మీ పేఅవుట్ పద్ధతిని నిర్వహించండి

భాగస్వాములు PayPal లేదా బ్యాంక్ ఖాతా ద్వారా పేఅవుట్‌లను స్వీకరించవచ్చు. నిర్దిష్ట పేఅవుట్ పద్ధతులను యాక్సెస్ చేయడం అనేది మీ దేశం లేదా ప్రాంతం మరియు మీరు పేఅవుట్‌ను మార్చాలనుకుంటున్న కరెన్సీపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, కెనడాలో, ఆఖరి పేఅవుట్ CADలో జరిగితే, మీరు PayPal మరియు బ్యాంక్ ఖాతా పేఅవుట్ పద్ధతులకు యాక్సెస్ కలిగి ఉండవచ్చు.

మీరు మీ పేఅవుట్ పద్ధతిని సంస్థ సెట్టింగ్‌లలోని పేఅవుట్‌లు పేజీలో నిర్వహిస్తారు, దాన్ని మీరు Dev Dashboard నుండి తెరవవచ్చు. పేఅవుట్ పద్ధతిని జోడించడానికి ముందు, మీ వ్యాపార వివరాలను జోడించడం ద్వారా మీరు Hyperwallet ఖాతాను సృష్టించాలి. మీరు Hyperwallet ఖాతాను సృష్టించినప్పుడు, మీరు Hyperwallet సేవా నిబంధనలు మరియు గోప్యతా విధానానికి అంగీకరిస్తున్నట్లు అవుతుంది.

Hyperwallet పేఅవుట్ పద్ధతులకు సంబంధించిన మొత్తం సమాచారం ఇమెయిల్ ద్వారా లేదా సంస్థ సెట్టింగ్‌లలో Shopify నుండి వస్తుంది. మీ Hyperwallet ఖాతా లేదా పేఅవుట్ పద్ధతిలో మార్పులు కేవలం సంస్థ సెట్టింగ్‌లలో మాత్రమే చేయండి.

రుసుములు

Shopify పేఅవుట్‌లు ఎల్లప్పుడూ USDలోనే జారీ చేయబడతాయి, అయితే, కొత్త పేఅవుట్ పద్ధతులు మీ తుది పేఅవుట్‌ను చాలా సందర్భాల్లో మీ స్థానిక కరెన్సీతో సహా, వేరొక కరెన్సీలో పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి. కరెన్సీ మార్పిడి రుసుములను చెల్లించే బాధ్యత మీదే.

USDలో పేఅవుట్‌లను పొందడం

మీరు PayPal లేదా బ్యాంక్ ఖాతా ద్వారా మీ పేఅవుట్‌లను USDలో స్వీకరించి, ఆ తర్వాత పేఅవుట్ మీ PayPal వాలెట్ లేదా ఆర్థిక సంస్థకు చేరుకున్న తర్వాత దానిని వేరే కరెన్సీకి మారిస్తే, అప్పుడు పేఅవుట్ అనేది PayPal లేదా మీ ఆర్థిక సంస్థ సెట్ చేసిన మారకపు రేట్లు మరియు కరెన్సీ మార్పిడి ఫీజులకు లోబడి ఉంటుంది.

USD కాకుండా వేరే కరెన్సీలో పేఅవుట్‌లను పొందడం

మీరు మీ ఆఖరి పేఅవుట్‌ను PayPal లేదా బ్యాంక్ ఖాతాకి USD కాకుండా వేరే కరెన్సీలో స్వీకరించాలని ఎంచుకుంటే, అది మీ PayPal వాలెట్ లేదా ఆర్థిక సంస్థకు చేరుకోవడానికి ముందే Hyperwallet ద్వారా కరెన్సీ మార్పిడి చేయబడుతుంది మరియు కింది ప్రాథమిక మారకపు రేటు మరియు కరెన్సీ మార్పిడి ఫీజులకు లోబడి ఉంటుంది:

  • బేస్ మారకపు ధర అనేది మార్పిడి రోజు లేదా అంతకు ముందు పనిదినం నాటి టోకు కరెన్సీ మార్కెట్‌లలోని ధరల ఆధారంగా ఉంటుంది లేదా చట్టం లేదా నిబంధనల ప్రకారం అవసరమైతే, సంబంధిత ప్రభుత్వ రిఫరెన్స్ ధర వద్ద సెట్ చేయబడుతుంది.
  • కరెన్సీ మార్పిడి రుసుము అనేది, పేఅవుట్ మొత్తంలో 0.50%కి సమానంగా వర్తించబడి, Hyperwallet ద్వారా అట్టిపెట్టుకోబడుతుంది. Shopify భాగస్వాములకు ప్రయోజనం చేకూర్చడం కోసం, Hyperwallet సహకారంతో Shopify ఈ ప్రాధాన్య కరెన్సీ మార్పిడి రుసుమును ఏర్పాటు చేసింది.

గుర్తింపు నిర్ధారణ

కొన్ని దేశాలు లేదా ప్రాంతాలలో, పేఅవుట్‌లను స్వీకరించడానికి మీరు మీ గుర్తింపును నిర్ధారించుకోవాల్సి రావచ్చు.

మీరు వ్యాపారంగా (పరిమిత బాధ్యత కంపెనీ, భాగస్వామ్యం లేదా కార్పొరేషన్ వలె) ఆపరేట్ చేస్తుంటే, మీరు మీ మొదటి పేఅవుట్‌ను స్వీకరించడానికి ముందు గుర్తింపు వెరిఫికేషన్ వివరాలను అందించాల్సి ఉంటుంది. మీరు ఒక వ్యక్తిగా (ఏకవ్యక్తి యాజమాన్యం లేదా ఒకే సభ్యుడు ఉండే పరిమిత బాధ్యత కంపెనీ వలె) ఆపరేట్ చేస్తుంటే, మీ సంపాదన నిర్దిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు గుర్తింపు వెరిఫికేషన్ వివరాలను అందించాల్సి రావచ్చు. గుర్తింపు వెరిఫికేషన్ అవసరమైతే Shopify మీకు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తుంది మరియు అవసరమైన సమాచారం, డాక్యుమెంటేషన్‌ను అందించమని మిమ్మల్ని నిర్దేశిస్తుంది. దాన్ని అందించడానికి, సంస్థ సెట్టింగ్‌లలోని పేఅవుట్‌లు పేజీలో, వెరిఫికేషన్‌ను అప్‌డేట్ చేయండిని క్లిక్ చేయండి.

సమ్మతి తనిఖీలు

కొన్ని దేశాలు లేదా ప్రాంతాలలో, అలాగే కొన్ని కరెన్సీల కోసం, పేఅవుట్‌ను ప్రాసెస్ చేయడానికి Hyperwalletకు, మీ బ్యాంక్‌కు లేదా ఆర్థిక సంస్థకు మరింత సమాచారం అవసరం కావచ్చు. కార్యకలాపాలు సాగిస్తున్న దేశం లేదా ప్రాంతాన్ని బట్టి, సమ్మతి తనిఖీలకు అవసరమైన పరిమితులు, ఆవశ్యకతలు భిన్నంగా ఉంటాయి. మరింత సమాచారం అవసరమైనందున పేఅవుట్ గనక హోల్డ్‌లో ఉంచబడితే, Shopify మీకు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తుంది.

పేఅవుట్ హోల్డ్‌లో ఉంది లేదా విఫలమైంది

పేఅవుట్ పద్ధతికి సంబంధించిన వివరాలు తప్పుగా ఉన్నట్లయితే, Hyperwallet పేఅవుట్‌ను హోల్డ్‌లో ఉంచుతుంది (లేదా పేఅవుట్ విఫలమైనట్లు సూచిస్తుంది). మీ పేఅవుట్ పద్ధతిని మార్చమని లేదా Shopify సపోర్ట్ని సంప్రదించమని కోరుతూ మీరు Shopify నుండి ఇమెయిల్‌ను అందుకుంటారు.

ఒకవేళ పేఅవుట్ మొత్తం ఆ పేఅవుట్ పద్ధతికి ఉన్న లావాదేవీ పరిమితిని మించిపోయినా కూడా, Hyperwallet ఆ పేఅవుట్‌ను హోల్డ్‌లో ఉంచుతుంది (లేదా పేఅవుట్ విఫలమైనట్లు సూచిస్తుంది).

సాధారణంగా, పేఅవుట్‌లకు ఈ క్రింది లావాదేవీ పరిమితులు ఉంటాయి:

  • PayPal - $1,00,000 USD వరకు
  • బ్యాంక్ ఖాతా - $5,00,000 USD వరకు

ఒకవేళ మీ పేఅవుట్ పద్ధతి పైన పేర్కొన్న సాధారణ పరిమితులను లేదా మీ దేశం లేదా ప్రాంతం, కరెన్సీకి నిర్దేశించిన నిర్దిష్ట పరిమితులను మించిపోయినట్లయితే, మీ పేఅవుట్ పద్ధతిని మార్చమని కోరుతూ మీరు Shopify నుండి ఇమెయిల్‌ను అందుకుంటారు.

మీరు సంస్థ సెట్టింగ్‌లలోని పేఅవుట్‌లు పేజీ నుండి విఫలమైన పేఅవుట్‌ను మళ్లీ ప్రయత్నించవచ్చు.

Hyperwallet ఖాతాను సృష్టించండి

Hyperwallet ఖాతాను సృష్టించడం వలన, మీ దేశం లేదా ప్రాంతం, కరెన్సీలో అందుబాటులో ఉన్న అన్ని పేఅవుట్ పద్ధతులను యాక్సెస్ చేయగలరు. మీ కంపెనీ గనక వ్యాపారం (పరిమిత బాధ్యత గల కంపెనీ, భాగస్వామ్యం లేదా కార్పొరేషన్ వంటివి) అయితే, ఖాతా సృష్టిని పూర్తి చేయడానికి మీరు వ్యాపారానికి సంబంధించిన నిర్దిష్ట సమాచారాన్ని అందించాల్సి రావచ్చు.

మీరు మీ వ్యాపార వివరాలను మొదటిసారి జోడించినప్పుడు మీ Hyperwallet ఖాతాను సృష్టించవచ్చు. మీ వ్యాపార వివరాల నిర్వహణ గురించి మరింత తెలుసుకోండి.

దశలు:

  1. Dev Dashboard నుండి, మీ సంస్థను ఎంచుకుని, ఆపై సంస్థ సెట్టింగ్‌లు తెరవండి. పేఅవుట్‌లు క్లిక్ చేయండి.

  2. పేఅవుట్‌లను సెటప్ చేయండి విభాగంలో, వ్యాపార వివరాలను జోడించండి క్లిక్ చేయండి.

  3. మీ వ్యాపార వివరాలను జోడించడానికి ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి మరియు Hyperwallet సేవా నిబంధనలను సమీక్షించండి.

ఖాతా సృష్టించబడిందని నిర్ధారిస్తూ మీరు Shopify నుండి ఇమెయిల్‌ను అందుకుంటారు. ఆపై మీరు పేఅవుట్ పద్ధతిని జోడించవచ్చు.

మీ Hyperwallet అకౌంట్‌లో మార్పులు చేయండి

మీ Hyperwallet ఖాతా మీ ప్రాథమిక వ్యాపార సంస్థ యొక్క వ్యాపార వివరాలను ఉపయోగిస్తుంది. ఆ వివరాలను మార్చడానికి, సంస్థ సెట్టింగ్‌లలోని వ్యాపార సంస్థను ఎడిట్ చేయండి. మీరు మీ వ్యాపార వివరాలను ఎడిట్ చేసిన తర్వాత కూడా మీ పేఅవుట్ పద్ధతి అలాగే ఉంటుంది.

దశలు:

  1. Dev Dashboard నుండి, మీ సంస్థను ఎంచుకుని, ఆపై సంస్థ సెట్టింగ్‌లు తెరవండి. సంస్థ క్లిక్ చేయండి.

  2. వ్యాపార సంస్థలు విభాగంలో, మీ ప్రాథమిక వ్యాపార సంస్థను క్లిక్ చేయండి. మీరు సంస్థ వ్యాపార వివరాలు కార్డ్‌పై మరిన్ని చర్యలు > సంస్థను ఎడిట్ చేయండి కూడా క్లిక్ చేయవచ్చు.

  3. మీ వ్యాపార వివరాలను అప్‌డేట్ చేసి, Hyperwallet సేవా నిబంధనలు మరియు గోప్యతా విధానాన్ని సమీక్షించి, ఆపై మీ మార్పులను సేవ్ చేయండి.

మీ Hyperwallet ఖాతాలో మార్పులను నిర్ధారిస్తూ మీరు Shopify నుండి ఇమెయిల్‌ను అందుకుంటారు.

మీ ప్రస్తుత పేఅవుట్ పద్ధతిని చూడండి

దాని అకౌంట్, కరెన్సీ మరియు పేఅవుట్ చేరుకోవడానికి ఎన్ని పని దినాలు పడుతుంది అనే వివరాలతో సహా, మీ ప్రస్తుత పేఅవుట్ పద్ధతి సంస్థ సెట్టింగ్‌లలోని పేఅవుట్‌లు పేజీలో ఉన్న తదుపరి పేఅవుట్ విభాగంలో లిస్ట్ చేయబడింది.

దశలు:

  1. Dev Dashboard నుండి, మీ సంస్థను ఎంచుకుని, ఆపై సంస్థ సెట్టింగ్‌లు తెరవండి. పేఅవుట్‌లు క్లిక్ చేయండి.

  2. తదుపరి పేఅవుట్ విభాగంలో, మీ ప్రస్తుత పేఅవుట్ పద్ధతి వివరాలను రివ్యూ చేయండి.

ప్రాంతం మరియు కరెన్సీ ఆధారంగా అందుబాటులో ఉన్న పేఅవుట్ పద్ధతులను చూడండి

మీరు ఎంచుకునే దేశం లేదా ప్రాంతం మరియు కరెన్సీని బట్టి అందుబాటులో ఉన్న పేఅవుట్ పద్ధతులు మారుతూ ఉంటాయి.

దశలు:

  1. Dev Dashboard నుండి, మీ సంస్థను ఎంచుకుని, ఆపై సంస్థ సెట్టింగ్‌లు తెరవండి. పేఅవుట్‌లు క్లిక్ చేయండి.

  2. పేఅవుట్ పద్ధతిని జోడించండి లేదా పేఅవుట్ పద్ధతిని మార్చండిని క్లిక్ చేయండి.

  3. పేఅవుట్ పద్ధతి ఫారమ్‌లో, ముందుగా మీ దేశం లేదా ప్రాంతాన్ని, ఆపై మీ కరెన్సీని ఎంచుకోండి.

మీ దేశం లేదా ప్రాంతం మరియు కరెన్సీకి అందుబాటులో ఉండే బదిలీ పద్ధతులు చూపబడతాయి.

పేఅవుట్ పద్ధతిని జోడించండి

మీరు కేవలం ఒక్క పేఅవుట్ పద్ధతిని మాత్రమే కలిగి ఉండగలరు. మీరు మీ ప్రస్తుత పేఅవుట్ పద్ధతిలో మార్పులు చేయాలనుకుంటే, మీరు పాతదాని స్థానంలో కొత్త పేఅవుట్ పద్ధతిని జోడించాలి.

అవసరాలు

  • మీరు ఒక Hyperwallet అకౌంట్‌ను సృష్టించారు.
  • వర్తిస్తే, మీరు మీ బ్యాంకింగ్, అకౌంట్ వివరాలను సిద్ధంగా ఉంచుకున్నారు.
  • మీరు బ్యాంక్ ఖాతాను పేఅవుట్ పద్ధతిగా జోడిస్తున్నట్లయితే, మీరు నిజమైన బ్యాంక్ ఖాతాను ఉపయోగించాలి. Payoneer వంటి వర్చువల్ బ్యాంక్ ఖాతాలకు భాగస్వామి పేఅవుట్‌ల కోసం మద్దతు లేదు.

దశలు:

  1. Dev Dashboard నుండి, మీ సంస్థను ఎంచుకుని, ఆపై సంస్థ సెట్టింగ్‌లు తెరవండి. పేఅవుట్‌లు క్లిక్ చేయండి.

  2. మీకు ఇంకా పేఅవుట్ పద్ధతి లేకపోతే, పేఅవుట్‌లను సెటప్ చేయండి విభాగంలో, పేఅవుట్ పద్ధతిని జోడించండి క్లిక్ చేయండి. మీరు మీ ప్రస్తుత పేఅవుట్ పద్ధతిని భర్తీ చేస్తుంటే, పేఅవుట్ పద్ధతిని మార్చండి క్లిక్ చేయండి.

  3. పేఅవుట్ పద్ధతి ఫారమ్‌లో, ముందుగా మీ PayPal ఖాతా లేదా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన దేశం లేదా ప్రాంతాన్ని, ఆపై మీ కరెన్సీని ఎంచుకోండి.

  4. మీరు జోడించాలనుకుంటున్న బదిలీ పద్ధతిని క్లిక్ చేయండి.

  5. ఫీల్డ్‌లను పూరించండి, ఆపై ఫారమ్‌ను సమర్పించండి.

కొత్త పేఅవుట్ పద్ధతి, పేఅవుట్‌లు పేజీలోని తదుపరి పేఅవుట్ విభాగంలో లిస్ట్ చేయబడింది మరియు మీరు ఈ పద్ధతి ద్వారా మీ తదుపరి పేఅవుట్‌ను అందుకుంటారు. కొత్త పేఅవుట్ పద్ధతిని నిర్ధారిస్తూ మీరు Shopify నుండి ఇమెయిల్‌ను కూడా అందుకుంటారు.