Maya మరియు Substance Painter ఉపయోగించి GLB ఫైల్‌లను సృష్టించడం
Shopify అడ్మిన్‌లో ఉత్పత్తికి జోడించగల GLB ఫైల్‌ను ఎగుమతి చేయడానికి మీరు Maya, Substance Painter ఉపయోగించవచ్చు. 3D మోడల్‌లు కస్టమర్‌లకు ఉత్పత్తులను విజువలైజ్ చేయడంలో సహాయపడతాయి, దీని వల్ల వారి నమ్మకం పెరగడంతో పాటు రిటర్న్‌లు తగ్గుతాయి.
ఈ పేజీలో
Mayaలో ఎగుమతి చేయడం కోసం మీ మోడల్‌ను సిద్ధం చేయండి
ఎగుమతి కోసం మీ మోడల్‌ను సిద్ధం చేయడానికి, అది ఒకే మెష్‌గా ఉందని, దానికి సింగిల్ మెటీరియల్ వర్తించబడిందని నిర్ధారించుకోవాలి.
దశలు:
- File > Import...కు వెళ్లి, మీ 3D ఫైల్‌ను ఎంచుకుని, ఆపై Import క్లిక్ చేయడం ద్వారా మీ మోడల్‌ను Mayaలోకి దిగుమతి చేయండి.
- మీ మెష్‌ను ఒకే ఆబ్జెక్ట్‌గా కంబైన్ చేయడానికి Mesh > Combine క్లిక్ చేయండి.
- 0-1 UV స్పేస్‌లోకి మోడల్‌ను అన్‌ర్యాప్ చేయండి. UVలు ఏవీ ఒకదానిపై మరొకటి ఓవర్‌ల్యాప్ కాలేదని నిర్ధారించుకోండి:

- మోడల్‌కు Phong మెటీరియల్‌ను వర్తించండి:
- మోడల్‌పై మీ మౌస్ కర్సర్‌ను ఉంచి, రైట్ క్లిక్ చేసి పట్టుకుని, ఆపై Assign New Material... ఎంచుకోండి.
- డైలాగ్ నుండి, Phongని ఎంచుకోండి.
Maya నుండి మెష్‌ను ఎగుమతి చేయండి
- పూర్తి మెష్‌ని ఎంచుకుని, ఆపై File > Export Selection...ని క్లిక్ చేయండి.
- ఒక ఫైల్ పేరు, ఫైల్‌ను సేవ్ చేయాల్సిన లొకేషన్‌ను నమోదు చేయండి.
- Files of type డ్రాప్-డౌన్ మెను నుండి, OBJexport ఎంచుకోండి.
- Export Selection క్లిక్ చేయండి.
Substance Painterలో OBJ ఫైల్‌ను దిగుమతి చేసి, సిద్ధం చేయండి
- File > Newని క్లిక్ చేయడం ద్వారా కొత్త Substance Painter ప్రాజెక్ట్‌ను సృష్టించండి.
- మెష్‌ను ఎంచుకోవడానికి New project డైలాగ్‌లో, Select క్లిక్ చేయండి.
- మీరు Maya నుండి ఎగుమతి చేసిన OBJ ఫైల్‌ను ఎంచుకుని, ఆపై Open క్లిక్ చేయండి.
- New project విండోలో, OK క్లిక్ చేయండి.
- దీనిలో కేవలం ఒక టెక్చర్ సెట్ మాత్రమే ఉందని తనిఖీ చేయడం ద్వారా మీ మెష్‌ను మీరు సరిగ్గానే ఎగుమతి చేశారని నిర్ధారించుకోండి: Texture set list ప్యానెల్.
- ఒకదాని కంటే ఎక్కువ టెక్స్చర్ సెట్ ప్రదర్శించబడితే, బహుళ టెక్స్చర్ సెట్లును చూడండి.
- ఈ Texture set settings ప్యానెల్‌లో,
+బటన్‌ను క్లిక్ చేసి ఛానెల్‌లను జోడించండి:
- తప్పనిసరి: Ambient occlusion.
- ఐచ్ఛికం: Emissive. మీ మోడల్‌లో కాంతిని వెలువరించే భాగాలు ఉంటే, ఈ ఛానెల్‌ను జోడించండి.
- ఐచ్ఛికం: Opacity. మీ మోడల్‌లో పారదర్శకంగా ఉండే భాగాలు ఉంటే, ఈ ఛానెల్‌ను జోడించండి.
- Texture set settings ప్యానెల్‌లో, Bake Mesh Mapsని క్లిక్ చేయండి.
- మోడల్‌పై టెక్స్చర్‌లను పెయింట్ చేయండి.
బహుళ టెక్స్చర్ సెట్‌లు
మీరు OBJ ఫైల్‌ను Substance Painterలోకి దిగుమతి చేసినప్పుడు, ఒక టెక్స్చర్ సెట్ మాత్రమే ఉండాలి:

ఒకవేళ మీకు ఒకదాని కంటే ఎక్కువ టెక్స్చర్ సెట్‌లు ప్రదర్శించబడితే, మాయా (Maya) నుండి మెష్‌ను ఎగుమతి చేసినప్పుడు కింది వాటిలో ఏదో ఒకటి తప్పుగా జరిగి ఉండొచ్చు:
- మెష్ ఒకే ఆబ్జెక్ట్‌గా కలపబడలేదు.
- మెష్‌కు ఒకటి కంటే ఎక్కువ టెక్స్చర్‌లు కేటాయించబడ్డాయి.
అదే జరిగితే, మీ మోడల్‌ను మళ్లీ మాయా (Maya) నుండి ఎగుమతి చేయండి, అలాగే మెష్ ఒకే ఆబ్జెక్ట్‌గా ఉందో లేదో, దానికి ఒకే టెక్స్చర్ కేటాయించబడిందో లేదో నిర్ధారించుకోండి.
Substance Painter నుండి glTF ఫైల్‌ను ఎగుమతి చేయండి
File > Export Texturesని క్లిక్ చేయండి.
Config డ్రాప్-డౌన్ మెను నుండి, glTF PBR Metal Roughnessను ఎంచుకోండి.
మీరు మీ టెక్స్చర్‌లను సేవ్ చేయాలనుకుంటున్న లొకేషన్‌ను ఎంచుకోండి.
టెక్స్చర్ ఫైల్‌లు ఎంత పెద్దవిగా ఉండాలో నిర్ణయించడానికి డాక్యుమెంట్ పరిమాణాన్ని ఎంచుకోండి.
Exportను క్లిక్ చేయండి.
టెక్స్చర్ ఫైల్‌లను కుదించడం
మీరు మోడల్‌ను ఎగుమతి చేసినప్పుడు, మీరు కింది ఫైల్‌లను కలిగి ఉండాలి:
- modelName.bin
- modelName.glb
- modelName.gltf
- modelNamebaseColor.png
- modelNamenormal.png
- modelName_occlusionRoughnessMetallic.png
glTF PBR Metal Roughness కాన్ఫిగరేషన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, Substance Painter టెక్స్చర్ ఫైల్‌లను PNG ఆకృతిలో మాత్రమే ఎగుమతి చేస్తుంది. టెక్స్చర్ ఫైల్‌లను కుదించడానికి, అలాగే ఆల్ఫా ఛానెల్ అవసరం లేని టెక్స్చర్‌లను JPGకి మార్చడానికి ప్రయత్నించండి. ఇది మొత్తం ఫైల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది, అలాగే ఫైల్ పరిమాణాలు చిన్నవిగా ఉంటే డౌన్‌లోడ్ వేగం, పరస్పర చర్యలు మరింత మెరుగ్గా ఉంటాయి.
మీ ఫైల్ పరిమాణాన్ని 4 MB లేదా అంతకంటే తక్కువ ఉంచడం ఉత్తమం.
GLB ఫైల్‌ను సృష్టించండి
- https://glb-packer-old.glitch.me/ని సందర్శించండి.
- మీరు Substance Painter నుండి ఎగుమతి చేసిన ఫైల్‌లను GLB ప్యాకర్ (Packer) వెబ్ పేజీలోకి లాగి వదలండి.
మీ కంప్యూటర్‌కు out.glb అని పిలువబడే ఫైల్ డౌన్‌లోడ్ చేయబడుతుంది. డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, మీరు ఫైల్ పేరును మార్చవచ్చు, ఆపై దాన్ని Shopifyకి అప్‌లోడ్ చేయవచ్చు.