మార్కెట్‌ల కోసం అంతర్జాతీయ SEO

మీ స్టోర్ అంతర్జాతీయ SEO ఉత్తమ పద్ధతులను అనుసరించడంలో సహాయపడే అంతర్నిర్మిత ఫీచర్‌లను మార్కెట్‌లు కలిగి ఉంటాయి. మీరు డొమైన్‌లు, భాషలు మరియు స్థానికీకరించిన కంటెంట్‌తో మార్కెట్‌లను కాన్ఫిగర్ చేసినప్పుడు, hreflang ట్యాగ్‌లు, కానానికల్ URLలు, సైట్‌మ్యాప్‌లు, అలాగే క్రాలర్ యాక్సెస్ వంటి అంతర్జాతీయ స్టోర్‌ల నుండి సెర్చ్ ఇంజిన్‌లు ఆశించే సాంకేతిక అవసరాలు ఆటోమేటిక్‌గా నిర్వహించబడతాయి.

అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం URL నిర్మాణం

మీ అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం మీరు ఎంచుకునే URL నిర్మాణం అనేది వివిధ ప్రాంతాలలో సెర్చ్ ఇంజిన్‌లు మీ స్టోర్‌ను ఎలా గుర్తిస్తాయి మరియు ర్యాంక్ ఇస్తాయి అనే దానిపై ప్రభావం చూపుతుంది. మీరు ప్రతి మార్కెట్ కోసం సబ్‌ఫోల్డర్‌లు, సబ్‌డొమైన్‌లు లేదా టాప్-లెవల్ డొమైన్‌లను ఉపయోగించవచ్చు. మీ ప్రతి మార్కెట్ కోసం డొమైన్‌లను కాన్ఫిగర్ చేయడానికి, అంతర్జాతీయ డొమైన్‌లను మేనేజ్ చేయడం విభాగాన్ని చూడండి.

ఉదాహరణ URLలు, డొమైన్ అథారిటీ ప్రభావం, సెటప్ చేయడానికి పట్టే శ్రమ, అలాగే తగిన పద్ధతులతో కూడిన అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం URL నిర్మాణ ఆప్షన్‌లు.
ఆప్షన్ఉదాహరణడొమైన్ అథారిటీసెటప్ సంక్లిష్టతవీటికి ఉత్తమం
సబ్‌ఫోల్డర్‌లుyourstore.com/fr/ప్రాథమిక డొమైన్‌తో షేర్ చేయబడుతుందిఅత్యల్పంచాలా స్టోర్‌లు
సబ్‌డొమైన్‌లుfr.yourstore.comస్వతంత్రమైనదిమధ్యస్థంస్పష్టమైన మార్కెట్ విభజన
టాప్-లెవల్ డొమైన్‌లుyourstore.frస్వతంత్ర, అత్యంత బలమైన స్థానిక సిగ్నల్అత్యధికంనిర్దిష్ట దేశాలలో బలమైన స్థానిక ఉనికి

సబ్‌ఫోల్డర్‌లు

yourstore.com/fr/ వంటి సబ్‌ఫోల్డర్‌లు మీ ప్రాథమిక డొమైన్‌తో డొమైన్ అథారిటీని పంచుకుంటాయి. మీ ప్రాథమిక డొమైన్ సేకరించిన మొత్తం SEO విలువ మీ అంతర్జాతీయ సబ్‌ఫోల్డర్‌లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

ఎక్కువ స్టోర్‌ల కోసం సబ్‌ఫోల్డర్‌లు సిఫార్సు చేయబడతాయి ఎందుకంటే:

  • వాటిని సెటప్ చేయడం, మేనేజ్ చేయడం చాలా సులభం.
  • అదనపు డొమైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
  • Hreflang ట్యాగ్‌లు అన్ని సబ్‌ఫోల్డర్ వెర్షన్‌లను ఆటోమేటిక్‌గా కనెక్ట్ చేస్తాయి.

సబ్‌డొమైన్‌లు

fr.yourstore.com వంటి సబ్‌డొమైన్‌లను కొన్ని సెర్చ్ ఇంజిన్‌లు వేర్వేరు సైట్‌లుగా పరిగణిస్తాయి. అవి కాలక్రమేణా తమ సొంత డొమైన్ అథారిటీని నిర్మించుకుంటాయి, అంటే అవి సబ్‌ఫోల్డర్‌ల కంటే తక్కువ SEO విలువతో మొదలవుతాయి.

మార్కెట్‌ల మధ్య స్పష్టమైన విభజన అవసరమైనప్పుడు సబ్‌డొమైన్‌లు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రయోజనాల్లో ఇవి ఉంటాయి:

  • మార్కెట్‌ల మధ్య స్పష్టమైన విభజన.
  • ప్రతి మార్కెట్‌కు స్వతంత్ర డొమైన్ అథారిటీ.

సబ్‌డొమైన్‌లకు ప్రతి సబ్‌డొమైన్ కోసం DNS కాన్ఫిగరేషన్ అవసరం.

టాప్-లెవల్ డొమైన్‌లు

yourstore.fr వంటి టాప్-లెవెల్ డొమైన్‌లు నిర్దిష్ట దేశం కోసం బలమైన స్థానిక SEO సిగ్నల్‌ను అందిస్తాయి. దేశం-కోడ్ (country-code) టాప్-లెవెల్ డొమైన్‌లను, ఆ సైట్ ఆ దేశంలోని కస్టమర్‌లకు సంబంధించినది అనడానికి బలమైన సూచికగా సెర్చ్ ఇంజిన్‌లు పరిగణిస్తాయి.

నిర్దిష్ట దేశాల్లో బలమైన ఉనికి, అలాగే బహుళ డొమైన్‌లను మేనేజ్ చేయడానికి వనరులు ఉన్న స్టోర్‌ల కోసం టాప్-లెవెల్ డొమైన్‌లు ఉత్తమం. ప్రయోజనాల్లో ఇవి ఉంటాయి:

  • గమ్యం దేశంలో అత్యంత బలమైన స్థానిక SEO సిగ్నల్.
  • ప్రతి దేశం కోసం స్వతంత్ర డొమైన్ అథారిటీ.
  • ప్రతి మార్కెట్‌లో స్పష్టమైన బ్రాండ్ ఉనికి.

టాప్-లెవెల్ డొమైన్‌లకు ప్రతి దేశం కోసం వేరే డొమైన్ రిజిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్ అవసరం.

అనువదించిన, స్థానికీకరించిన కంటెంట్

సెర్చ్ ఇంజిన్‌లు ప్రత్యేకమైన, స్థానికీకరించిన కంటెంట్‌కు గుర్తింపును అందిస్తాయి. మీ స్టోర్ కంటెంట్‌ను పదానికి పదం అనువదించడం మంచి ఆరంభమే అయినా, ప్రతి మార్కెట్‌కు కంటెంట్‌ను అనుగుణంగా మార్చడం ద్వారా మీ ర్యాంకింగ్‌లు మరింత మెరుగుపడతాయి.

ప్రతి మార్కెట్ కోసం కంటెంట్‌ను అనువదించడానికి, అలాగే అనుగుణంగా మార్చడానికి మీరు Translate & Adapt యాప్ను ఉపయోగించవచ్చు:

  • అనువదించబడిన కంటెంట్: మీ స్టోర్‌ను బహుళ భాషలలోకి అనువదించండి. ప్రతి భాష కోసం సెర్చ్ ఇంజిన్‌లకు ఇండెక్స్ చేయడానికి భిన్నమైన కంటెంట్‌ను ఇస్తూ, మార్కెట్-నిర్దిష్ట URLలు అయిన సబ్‌ఫోల్డర్‌లు, సబ్‌డొమైన్‌లు లేదా టాప్-లెవెల్ డొమైన్‌ల వద్ద అనువదించబడిన పేజీలు అందించబడతాయి.
  • అనుగుణంగా మార్చబడిన కంటెంట్: కేవలం అనువాదానికి మించి మార్కెట్-నిర్దిష్ట కంటెంట్‌ను సృష్టించండి. ఉదాహరణకు, మీరు ఇతర మార్కెట్‌లలోని కంటెంట్‌ను మార్చకుండా నిర్దిష్ట ప్రాంతాల కోసం ఉత్పత్తి వివరణలు, ప్రచార వచనం లేదా చట్టపరమైన సమాచారాన్ని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మార్చవచ్చు.

ఆటోమేటిక్ hreflang ట్యాగ్‌లు

కస్టమర్‌ల భాష, అలాగే ప్రాంతం ఆధారంగా వారికి పేజీ ఏ వెర్షన్‌ను ప్రదర్శించాలో Hreflang ట్యాగ్‌లు సెర్చ్ ఇంజిన్‌లకు చెబుతాయి. Hreflang ట్యాగ్‌లు లేకపోతే, సెర్చ్ ఇంజిన్‌లు కస్టమర్‌లకు మీ స్టోర్‌కు సంబంధించి తప్పు భాష వెర్షన్‌ను ప్రదర్శించవచ్చు లేదా మీ అనువాదిత పేజీలను డూప్లికేట్ కంటెంట్‌గా పరిగణించవచ్చు.

మీ మార్కెట్, భాష కాన్ఫిగరేషన్ ఆధారంగా Hreflang ట్యాగ్‌లు ఆటోమేటిక్‌గా రూపొందించబడతాయి. మీరు నిర్దిష్ట భాష ఉన్న మార్కెట్‌కు డొమైన్, సబ్‌ఫోల్డర్ లేదా సబ్‌డొమైన్‌ను కేటాయించినప్పుడు, మీ స్టోర్‌లోని ప్రతి పేజీకి తగిన hreflang ట్యాగ్‌లు జోడించబడతాయి.

ఉదాహరణకు, మీకు ఇవి ఉంటే:

  • yourstore.com: ఇంగ్లీష్, అమెరికా (United States)
  • yourstore.com/fr/: ఫ్రెంచ్, ఫ్రాన్స్
  • yourstore.com/de/: జర్మన్, జర్మనీ

మూడు వెర్షన్‌లను సూచించే Hreflang ట్యాగ్‌లు మీ స్టోర్‌లోని ప్రతి పేజీకి జోడించబడతాయి, కాబట్టి ఏ ప్రేక్షకులకు ఏ వెర్షన్‌ను అందించాలో సెర్చ్ ఇంజిన్‌లకు తెలుస్తుంది.

ఆటోమేటిక్ hreflang ట్యాగ్ స్ట్రక్చర్

ప్రతి hreflang ట్యాగ్ ఒక భాష కోడ్, అలాగే ఒక ఆప్షనల్ ప్రాంతం కోడ్‌ను కలిగి ఉంటుంది:

  • en-us: అమెరికాకు సంబంధించి ఇంగ్లీష్
  • fr-fr: ఫ్రాన్స్‌కు సంబంధించి ఫ్రెంచ్
  • de: అన్ని ప్రాంతాలకు సంబంధించి జర్మన్

x-default hreflang ట్యాగ్ అనేది మీ బ్యాకప్ ప్రాంతం ఉన్న మార్కెట్‌కి సంబంధించిన పేజీ URLని ఆ మార్కెట్ డిఫాల్ట్ భాషలో పాయింట్ చేస్తుంది, ఉదాహరణకు yourstore.com/products/shirt లేదా yourstore.com/en-us/products/shirt. కస్టమర్ భాష లేదా ప్రాంతానికి ఏ ఇతర hreflang ట్యాగ్ మ్యాచ్ కానప్పుడు, ఏ URLని ప్రదర్శించాలో సెర్చ్ ఇంజిన్‌లకు ఇది చెబుతుంది. ఆ మార్కెట్‌లో పబ్లిష్ అయిన ప్రతి భాషకు ఒక భాష-మాత్రమే ఉండే ట్యాగ్ ఉంటుంది, ఉదాహరణకు en లేదా fr, ఇది ఆ భాషలోని ఆ మార్కెట్ URLని పాయింట్ చేస్తుంది.

Hreflang ట్యాగ్ రూపకల్పన సంబంధిత అంశాలు

Hreflang ట్యాగ్ రూపకల్పన కోసం కింది అంశాలను రివ్యూ చేయండి:

  • భిన్నమైన డొమైన్, సబ్‌డొమైన్ లేదా సబ్‌ఫోల్డర్‌ను కలిగి ఉన్న మార్కెట్‌లకు మాత్రమే Hreflang ట్యాగ్‌లు రూపొందించబడతాయి. మీ మార్కెట్‌లన్నీ ఎలాంటి భాష లేదా ప్రాంతం విత్యాసం లేకుండా ఒకే URLను ఉపయోగిస్తుంటే, రిఫరెన్స్ కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ వెర్షన్‌లు ఉండవు.
  • మీరు మార్కెట్ డొమైన్, భాష సెట్టింగ్‌లను జోడించినప్పుడు, తీసివేసినప్పుడు లేదా మార్చినప్పుడు Hreflang ట్యాగ్‌లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడతాయి.
  • ఉత్పత్తి పేజీలలో, ప్రాంత-ఆధారిత hreflang ట్యాగ్‌లు ఉత్పత్తిని కలిగి ఉండే మార్కెట్‌లకు మాత్రమే జెనరేట్ చేయబడతాయి. ఈ ఉత్పత్తుల కోసం x-default ట్యాగ్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి, కొన్ని మార్కెట్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఉత్పత్తులను చూడండి.

ఆటోమేటిక్ hreflang ట్యాగ్‌లను ఆఫ్ చేయండి

అన్ని స్టోర్‌ల కోసం ఆటోమేటిక్ hreflang ట్యాగ్‌లు డిఫాల్ట్‌గా ఆన్ చేయబడతాయి. ఒకవేళ మీరు మీరే ట్యాగ్‌లను మేనేజ్ చేయాలనుకుంటే (hreflang ట్యాగ్‌లను జోడించే థీమ్ లేదా యాప్‌ని ఉపయోగించడం వంటివి), నకిలీలను నివారించడానికి మీరు ఆటోమేటిక్ hreflang ట్యాగ్‌లను ఆఫ్ చేయవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్ > ప్రాధాన్యతలుకు వెళ్లండి.

  2. సోషల్ షేరింగ్ చిత్రం మరియు SEO విభాగంలో, ఆటోమేటిక్ hreflang ట్యాగ్‌లను ఆఫ్ చేయండి.

  3. సేవ్ క్లిక్ చేయండి.

మీరు ఆటోమేటిక్ hreflang ట్యాగ్‌లను ఆఫ్ చేస్తే, మీ స్వంత hreflang ట్యాగ్‌లను మీ థీమ్‌కు జోడించాల్సి ఉంటుంది.

ఆటోమేటిక్ hreflang ట్యాగ్‌లను ఆన్ చేయండి

మీరు ఆటోమేటిక్ hreflang ట్యాగ్‌లను ఎప్పుడైనా మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు. మీరు అలా చేసే ముందు, మీ స్టోర్ థీమ్ నుండి అన్ని కస్టమ్ ట్యాగ్‌లను తీసివేయండి, అలాగే కస్టమ్ థీమ్ లేదా యాప్ ద్వారా కొత్త ట్యాగ్‌లు ఏవీ జోడించబడకుండా చూసుకోండి.

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్ > ప్రాధాన్యతలుకు వెళ్లండి.

  2. సోషల్ షేరింగ్ చిత్రం మరియు SEO విభాగంలో, ఆటోమేటిక్ hreflang ట్యాగ్‌లను ఆన్ చేయండి.

  3. సేవ్ క్లిక్ చేయండి.

ఆటోమేటిక్ కానానికల్ (canonical) URLలు

బహుళ URLలు ఒకే విధమైన కంటెంట్‌ను అందిస్తున్నప్పుడు పేజీ ఏ వెర్షన్ ప్రాథమిక వెర్షనో కానానికల్ (canonical) URLలు సెర్చ్ ఇంజిన్‌లకు తెలియజేస్తాయి. ఇది మీ సెర్చ్ ర్యాంకింగ్‌లను తగ్గించే డూప్లికేట్ కంటెంట్ సమస్యలను నిరోధిస్తుంది.

అన్ని పేజీలలో కానానికల్ URLలు ఆటోమేటిక్‌గా సెట్ చేయబడతాయి. ఒకే పేజీకి సంబంధించి మీకు మార్కెట్‌కి-ప్రత్యేకమైన వెర్షన్‌లు ఉన్నప్పుడు, ఉదాహరణకు yourstore.com/products/shirt ఇంకా yourstore.com/fr/products/shirt, ప్రతి వెర్షన్‌లో ఒక స్వీయ-రిఫరెన్సింగ్ కానానికల్ URL, అలాగే అన్ని వెర్షన్‌లను కలిపే hreflang ట్యాగ్‌లు ఉంటాయి.

ఇవి వేర్వేరు ప్రేక్షకుల కోసం సంబంధించినవి, అయితే విభిన్నమైన పేజీలు అని, అలాగే అవి డూప్లికేట్ కంటెంట్ కాదని ఇది సెర్చ్ ఇంజిన్‌లకు సూచిస్తుంది.

అంతర్జాతీయ సైట్‌మ్యాప్ రూపకల్పన

మీ స్టోర్‌లోని అన్ని పేజీలను కనుగొనడంలో, ఇండెక్స్ చేయడంలో సైట్‌మ్యాప్‌లు సెర్చ్ ఇంజిన్‌లకు సహాయపడతాయి. అంతర్జాతీయ స్టోర్‌ల కోసం, ప్రతి పేజీ అన్ని భాషా, ప్రాంతాల-నిర్దిష్ట వెర్షన్‌లను సైట్‌మ్యాప్‌లు తప్పక చేర్చాలి.

సైట్‌మ్యాప్‌లు ఆటోమేటిక్‌గా రూపొందించబడతాయి, అలాగే అన్ని మార్కెట్-నిర్దిష్ట URLలను కలిగి ఉంటాయి. మీరు సబ్‌ఫోల్డర్, సబ్‌డొమైన్ లేదా ప్రత్యేక డొమైన్‌తో కొత్త మార్కెట్‌ను జోడించినప్పుడు, ఆ మార్కెట్ కోసం అన్ని పేజీలను చేర్చడానికి సైట్‌మ్యాప్ అప్‌డేట్ చేయబడుతుంది.

సైట్‌మ్యాప్‌లోని ప్రతి URL Hreflang ఉల్లేఖనాలను కలిగి ఉంటుంది, తద్వారా అదే పేజీ విభిన్న భాషలు, ప్రాంతాల వెర్షన్‌ల మధ్య ఉన్న సంబంధాన్ని సెర్చ్ ఇంజిన్‌లు అర్థం చేసుకోగలవు. మీ సైట్‌మ్యాప్‌ను సెర్చ్ ఇంజిన్‌లకు సమర్పించడానికి, దయచేసి మీ సైట్‌మ్యాప్‌ను కనుగొనడం, సమర్పించడం గురించి పరిశీలించండి.

కొన్ని మార్కెట్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఉత్పత్తులు

ఉత్పత్తిని కేవలం మీ కొన్ని మార్కెట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంచడానికి, మీరు కేటలాగ్‌లను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక ఉత్పత్తిని దేశీయ మార్కెట్‌లో కాకుండా కేవలం అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రమే విక్రయించవచ్చు. ఈ మార్కెట్‌లలో దేనికైనా దాని స్వంత డొమైన్, సబ్‌డొమైన్ లేదా సబ్‌ఫోల్డర్ ఉన్నప్పుడు, ఆ మార్కెట్ SEO ఫీచర్‌లు ఆ మార్కెట్‌లో చేర్చని ఉత్పత్తిని అందుబాటులో లేనిదిగా పరిగణిస్తాయి:

  • ఉత్పత్తి పేజీ: ఉత్పత్తిని కలిగి ఉండని మార్కెట్‌లో, కస్టమర్‌లకు మరియు సెర్చ్ ఇంజిన్ క్రాలర్‌లకు ఉత్పత్తి URL అనేది మీ స్టోర్‌ 404 పేజీని చూపుతుంది.
  • సైట్‌మ్యాప్: ప్రతి మార్కెట్ సైట్‌మ్యాప్, ఆ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులను మాత్రమే లిస్ట్ చేస్తుంది.
  • కానానికల్ URL: ప్రతి మార్కెట్‌లోని ఉత్పత్తి పేజీ ఒక స్వీయ-రిఫరెన్సింగ్ కానానికల్ URLని కలిగి ఉంటుంది. ఇది వేరొక మార్కెట్‌లోని పేజీ వెర్షన్‌ను పాయింట్ చేయదు.
  • Hreflang ట్యాగ్‌లు: ఉత్పత్తిని చేర్చని మార్కెట్‌ల కోసం ప్రాంత-ఆధారిత hreflang ట్యాగ్‌లు జెనరేట్ చేయబడవు. x-default ట్యాగ్ అలాగే en లేదా fr వంటి భాష-మాత్రమే ఉండే ట్యాగ్‌లు, మీ బ్యాకప్ ప్రాంతం ఉన్న మార్కెట్‌ని లేదా ఆ మార్కెట్‌కి దాని స్వంత డొమైన్ లేదా సబ్‌ఫోల్డర్ లేకపోతే, మీ ప్రాథమిక డొమైన్‌ను పాయింట్ చేస్తాయి. ఒకవేళ ఆ URLకి సంబంధించిన మార్కెట్‌లో ఉత్పత్తి లేకపోతే, ఈ ట్యాగ్‌లు మీ స్టోర్ 404 పేజీని చూపే URLని పాయింట్ చేస్తాయి.

ఉత్పత్తిని ఏయే మార్కెట్‌లు విక్రయిస్తున్నాయో వాటిలో మాత్రమే అది ఇండెక్స్ అయ్యేలా చేయడానికి, ఆయా మార్కెట్‌ల కేటలాగ్‌లలో మాత్రమే ఉత్పత్తిని చేర్చండి, అలాగే ఆ మార్కెట్‌లన్నింటికీ వాటి స్వంత డొమైన్, సబ్‌డొమైన్ లేదా సబ్‌ఫోల్డర్‌ను ఇవ్వండి. సెర్చ్ ఇంజిన్‌లు అనేక మార్కెట్‌లు షేర్ చేసుకునే URLలోని ఒక వెర్షన్‌ను మాత్రమే ఇండెక్స్ చేస్తాయి. ఆ వెర్షన్ మీ బ్యాకప్ ప్రాంతం ఉన్న మార్కెట్‌కు సంబంధించినదై ఉంటుంది. ఆ URLలోని ఏ మార్కెట్‌లో కూడా మీ బ్యాకప్ ప్రాంతం లేకపోతే, Shopify వాటన్నింటిలో ఒకదానిని ఎంచుకుంటుంది, దానిని మీరు నిర్ణయించలేరు. ఆ URLలోని మిగతా మార్కెట్‌లలో ఒకదానిలో మాత్రమే అందుబాటులో ఉండే ఉత్పత్తి ఇండెక్స్ చేయబడదు. షేర్ చేయబడిన డొమైన్‌లను ఉపయోగించే మార్కెట్‌ల గురించి మరింత తెలుసుకోండి.

seo.hidden మెటాఫీల్డ్ మీ మార్కెట్‌లన్నింటిలోనూ సెర్చ్ ఇంజిన్‌ల నుండి ఉత్పత్తిని దాచుతుంది, కాబట్టి కేవలం కొన్ని మార్కెట్‌లలో మాత్రమే ఉత్పత్తిని దాచడానికి మీరు దీనిని ఉపయోగించలేరు. ఉత్పత్తిని మార్కెట్‌లో విక్రయించడం కొనసాగించడానికి కానీ సెర్చ్ ఇంజిన్‌ల నుండి ఆ మార్కెట్‌కు సంబంధించిన పేజీ వెర్షన్‌ను మినహాయించడానికి, మీరు షరతులతో కూడిన noindex మెటాట్యాగ్‌ను మీ థీమ్‌కు జోడించవచ్చు.

మీ థీమ్ లేదా ఏదైనా యాప్ దాని స్వంత hreflang ట్యాగ్‌లను జోడిస్తే, ఆ ట్యాగ్‌లు ఒక్కో ఉత్పత్తిని కలిగి ఉన్న మార్కెట్‌లను మాత్రమే రిఫరెన్స్ చేస్తున్నాయని నిర్ధారించుకోండి. నకిలీ ట్యాగ్‌లను నివారించడానికి, మీ స్వంత ట్యాగ్‌లు లేదా ఆటోమేటిక్ hreflang ట్యాగ్‌లు వాడండి, ఈ రెండింటినీ ఉపయోగించకండి. ఆటోమేటిక్ hreflang ట్యాగ్‌లను ఆఫ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

సెర్చ్ ఇంజిన్ క్రాలర్ (crawler) యాక్సెస్

మీ స్టోర్ అన్ని వెర్షన్‌లను సరిగ్గా ఇండెక్స్ చేయడానికి సెర్చ్ ఇంజిన్ క్రాలర్‌లు వాటిని యాక్సెస్ చేయాలి. లొకేషన్ ఆధారంగా క్రాలర్‌లను దారి మళ్లించడం వలన అవి మీ స్టోర్‌కు సంబంధించి కేవలం ఒక వెర్షన్‌ను మాత్రమే ఇండెక్స్ చేస్తాయి.

ఆటోమేటిక్ మళ్లింపు అనేది కస్టమర్‌లకు వర్తిస్తుంది, కానీ సెర్చ్ ఇంజిన్ క్రాలర్‌లు దీని నుండి మినహాయించబడ్డాయి. క్రాలర్ మీ స్టోర్‌ను సందర్శించినప్పుడు, అది మరే ఇతర మార్కెట్ వెర్షన్‌కు మళ్లించబడకుండా, అభ్యర్థించిన URL కోసమే కంటెంట్‌ను అందుకుంటుంది. దీనర్థం మీ స్టోర్‌కు సంబంధించిన అన్ని వెర్షన్‌లు సరిగ్గా ఇండెక్స్ చేయబడతాయి.

మీరు ఆటోమేటిక్ మళ్లింపును యాక్టివేట్ చేసినప్పుడు, మీ కస్టమర్‌లు దాన్ని పొందుతూనే ఉంటారు. కేవలం తెలిసిన సెర్చ్ ఇంజిన్ క్రాలర్‌లు మాత్రమే మినహాయించబడతాయి.

క్రాలర్‌లు మీ స్టోర్‌ను ఎలా యాక్సెస్ చేస్తాయో అనుకూలీకరించడానికి, మీరు మీ robots.txt.liquid ఫైల్‌ను ఎడిట్ చేయవచ్చు.