బార్కోడ్ల గురించి అర్థం చేసుకోవడం
బార్కోడ్లు అంటే లైన్లు, ఖాళీలు, అక్షరాలు మరియు అంకెలతో రూపొందించబడిన స్కాన్ చేయగల చిహ్నాలు. ఇన్వెంటరీని ట్రాక్ చేయడానికి ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలలో, అకౌంటింగ్లో సహాయం చేయడానికి ఇన్వాయిస్లపై లేదా రిటైల్ స్టోర్లలో కొనుగోలు ప్రాసెస్‌లో భాగంగా, ఇలా సప్లై చైన్‌లోని విభిన్న దశలలో ఉత్పత్తులను గుర్తించి, ట్రాక్ చేయడానికి బార్కోడ్లు ఉపయోగించబడతాయి.
ఈ పేజీలో
బార్కోడ్ పదజాలం
బార్కోడ్ సాధారణ పదజాలం గురించి తెలుసుకోవడానికి ఈ కింది పట్టికను సమీక్షించండి:
| పదం | నిర్వచనం |
|---|---|
| గ్లోబల్ ట్రేడ్ ఐటెమ్ నంబర్ (GTIN) | GTIN అనేది ఒక ఉత్పత్తికి సంబంధించిన ప్రత్యేకమైన మరియు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐడెంటిఫైయర్. GTIN అనేది బార్కోడ్ చిహ్నం కింద ప్రింట్ చేయబడిన నంబర్. UPCలు, EANలు మరియు ISBNలు అనేవి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన GTINల రకాలు. GTINల గురించి మరింత తెలుసుకోండి. |
| యూరోపియన్ ఆర్టికల్ నంబర్ (EAN) | EAN (దీనిని GTIN-13 అని కూడా అంటారు) అనేది సాధారణంగా ఉత్తర అమెరికా వెలుపల ప్రపంచవ్యాప్తంగా వినియోగదారు ఉత్పత్తుల కోసం ఉపయోగించే బార్కోడ్ రకం. |
| యూనివర్సల్ ప్రొడక్ట్ కోడ్ (UPC) | UPC (దీనిని GTIN-12 అని కూడా అంటారు) అనేది సాధారణంగా ఉత్తర అమెరికాలో వినియోగదారు ఉత్పత్తుల కోసం ఉపయోగించే బార్కోడ్ రకం. |
| ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్ (ISBN) | ISBN అనేది ప్రతి ప్రత్యేక పుస్తక ఎడిషన్ మరియు వేరియేషన్‌కు కేటాయించబడే సంఖ్యాపరమైన వాణిజ్య పుస్తక ఐడెంటిఫైయర్. ప్రపంచంలో ఎక్కడైనా పుస్తకాన్ని ప్రత్యేకంగా గుర్తించడానికి ISBN కోడ్లు ఉపయోగించబడతాయి. |
| GS1 | GS1 అనేది బార్కోడ్ల వంటి ప్రమాణాలను అభివృద్ధి చేసే మరియు నిర్వహించే లాభాపేక్ష లేని అంతర్జాతీయ సంస్థ. |
| Shopify ద్వారా కేటాయించబడింది | Shopify Fulfillment Network (SFN)లోని అన్ని ఉత్పత్తులకు ఆటోమేటిక్‌గా కేటాయించబడే బార్కోడ్ రకం. |
| ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్ స్టాక్ కీపింగ్ యూనిట్ (FNSKU) | Fulfillment by Amazon (FBA) విక్రేతలు ఉపయోగించే Amazon సంబంధిత బార్కోడ్. ప్రతి FNSKU కూడా X లేదా B అక్షరంతో ప్రారంభమవుతుంది. |
| Amazon స్టాండర్డ్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ASIN) | ఇది ఒక ఉత్పత్తికి లేదా ఉత్పత్తి వేరియేషన్‌కు అనుబంధించబడి ఉన్న ప్రత్యేకమైన Amazon అంతర్గత కేటలాగ్ నంబర్ రకం. ప్రతి ASIN 10 అంకెలను కలిగి ఉంటుంది మరియు ఇందులో అక్షరాలు మరియు అంకెల కలయిక ఉంటుంది. ప్రతి ASIN కూడా X లేదా B అక్షరంతో ప్రారంభమవుతుంది. |
బార్‌కోడ్‌లను ఎప్పుడు ఉపయోగించాలి
థర్డ్-పార్టీ సేవలు మీ ఉత్పత్తులను మేనేజ్ చేయడంలో సహాయపడినప్పుడు లేదా మీకు విస్తృతమైన ఫుల్ఫిల్మెంట్ లేదా ఇన్వెంటరీ ట్రాకింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు బార్కోడ్లు ఉపయోగపడతాయి. మీ ఉత్పత్తులకు బార్కోడ్లు అవసరమయ్యే ఈ కింది సందర్భాలను చెక్ చేయండి:
- ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో ఉత్పత్తులను విక్రయించినప్పుడు
- రిటైల్ స్టోర్లకు టోకుగా ఉత్పత్తులను విక్రయించినప్పుడు
- ఉత్పత్తులు గిడ్డంగి, పంపిణీ కేంద్రం లేదా ఫుల్ఫిల్మెంట్ సేవ ద్వారా వెళ్లినప్పుడు
బార్కోడ్ ప్రయోజనాలు
బార్కోడ్లు బహుళ ప్రయోజనాలను అందిస్తాయి కాబట్టి, అనేక పరిశ్రమలు మరియు వ్యాపారాలు వాటి వర్క్‌ఫ్లోలలో బార్‌కోడ్‌లను ఉపయోగిస్తాయి.
బార్‌కోడ్‌లను ఉపయోగించడం ద్వారా కలిగే ఈ కింది ప్రయోజనాలను సమీక్షించండి:
| ప్రయోజనం | వివరణ | చర్య |
|---|---|---|
| ఖచ్చితమైన ఇన్వెంటరీ ట్రాకింగ్ | మాన్యువల్‌గా ఎంటర్ చేసిన డేటా కంటే బార్కోడ్ డేటా మరింత విశ్వసనీయమైనది. బార్కోడ్లు ఇన్వెంటరీ, ధరల సమాచారం, అలాగే గడువు తేదీ లేదా బరువు లాంటి ఉత్పత్తి సమాచారాన్ని కూడా ట్రాక్ చేయగలవు. | గిడ్డంగులు, డేటాబేస్‌లలో ఇన్వెంటరీని ట్రాక్ చేయడం. |
| రియల్ టైమ్ డేటా | బార్కోడ్లు ఉత్పత్తి సమాచారాన్ని దాదాపు తక్షణమే అందిస్తాయి. డేటాను ఎంటర్ చేయడానికి లేదా రిట్రీవ్ చేయడానికి మీరు అదనంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. | ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లో బార్‌కోడ్‌ని ఉపయోగించి ఉత్పత్తి కోసం సెర్చ్ చేయడం. |
| సులభంగా, వేగంగా ఉపయోగించవచ్చు | బార్కోడ్ స్కానర్లను ఉపయోగించడం సులభం, బార్‌కోడింగ్ కోసం విస్తృతమైన శిక్షణ అవసరం లేదు. | ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలలో బార్‌కోడ్‌లను స్కాన్ చేయడం. |
| విశ్వవ్యాప్తంగా ఆమోదించబడింది | బార్‌కోడ్‌లను ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలలో ఉపయోగిస్తారు, అలాగే ఆమోదిస్తారు. | వివిధ వ్యాపారాలు, పరిశ్రమలలో బార్‌కోడ్‌లను ఉపయోగించడం. |
సాధారణ బార్కోడ్ రకాలు
సాధారణ బార్కోడ్ రకాల గురించి తెలుసుకోవడానికి కింది పట్టికను రివ్యూ చేయండి:
| బార్కోడ్ రకం | నిర్మాణం | సామర్థ్యం | వినియోగం |
|---|---|---|---|
| UPC-A | GTIN-12 | 12 అంకెలు | ఎక్కువగా ఉత్తర అమెరికాలో రీటైల్ ఉత్పత్తులపై ఉపయోగిస్తారు. |
| UPC-E | GTIN-12 | 12 అంకెలు | ఉత్తర అమెరికాలో చిన్న ప్యాకేజీలు లేదా సౌందర్య సాధనాలు, చూయింగ్ గమ్ ప్యాక్‌లు, సిగరెట్లు లాంటి రీటైల్ ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తారు. |
| EAN-13 | GTIN-13 | 13 అంకెలు | ఉత్తర అమెరికా వెలుపల ఎక్కువగా పత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాలు లాంటి రీటైల్ ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తారు. |
| EAN-8 | GTIN-8 | 8 అంకెలు | ఉత్తర అమెరికా వెలుపల చిన్న ప్యాకేజీలు లేదా సౌందర్య సాధనాలు, చూయింగ్ గమ్ ప్యాక్‌లు, సిగరెట్లు లాంటి రీటైల్ ఉత్పత్తులపై ఉపయోగిస్తారు. |
| Code 39 | నాన్-GTIN | 43 క్యారెక్టర్లు | ప్రధానంగా గిడ్డంగుల నిర్వహణ, అలాగే ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ లాంటి పారిశ్రామిక అప్లికేషన్లలో ఉపయోగిస్తారు. ఇది అక్షరాలు, సంఖ్యలను ఎన్కోడ్ చేయగలదు. |
| Code 128 | నాన్-GTIN | 48 క్యారెక్టర్లు | ప్రపంచవ్యాప్తంగా గిడ్డంగుల నిర్వహణ, దుస్తులు, ఫుడ్ ప్రాసెస్, డ్రగ్స్, మెడికల్ ఎక్విప్మెంట్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. Code 128 అంగుళానికి అత్యధిక క్యారెక్టర్లను కలిగి ఉంటుంది, అలాగే ఇది Code 39 కంటే 20-30% చిన్నది. ఇది అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక క్యారెక్టర్లు, కంట్రోల్ కోడ్లను ఎన్కోడ్ చేయగలదు. |
| ISBN | GTIN-13 | 13 అంకెలు (జనవరి 2007కు ముందు 10 అంకెలు) | ప్రపంచవ్యాప్తంగా భౌతిక పుస్తకాలు, ఈ-బుక్స్‌లో ఉపయోగిస్తారు. |
మీరు బార్కోడ్ల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, కెనడా కోసం GS1 బార్కోడ్ చార్ట్ లేదా US కోసం GS1 బార్కోడ్ చార్ట్‌ను రిఫర్ చేయండి.
బార్కోడ్ ప్లేస్మెంట్, ప్రింటింగ్ ఉత్తమ పద్ధతులు
మీరు ఒక ఉత్పత్తిపై బార్‌కోడ్‌ని ప్రింట్ చేసే, ఉంచే విధానం.. మీ బార్‌కోడ్‌ని స్కాన్ చేసే స్కానర్ల సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.
బార్కోడ్ ప్రింటింగ్ పద్ధతులు
మీ ఉత్పత్తి ఆధారంగా, బార్కోడ్లు వివిధ పద్ధతులలో ప్రింట్ చేయబడవచ్చు. బార్కోడ్ ప్రింటింగ్ పద్ధతుల గురించి మరింత తెలుసుకోవడానికి కింది పట్టికను రివ్యూ చేయండి:
| పద్ధతి | వివరణ | ఉదాహరణ ఉత్పత్తులు |
|---|---|---|
| ఉత్పత్తి మీద నేరుగా ప్రింట్ చేయబడిన బార్కోడ్. | ఉత్పత్తి నుండి బార్కోడ్ వేరు కాకూడదనుకున్నప్పుడు, ఉత్పత్తిపైనే నేరుగా బార్‌కోడ్‌ను ప్రింట్ చేయడానికి లేజర్ ప్రింటర్లను ఉపయోగించే ఒక సాధారణ పద్ధతి. | పుస్తకాలు, మెటల్ క్యాన్లు, ప్లాస్టిక్ బాటిళ్లు. |
| ఉత్పత్తికి అటాచ్ చేయబడిన లేబుల్‌పై ప్రింట్ చేయబడిన బార్కోడ్. | చిన్న వ్యాపారాలు లేదా ఉత్పత్తిపై నేరుగా బార్‌కోడ్‌లను ప్రింట్ చేయడానికి లేజర్ ప్రింటర్ లేని వారు ఉపయోగిస్తారు. | స్టేషనరీ, కాఫీ, లూజ్ ప్రొడ్యూస్. |
| ఉత్పత్తికి అటాచ్ చేయబడిన హ్యాంగ్ట్యాగ్పై ప్రింట్ చేయబడిన బార్కోడ్. | బార్కోడ్ల కోసం తగిన ఉపరితలం లేని ఉత్పత్తుల కోసం, అలాగే లేబుల్ అంటుకునే ప్యాడ్ల వల్ల పాడయ్యే ఉత్పత్తుల కోసం ఉపయోగించబడుతుంది. | దుస్తులు, గిఫ్ట్వేర్, టేబుల్ ఉత్పత్తులు. |
| ప్రొడక్ట్ ప్యాకేజింగ్‌పై ప్రింట్ చేయబడిన బార్కోడ్. | పెట్టె లేదా ప్యాకేజీ రూపంలో వచ్చే ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తారు. | బూట్లు, స్కేట్లు, ఎలక్ట్రానిక్స్, అలాగే ప్యాక్ చేయబడిన ఏవైనా ఉత్పత్తులు. |
బార్కోడ్ ప్రింటింగ్ గైడ్‌లైన్స్
మీ బార్కోడ్లు సరైన పరిమాణంలో ఉండేలా, మీరు ప్రింట్ చేసే లేబుల్లపై కట్ అవ్వకుండా లేదా మిస్ అలైన్ కాకుండా చూసుకోవడానికి.. బార్‌కోడ్‌లను సరిగ్గా ఎలా ప్రింట్ చేయాలో వివరించే కింది సాధారణ గైడ్‌లైన్స్‌ను రివ్యూ చేయండి:
- మీరు మీ బార్‌కోడ్‌లను ప్రింట్ చేస్తే, బార్కోడ్ స్కానర్లు వాటిని స్కాన్ చేయడానికి వీలుగా 300 dpi లేదా అంతకంటే ఎక్కువ రిజల్యూషన్‌ని ఉపయోగించండి.
- పెద్ద సంఖ్యలో బార్కోడ్ల బ్యాచ్‌ని ప్రింట్ చేయడానికి ముందు, ఒకే ఒక్క టెస్ట్ షీట్‌ను ప్రింట్ చేసి, బార్కోడ్లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో ధృవీకరించండి.
- బార్కోడ్ నంబర్‌ను ఆ సింబల్ కింద ప్రింట్ చేయండి, ఒకవేళ బార్కోడ్ పాడైనా నంబర్ ద్వారా ఉత్పత్తిని గుర్తించవచ్చు.
- బార్కోడ్ కనీసం 1.5 అంగుళాల వెడల్పు x 1 అంగుళం పొడవు ఉండేలా చూసుకోండి. GS1 ప్రమాణాల సిఫార్సు చేయబడిన పరిమాణాన్ని రివ్యూ చేయండి.
- బార్‌కోడ్‌లను ప్రింట్ చేసేటప్పుడు నలుపు ఇంక్ లేదా మరొక ముదురు రంగును ఉపయోగించండి. ఎరుపు లేదా గోధుమ రంగు ఇంక్‌ని ఉపయోగించకండి.
- సప్లై చైన్‌లో ప్రతి వేరియంట్‌ను గుర్తించేందుకు వీలుగా, ప్రతి ప్రొడక్ట్ వేరియంట్ కోసం ప్రత్యేకమైన బార్‌కోడ్‌లను ప్రింట్ చేయండి.
బార్కోడ్ ప్లేస్మెంట్ గైడ్‌లైన్స్
బార్‌కోడ్‌లను సరిగ్గా ఎలా ప్లేస్ చేయాలో తెలిపే కింది సాధారణ గైడ్‌లైన్స్‌ను రివ్యూ చేయండి:
- ఉత్పత్తిపై బార్‌కోడ్‌లను సమాంతరంగా ఉంచండి, వాటిని మడతపెట్టకండి.
- బార్కోడ్ చుట్టూ టేప్ లేదా ష్రింక్ ర్యాప్‌ని అంటించకండి.
- స్టిక్కర్లు లేదా టెక్స్ట్ ఎలిమెంట్లను మీ బార్‌కోడ్‌కు మరీ దగ్గరగా ఉంచకండి.
- మీ లేబుల్ కోసం ఖాళీ స్థలాన్ని రూపొందించడం కోసం, మీ బార్కోడ్ పైభాగాన్ని లేదా అడుగు భాగాన్ని కత్తిరించవద్దు.
- మీ ఉత్పత్తిపై బహుళ బార్‌కోడ్‌లను ఉంచకండి.
- బార్కోడ్ మీద స్టేపుల్ పిన్స్‌ను కొట్టకండి.
- ఉత్పత్తిపై తగినంత స్థలం లేని ప్రదేశంలో బార్‌కోడ్‌ను ఉంచకండి.
- ఉత్పత్తి అంచులపై బార్‌కోడ్‌లను ఉంచకండి.
- మీ ఉత్పత్తి చతురస్రం, దీర్ఘచతురస్రం, వృత్తాకారం, పుటాకారం లేదా కుంభాకార ఆకృతిలో ఉన్నట్లయితే, అప్పుడు స్పాట్ లేబుల్స్, హ్యాంగ్ట్యాగ్లు లేదా కార్డెడ్ స్లీవ్లను ఉపయోగించడాన్ని పరిగణించండి.
బార్కోడ్ ప్రింటింగ్, లేబుల్ సెటప్ గురించిన ఉత్తమ పద్ధతులపై మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే, ఉత్పత్తులపై బార్‌కోడ్‌లను ఉంచడం కోసం GS1 మార్గదర్శకాలను చూడండి.