేట్ చేయండి
మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసినప్పటికీ, మీ ప్రస్తుత బిల్లింగ్ సైకిల్ గడువు ఇంకా ముగియకపోతే, మీ స్టోర్ డీయాక్టివేట్ కావడానికి ముందే మీరు మీ ప్లాన్‌ను రీయాక్టివేట్ చేయవచ్చు.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > ప్లాన్కు వెళ్లండి.
ప్లాన్ రీయాక్టివేట్ చేయండిని క్లిక్ చేయండి.
మొబైల్
- స్టోర్ యజమానిగా Shopify యాప్కి లాగిన్ చేయండి.
లేదా
ను ట్యాప్ చేసి, ఆపై సెట్టింగ్‌లును ట్యాప్ చేయండి.
- ప్లాన్‌ను ట్యాప్ చేయండి.
- ప్లాన్ రీయాక్టివేట్ చేయండిని ట్యాప్ చేయండి.
మీ డేటాను తొలగించండి
ఒకవేళ మీరు మీ స్టోర్‌ను తిరిగి తెరవాలని నిర్ణయించుకుంటే, మీ స్టోర్ సమాచారం 2 సంవత్సరాల పాటు గ్యారంటీగా ఉంచబడుతుంది. అయితే, ఆ వ్యవధి ముగియకముందే మీ స్టోర్ కస్టమర్‌ల వ్యక్తిగత సమాచారం తొలగించబడాలని మీరు అభ్యర్థించవచ్చు.
మీ డేటాను తొలగించడం గురించి మరింత తెలుసుకోండి.
మీ స్టోర్‌ను రీయాక్టివేట్ చేయండి
మీరు మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేసిన తర్వాత 2 సంవత్సరాల వరకు దాన్ని రీయాక్టివేట్ చేయవచ్చు. ఒకవేళ మీ స్టోర్ డేటా తొలగించబడితే, అప్పుడు మీ స్టోర్‌ను రీయాక్టివేట్ చేయడం సాధ్యపడదు.
మీ Shopify స్టోర్ ఫ్రీజ్ చేయబడినా లేదా పాజ్ చేయబడినా, మీరు మీ Shopify స్టోర్‌ను రీయాక్టివేట్ చేయడానికి ముందు ఏవైనా బిల్లింగ్ లేదా చెల్లింపు సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాలి.
మీకు మీ స్టోర్ .myshopify.com URL తెలియకపోతే లేదా లాగిన్ అయిన తర్వాత మీ స్టోర్‌ను కనుగొనలేకపోతే, రీయాక్టివేట్ చేయడానికి ముందు మీ స్టోర్‌ను కనుగొనేందుకు స్టోర్ మర్చిపోయారా? టూల్‌ని ఉపయోగించండి. దశలవారీ మార్గదర్శకత్వం కోసం, మర్చిపోయిన ఇమెయిల్ లేదా స్టోర్ URL సమస్యల ట్రబుల్షూటింగ్ని చూడండి.
దశలు:
- స్టోర్ యజమానిగా మీ స్టోర్‌కి లాగిన్ చేయండి.
<shop-name>.myshopify.comను తిరిగి తెరవండిని క్లిక్ చేయండి.- అందుబాటులో ఉన్న ప్లాన్‌లను రివ్యూ చేసి, ఆపై ప్లాన్ పేజీ నుండి ఒక ప్లాన్‌ను ఎంచుకోండి.
- రివ్యూ చేయండి మరియు సబ్‌స్క్రయిబ్ చేయండి విభాగంలో మీ చెల్లింపు సమాచారాన్ని ఎంటర్ చేయండి.
- మీ స్టోర్‌ను రీయాక్టివేట్ చేయడానికి సబ్‌స్క్రయిబ్ చేయండిని క్లిక్ చేయండి.
రీయాక్టివేషన్ తర్వాత డొమైన్‌లను మళ్లీ కనెక్ట్ చేయండి
మీ స్టోర్ డీయాక్టివేట్ చేయబడినప్పుడు లేదా ఫ్రీజ్ చేయబడినప్పుడు, మీ కస్టమ్ డొమైన్‌లు డిస్‌కనెక్ట్ చేయబడతాయి. మీరు మీ స్టోర్‌ను రీయాక్టివేట్ చేసిన తర్వాత, మీ డొమైన్‌లను మీరు మళ్లీ కనెక్ట్ చేయాలి.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > డొమైన్‌లుకి వెళ్లండి.
ఇప్పటికే ఉన్న డొమైన్‌ను కనెక్ట్ చేయండిని క్లిక్ చేయండి.
మీ డొమైన్ పేరును ఎంటర్ చేయండి.
తదుపరిని క్లిక్ చేసి, ఆపై మీ డొమైన్‌ను మళ్లీ కనెక్ట్ చేయడానికి ప్రాంప్ట్‌లను అనుసరించండి.